అన్వేషించండి

హాలీవుడ్ సినిమాలను తలపించేలా 'సలార్' యాక్షన్ సీక్వెన్స్ - అంచనాలు పెంచేస్తోన్న లేటెస్ట్ అప్డేట్!

ప్రభాస్ నటించిన 'సలార్' మూవీలో యాక్షన్ సీక్వెన్స్ లు హాలీవుడ్ ను తలపించేలా ఉంటాయట. ఈ సినిమా యాక్షన్ సీన్స్ కోసం దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏకంగా 750 వాహనాలను వినియోగించినట్లు తెలుస్తోంది.

ఇండియన్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'సలార్'(Salaar) కోసం సినీ లవర్స్ ఎంత ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'కేజిఎఫ్' మూవీ తో పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ఈ మూవీని తెరకెక్కించడం, చాలాకాలం తర్వాత ప్రభాస్ చేస్తున్న అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిలిం కావడంతో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. దాదాపు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో హోంబలే ఫిలింస్ నిర్మాణ సంస్థ పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అన్ని బాగుండుంటే ఇప్పటికే ఈ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చేది. కానీ బెస్ట్ అవుట్ పుట్ కోసం మూవీ రిలీజ్ ని డిసెంబర్ 22 కు వాయిదా వేశారు.

Also Read: 'తంగలాన్' లో విక్రమ్ డైలాగ్స్ పై స్పందించిన మేనేజర్ - తప్పుగా అర్థం చేసుకున్నారంటూ!

ప్రస్తుతం 'సలార్' పోస్ట్ ప్రొడక్షన్ ఓవైపు, సీజీ వర్క్ మరోవైపు చకచక జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో సలార్ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో హల్చల్ చేస్తోంది. సలార్ పై ఉన్న అంచనాలను మరింత పెంచుతూ ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికి వచ్చింది. అదేంటంటే, ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు హాలీవుడ్ ని తలపించేలా ఉంటాయట. ఈ మూవీ చిత్రీకరణ కోసం ప్రశాంత్ నీల్ ఏకంగా 750 విభిన్న వాహనాలను వినియోగించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఎక్కువ శాతం గ్రౌండ్ పైనే యాక్షన్ సీక్వెన్స్ లు డిజైన్ చేయడంతో భారీ వాహనాలను ఉపయోగించారట.

జీప్ లు, ట్యాంకులు, ట్రక్కులతో యాక్షన్ సీక్వెన్స్ లను షూట్ చేశారని సమాచారం. భారీ మొత్తంలో వాహనాలను ఉపయోగించి యుద్ద సన్నివేశాలను డిజైన్ చేయడం కేవలం హాలీవుడ్ సినిమాలకే సాధ్యమవుతుంది. అలాంటిది ప్రశాంత్ నీల్ మాత్రం హాలీవుడ్ సినిమాలకు దీటుగా సలార్ కోసం భారీ వాహనాలను వినియోగించి యాక్షన్ సీక్వెన్స్ లను చిత్రీకరించినట్లు చెబుతున్నారు. ప్రభాస్ నుంచి భారీ యాక్షన్ ఫిలిం కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఈ న్యూస్ విని తెగ ఖుషి అవుతున్నారు. ఈ అప్డేట్ తో సలార్ లో ప్రభాస్ హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తో అదరగొట్టబోతున్నట్లు స్పష్టం అవుతుంది. ఇప్పటికే విడుదలైన సలార్ టీజర్ ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే.

Also Read: నాగార్జునతో సినిమా కోసం 17 ఏళ్లుగా ఎదురుచూస్తున్నా - ఇప్పటికీ ఆయన కథ వినలేదు, కాదంబరి కిరణ్ సంచలన వ్యాఖ్యలు!

త్వరలోనే ట్రైలర్ ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా సలార్ మూవీ రెండు భాగాలుగా రాబోతోంది. అందులో సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ పేరుతో విడుదల కానుంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషలతో పాటు ఇంగ్లీష్ వెర్షన్ లోనూ సలార్ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఈశ్వరి రావు, శ్రియా రెడ్డి, సప్తగిరి, టీనూ ఆనంద్ కీలక పాత్రలు పోషిస్తుండగా.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు విలన్ రోల్స్ లో కనిపించనున్నారు. హోంబలే ఫిల్మ్స్ అధినేత విజయ్ కిరగందుర్ నిర్మించిన ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, భువన గౌడ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.

Also Read : ఆ ప్రాజెక్ట్ తర్వాతే సీక్వెల్ ఉంటుంది - 'ఖైదీ 2' పై క్లారిటీ ఇచ్చిన కార్తీ!

టాప్ హెడ్ లైన్స్

Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Embed widget