అన్వేషించండి

మొన్న 'బ్రో' నేడు 'వాల్తేరు వీరయ్య' - టీవీల్లో మెగాస్టార్ మూవీకి డిజాస్టర్ రేటింగ్స్!

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' మూవీ రీసెంట్ గా దసరా ప్రీమియర్ గా స్మాల్ స్క్రీన్ పై సందడి చేయగా.. బుల్లితెరపై ఈ చిత్రానికి డిజాస్టర్ రేటింగ్స్ వచ్చాయి.

మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ తాజాగా బుల్లితెరపై షాకింగ్ రిజల్ట్ అందుకుంది. థియేటర్స్ లో బ్లాక్ బాస్టర్ హిట్ అయిన ఆ మూవీ టీవీలో మాత్రం డిజాస్టర్ రేటింగ్స్ ని నమోదు చేసింది. మొన్న పవన్ కళ్యాణ్ 'బ్రో' మూవీకి కూడా దారుణమైన రేటింగ్స్ రాగా, ఇప్పుడు మెగాస్టార్ మూవీకి సైతం అదే రిజల్ట్ వచ్చింది.  డీటెయిల్స్ లోకి వెళ్తే.. టాలీవుడ్ లో ఈ ఏడాది ఆరంభంలో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రాల్లో మెగాస్టార్ నటించిన 'వాల్తేరు వీరయ్య' మూవీ ఒకటి. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మెగాస్టార్ తన వింటేజ్ లుక్, పర్ఫామెన్స్ తో అదరగొట్టేసారు. దీంతో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ని అందుకుని  హిట్ ని సొంతం చేసుకుంది.

Also Read: 'పొలిమేర 2' రివ్యూ : థియేటర్లలో హిట్ అయ్యే కంటెంట్ ఉందా? ఫస్ట్ పార్ట్ కంటే బావుందా?

నిర్మాతలకి భారీ లాభాలను కూడా అందించింది. మెగాస్టార్ వీరాభిమాని అయిన దర్శకుడు బాబి సినిమాలో చిరుని చూపించిన విధానానికి ఫ్యాన్స్ అంతా ఫిదా అయిపోయారు. దాంతో థియేటర్స్ తో సహా ఓటీటీ లో కూడా ఈ మూవీ మంచి రెస్పాన్స్ ని అందుకుంది. అయితే రీసెంట్ గా దసరా ప్రీమియర్ గా 'వాల్తేరు వీరయ్య' తెలుగు బుల్లితెరపై మొట్టమొదటిసారి టెలికాస్ట్ కాగా ఇక్కడ మాత్రం ఫెయిల్ అయిందనే చెప్పాలి. మొదటిసారి ఈ మూవీ స్మాల్ స్క్రీన్ పై టెలికాస్ట్ అవడంతో మంచి రేటింగ్స్ వస్తాయి అని అంతా అనుకున్నారు. కానీ ఎవరు ఊహించిన విధంగా ఈ మూవీకి కేవలం 5.14 టిఆర్పి రేటింగ్ మాత్రమే వచ్చింది. ఈ రేటింగ్ డిజాస్టర్ ని సూచిస్తుంది.

ఈ మూవీ కంటే యావరేజ్ చిత్రం గా నిలిచిన పవన్ కళ్యాణ్ 'బ్రో' మూవీకి మొన్న 6 కి పైగా రేటింగ్ వచ్చింది. అలాంటిది మెగాస్టార్ చిరంజీవితో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా భాగమైన 'వాల్తేరు వీరయ్య' థియేటర్స్ లో అంతపెద్ద హిట్ అయి స్మాల్ స్క్రీన్ పై ఇంత తక్కువ రేటింగ్స్ అందుకుని డిజాస్టర్ గా నిలవడం అందరిని షాక్ కి గురిచేస్తోంది. సినిమాని చాలా ఆలస్యంగా బుల్లితెరపై టెలికాస్ట్ చేయడం వల్ల ఇలాంటి రిజల్ట్ వచ్చిందని ఇంకొందరు చెబుతున్నారు. ఎంత ఆలస్యంగా వచ్చినా బ్లాక్ బస్టర్ మూవీకి మరి ఇంత తక్కువ రేటింగ్ రావడం అనేది ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించగా.. రాజేంద్రప్రసాద్, బాబీ సింహ, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు.

Also Read : కీడా కోలా రివ్యూ : తరుణ్ భాస్కర్ క్రైమ్ కామెడీ నవ్వించిందా? లేదా?

మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో ఓ సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నారు. రీసెంట్ గానే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైన ఈ చిత్రానికి 'విశ్వంభర' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ కెరియర్ లో 157 వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీని UV క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఎం. ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి చోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకోనుంది.

Also Read : ఆ ప్రాజెక్ట్ తర్వాతే సీక్వెల్ ఉంటుంది - 'ఖైదీ 2' పై క్లారిటీ ఇచ్చిన కార్తీ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Moto G75 5G: కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
Pawan Kalyan Varahi : ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
Tripti Dimri Controversy: 5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?  
5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?
PPF Rules: పీపీఎఫ్‌ రూల్స్‌ మారాయి - ఇప్పుడు ఎంత వడ్డీ ఇస్తున్నారో తెలుసా?
పీపీఎఫ్‌ రూల్స్‌ మారాయి - ఇప్పుడు ఎంత వడ్డీ ఇస్తున్నారో తెలుసా?
Embed widget