Jabardasth Venky Warning : వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా - జబర్దస్త్ కమెడియన్ వెంకీ స్ట్రాంగ్ వార్నింగ్
Jabardasth Venky Reaction : తనపై వచ్చిన కమిట్మెంట్ ఆరోపణలు అసత్యమని తేలినా ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని జబర్దస్త్ కమెడియన్ వెంకీ మండిపడ్డారు.

Jabardasth Venky Strong Warning To Youtube Channels Over Commitment Allegations : జబర్దస్త్ కమెడియన్ వెంకీ (Jabardasth Venky) తనపై వచ్చిన కమిట్మెంట్ ఆరోపణలను ఆధారాలతో సహా ఫేక్ అని నిరూపించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరో వీడియో రిలీజ్ చేశారు. అంతా కంప్లీట్ అయిపోయినా ఇంకా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
'వారికి స్ట్రాంగ్ వార్నింగ్'
తనకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్ చెప్పారు వెంకీ. 'తాను ఎలాంటి తప్పూ చేయలేదని అందరూ నమ్మారు. నాకు సపోర్ట్‌గా ఉన్నారు. అందరికీ పేరు పేరునా థాంక్స్. అయితే, ఇష్యూ క్లోజ్ అయినా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇంకా వరలక్ష్మి గారిది, నాది ఫోటోస్ పెట్టి ఇంకా అసత్య ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం ఇంతటితో ఆపకుండా ఇంకా యూట్యూబ్‌ల్లో ఎవరైనా పెట్టేది ఉంటే వారిపై లీగల్‌గా యాక్షన్ తీసుకుంటాను. దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో ఆపేయండి.
నేను ముఖ్యంగా థాంక్స్ చెప్పాల్సింది వరలక్ష్మి గారికి. ఆమెకు జరిగిన అన్యాయాన్ని ఆమె ధైర్యంగా చెప్పారు. కొంతమంది దాన్ని తప్పుగా ప్రచారం చేశారు. రియల్‌గా లైవ్‌లోకి వచ్చి వెంకీ అలా చేయలేదని చెప్పడం నిజంగా ఆవిడకు హ్యాట్సాఫ్. ప్రతీ ఒక్క ఆడపిల్ల ఎవరికైనా అన్యాయం జరిగితే ధైర్యంగా బయటకు వచ్చి ఖండించాలి. కొంతమంది మాత్రం నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు ఆరోపణలు చేయకూడదు.' అంటూ చెప్పుకొచ్చారు.
View this post on Instagram
Also Read : NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
అసలేం జరిగిందంటే?
ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ తనను కమిట్మెంట్ అడిగారంటూ చెప్పగా... ఓ టీవీ ఛానల్ జబర్దస్త్ వెంకీ ఫోటోలు వేసి మరీ టెలికాస్ట్ చేశారు. దీంతో స్పందించిన వెంకీ... లైవ్‌లోనే సదరు ఇన్‌ఫ్లుయెన్సర్‌తో మాట్లాడి అది తప్పని నిరూపించుకున్నారు. ఇలాంటి ప్రచారాలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని... ఆమె ఎవరి పేరైతే చెప్పిందో వారి పేరు వేయకుండా తన పేరు వేస్తే ఎలా? అంటూ ప్రశ్నించారు. దీంతో సోషల్ మీడియాలో వెంకీకి అంతా సపోర్ట్ చేశారు. ఇష్యూ అంతా సాల్వ్ అయినా ఇంకా కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వారిపై లీగల్‌గా యాక్షన్ తీసుకుంటానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు వెంకీ.
Also Read : Kalki 2: ప్రభాస్ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
Before You Go
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు






















