అన్వేషించండి

'తంగలాన్' లో విక్రమ్ డైలాగ్స్ పై స్పందించిన మేనేజర్ - తప్పుగా అర్థం చేసుకున్నారంటూ!

'తంగలాన్' మూవీలో విక్రమ్ కి డైలాగ్స్ లేవనే విషయంపై తాజాగా హీరో విక్రమ్ మేనేజర్ సూర్యనారాయణ తన ట్విట్టర్ వేదికగా స్పందించారు.

Thangalaan: రీసెంట్ గా 'పొన్ని యన్ సెల్వన్' మూవీతో మంచి సక్సెస్ అందుకున్న కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ త్వరలోనే 'తంగలాన్'(Thangalaan) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత ఈ సినిమా కోసం ప్రయోగం చేశాడు విక్రమ్. రీసెంట్ గా విడుదలైన టీజర్ లో విక్రమ్ గెటప్ చూసి అందరూ షాక్ అయిపోయారు. మంచి ఫిజిక్ తో ఉండే విక్రమ్ తంగలాన్ కోసం పూర్తిగా బరువు తగ్గిపోయి బక్క చిక్కిపోయి కనిపించాడు. సినిమా కోసం ఏకంగా 20 కేజీల బరువు తగ్గి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇలాంటి ప్రయోగాలు విక్రమ్ కి కొత్తమీ కాదు. గతంలో 'శివపుత్రుడు', 'అపరిచితుడు', 'ఐ' సినిమాల్లో చేసి ప్రేక్షకుల్ని అలరించాడు.

మొన్నటి వరకు ఈ సినిమా గురించి ఎవరో మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే తంగలాన్ టీజర్ విడుదలైందో అప్పటినుంచి సౌత్లో ఈ మూవీ గురించి డిస్కషన్ నడుస్తోంది. నార్త్ లో కూడా 'తంగలాన్' మూవీ పై బజ్ పెరుగుతోంది. ఇక రీసెంట్ గా హైదరాబాదులో మూవీ టీం టీజర్ రిలీజ్ చేసి ప్రెస్ మీట్ నిర్వహించగా, ఆ ప్రెస్ మీట్ లో విక్రమ్ సినిమా గురించి ఎన్నో విషయాలను బయటపెట్టారు. అందులో ప్రధానంగా 'తంగలాన్' సినిమాలో తనకు ఎటువంటి డైలాగ్స్ లేవని విక్రమ్ చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. ముఖ్యంగా ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. 'తంగలాన్' మూవీ విక్రమ్ నటించిన 'శివపుత్రుడు' తరహాలోనే ఉండబోతుందని వార్తలు సైతం వైరల్ అయ్యాయి.

ఇదే సమయంలో ఒక హీరో పాత్రకు డైలాగ్స్ లేకుంటే అది సినిమాకే నష్టం అనే వాదన కూడా వచ్చింది. ఇలాంటి గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో చియాన్ విక్రమ్ మేనేజర్ సూర్యనారాయణ తన ట్విట్టర్ వేదికగా స్పందించారు. సినిమా టీజర్ లో మాత్రమే విక్రమ్ కి డైలాగ్స్ లేవని, కానీ సినిమాలో ఆయన డైలాగ్స్ ఉన్నాయని వివరించారు. దీన్ని తప్పుగా అర్థం చేసుకుని సినిమా మొత్తంలో డైలాగ్స్ ఉండవని అందరూ అనుకుంటున్నారని, అలాంటిదేమీ లేదంటూ చెప్పారు. అంతేకాకుండా తంగలాన్ సినిమాలో విక్రమ్ మేకోవర్ మాత్రమే కాదు డైలాగ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. దీంతో కొద్దిరోజుల నుంచి తంగలాన్ మూవీలో విక్రమ్ డైలాగ్స్ పై స్ప్రెడ్ అవుతున్న రూమర్స్ కు చెక్ పడినట్లు అయింది.

కాగా కోలార్ గోల్డ్ ఫైల్స్ నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కింది. 'కబాలి', 'కాలా' 'సార్పట్టా' వంటి సినిమాలను తెరకెక్కించిన పా. రంజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పార్వతి తిరువోతూ, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో పశుపతి, డానియల్, హరికృష్ణన్, అన్బుదురై ఇతర కీలక పాత్రలు పోషించారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఏ. కిషోర్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా, సెల్వ ఆర్కే ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కే.ఈ జ్ఞానవేల్ రాజా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 26న తమిళం తో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

Also Read : మొన్న 'బ్రో' నేడు 'వాల్తేరు వీరయ్య' - టీవీల్లో మెగాస్టార్ మూవీకి డిజాస్టర్ రేటింగ్స్!

 

టాప్ హెడ్ లైన్స్

Jio Hotstar August Movies : జియో హాట్ స్టార్‌లో ఆగస్ట్ ఫెస్టివల్ - ఈ నెలలో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ / వెబ్ సిరీస్‌లు
జియో హాట్ స్టార్‌లో ఆగస్ట్ ఫెస్టివల్ - ఈ నెలలో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ / వెబ్ సిరీస్‌లు
Hrithik Roshan Vs Kangana Ranaut: సారీ హృతిక్... ఇంటర్నెట్‌లో జెన్ జీ రచ్చ... కంగనా ఫైర్ - అసలు ఏం జరిగిందంటే?
సారీ హృతిక్... ఇంటర్నెట్‌లో జెన్ జీ రచ్చ... కంగనా ఫైర్ - అసలు ఏం జరిగిందంటే?
Netflix August Movies : ఆగస్టులో టాప్ 10 మూవీస్ - నెట్ ఫ్లిక్స్‌లో డోంట్ మిస్... ఏయే తేదీల్లో ఏ మూవీ చూడొచ్చంటే?
ఆగస్టులో టాప్ 10 మూవీస్ - నెట్ ఫ్లిక్స్‌లో డోంట్ మిస్... ఏయే తేదీల్లో ఏ మూవీ చూడొచ్చంటే?
Pooja Hegde Marriage : పెళ్లీ పీటలెక్కబోతున్న స్టార్ హీరోయిన్ - అరేంజ్డ్ మ్యారేజ్‌కు బుట్టబొమ్మ గ్రీన్ సిగ్నల్?... ఆ వార్తల్లో నిజమెంత!
పెళ్లీ పీటలెక్కబోతున్న స్టార్ హీరోయిన్ - అరేంజ్డ్ మ్యారేజ్‌కు బుట్టబొమ్మ గ్రీన్ సిగ్నల్?... ఆ వార్తల్లో నిజమెంత!

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget