MM Keeravani: కీరవాణి తప్పు చేశారా? బూతు ట్వీట్ డిలీట్ చేసినా...
ఎంఎం కీరవాణి వ్యవహార శైలి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ట్వీట్ చేసి డిలీట్ చేయడం, ఆ తర్వాత మరికొన్ని ట్వీట్లు చేయడంపై నెటిజన్లలో మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది.
ట్విట్టర్‌లో ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి హాట్ హాట్ డిస్కషన్‌కు తెర తీశారు. ఆయన వ్యవహార శైలి ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఆయన తప్పు చేశారని కొందరు, ఒక్క ట్వీట్‌తో స్థాయిని తగ్గించుకున్నారని మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు. ఇంకొకరు కీరవాణికి మద్దతు తెలియజేస్తున్నారు. అసలు, కీరవాణి ఏం చేశారు? ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే...
'ఆర్ఆర్ఆర్' సినిమా బాగోలేదని, ఆ చెత్తలో 30 నిమిషాలు చూశానని బాలీవుడ్ దర్శకుడు మనీష్ భరద్వాజ్ ట్వీట్ చేసితే... 'గే లవ్ స్టోరీ' అంటూ ఆస్కార్ పురస్కార గ్రహీత, ప్రముఖ సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి రిప్లై ఇచ్చారు. ఆ రిప్లై 'బాహుబలి' నిర్మాత శోభు యార్లగడ్డకు కోపం తెప్పించింది. అందులో అర్థం ఉంది. 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ కాదని, ఒకవేళ అయితే తప్పేంటి? అని రసూల్ పూకుట్టిని ఆయన ప్రశ్నించడం... పబ్లిక్ డొమైన్‌లో ఉన్నది సరదాగా చెప్పాను తప్ప, సీరియస్‌గా తీసుకోవద్దని రసూల్ పూకుట్టి సమాధానం ఇవ్వడం తెలిసిన విషయాలే.
రసూల్ పూకుట్టి చేసిన ట్వీట్ పట్ల నెటిజన్లు చాలా మంది ఫైర్ అయ్యారు. ఎజెండా ప్రకారం తెలుగు సినిమాను తక్కువ చేస్తున్నారని మండిపడ్డారు. ఎంఎం కీరవాణి ప్రవేశంతో ఈ వివాదం కొత్త మలుపు తీసుకుంది. అప్పటివరకూ రసూల్ పూకుట్టి మీద ఆగ్రహం వ్యక్తం అయితే... ఒక్క ట్వీట్‌తో కీరవాణి కూడా కొంత ఆగ్రహాన్ని చూస్తున్నారు. ప్రతి ఒక్కరి స్వేచ్ఛను గౌరవిస్తానంటూనే, ఇంగ్లీష్‌లో అక్షరాలు టైప్ చేయడం తనకు సరిగా రాదని... అప్పర్ కేస్, లోయర్ కేస్ టైపింగ్‌లో బ్యాడ్ అంటూ రసూల్ పూకుట్టి పేరులో కొన్ని అక్షరాలను అప్పర్ కేస్‌లో టైప్ చేశారు. అందులో బూతు అర్థం వచ్చేలా ఉండటం గమనార్హం.
కీరవాణి ట్వీట్‌లో బూతు నెటిజన్లకు సులభంగా అర్థమైంది. ఆయన తీరు సరి కాదని కొందరు ట్వీట్లు చేశారు. ట్వీట్ చేసిన కాసేపటికి కీరవాణి డిలీట్ చేసినా... ఆయన మీద వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
Also Read : సీరియస్‌గా తీసుకోవద్దు శోభు - 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ కామెంట్స్‌కు ఇక ఫుల్ స్టాప్ పడుతుందా?
బుధవారం సాయంత్రం ఒక్క ట్వీట్‌తో సోషల్ మీడియాలో హాట్ టోపీ అయిన ఎంఎం కీరవాణి... ఈ రోజు ఉదయం మరికొన్ని ట్వీట్లు చేశారు. టైపింగ్ డిఫెక్ట్ పోయిందని, కొత్తగా క్యారెక్టర్ బ్లైండ్‌నెస్ వచ్చిందని పేర్కొన్నారు. తనకు రామ్, భీమ్ క్యారెక్టర్లు కనిపించడం లేదని.. దేశభక్తుడు అయినటువంటి అజయ్ దేవగణ్ పాత్ర ఒక్కటే కనిపిస్తోందటూ ట్వీట్లు చేశారు. గే లవ్ స్టోరీ కామెంట్లపై వ్యంగ్యంగా స్పందించారు.
Also Read : టాలీవుడ్‌లో విషాదం - ప్రముఖ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత