Peddi Update : పెద్దిలో సర్ప్రైజ్ రోల్ - పదేళ్ల క్రితం చరణ్‌కు విలన్‌గా... మరి ఇప్పుడు!
Peddi New Buzz : రామ్ చరణ్ 'పెద్ది'లో మరో స్పెషల్ రోల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దాదాపు పదేళ్ల తర్వాత సీనియర్ నటుడు చరణ్‌తో కలిసి నటించనున్నట్లు సమాచారం.

Sai Kumar Joins Ram Charan Peddi Movie : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబో స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'పై రోజుకో సర్ప్రైజ్ హైప్ మరింత పెంచేస్తోంది. మొన్నటివరకూ స్పెషల్ సాంగ్‌పై సోషల్ మీడియాలో చర్చ సాగగా... ఇప్పుడు మరో బజ్ ట్రెండ్ అవుతోంది. సినిమాలో మరో సీనియర్ నటుడు ఎంట్రీ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.
పదేళ్ల తర్వాత...
దాదాపు పదేళ్ల క్రిితం వచ్చిన రామ్ చరణ్ 'ఎవడు' మూవీలో డైలాగ్ కింగ్ సాయి కుమార్ విలన్ రోల్ చేశారు. ఇప్పుడు మళ్లీ పెద్ది మూవీలో చరణ్ మూవీలో ఓ కీలకపాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. మెగా ఫ్యాన్స్ దగ్గర నుంచీ మూవీ లవర్స్ వరకూ ఇది పెద్ద సర్ప్రైజే అని చెప్పాలి. రీసెంట్‌గా ఓ ఫ్యాన్ చిత్రీకరించిన ఓ వీడియోతో ఇది నిజమని టాక్ వినిపిస్తోంది. ఆయన షూటింగ్‌లో భాగమయ్యారంటూ ప్రచారం సాగుతోంది. అయితే, సాయి కుమార్ రోల్ ఏంటి? అనేది మాత్రం ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
Also Read : ఉస్తాద్ To మాస్ మూవీస్ జాతర - ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు / వెబ్ సిరీస్‌ల కంప్లీట్ లిస్ట్
స్పెషల్ సాంగ్!
ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకోగా... ఓ సాంగ్ మాత్రం బ్యాలెన్స్ ఉన్నట్లు ఇన్ సైడ్ వర్గాల టాక్. ఈ సాంగ్‌లో ముందు మృణాల్ ఠాకూర్ చరణ్‌తో స్టెప్పులేస్తారని ప్రచారం సాగినా... ఆమె స్థానంలో కపుల్ ఫ్రెండ్లీ బ్యూటీ మానసా వారణాసికి ఆ ఛాన్స్ దక్కినట్లు తెలుస్తోంది. ఇదే పాటలో హీరోయిన్ జాన్వీ కపూర్ సైతం స్టెప్పులు వేయనున్నట్లు సమాచారం. ఈ సాంగ్ కంప్లీట్ అయితే షూటింగ్‌కు ప్యాకప్ చెప్పేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌పై ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే రిలీజ్ చేసిన చికిరి చికిరి, రయ్ రయ్ రా రా సాంగ్స్ యూట్యూబ్‌లో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశాయి. రీసెంట్‌గా చరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పహిల్వాన్ స్పెషల్ వీడియో గూస్ బంప్స్ క్రియేట్ చేస్తోంది.
రిలీజ్ ఎప్పుడు?
ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ 30నే మూవీ రిలీజ్ చేస్తామని అటు రామ్ చరణ్, ఇటు మూవీ టీం క్లారిటీ ఇస్తున్నా... మళ్లీ వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటూ ప్రచారం సాగుతోంది. చరణ్ దగ్గర నుంచీ టీం అంతా రాత్రనక పగలనకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఫిలింనగర్ ఇన్ సైడ్ సమాచారం ప్రకారం... జూన్ ఫస్ట్ వీక్ అంటే 4వ తేదీన కానీ, జూన్ 24న కానీ సినిమా రిలీజ్ కావొచ్చంటూ ప్రచారం జరుగుతోంది. మూవీ టీం అఫీషియల్‌గా క్లారిటీ ఇస్తే తప్ప దీనిపై సస్పెన్స్ బ్రేక్ అయ్యే ఛాన్స్ లేదు.
మూవీలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీరితో పాటే కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేం దివ్యేందు శర్మ, జగపతి బాబు, బొమన్ ఇరానీ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు






















