అన్వేషించండి

SS Rajamouli: ఇందుకే రాజమౌళి నంబర్‌వన్ డైరెక్టర్ - శైలేష్, నానిలకి ఏం సలహా ఇచ్చారంటే?

సోమవారం జరిగిన హిట్ 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడారు.

హిట్ సిరీస్‌లో ప్రతి సంవత్సరం ఒకే తేదీ లేదా ఒకే వారంలో ఒక సినిమా విడుదల కావాలని, ఆ సీజన్ హిట్ సిరీస్‌కే సొంతం అవ్వాలని ప్రముఖ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. ‘హిట్: ది సెకండ్ కేస్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. అలాగే ఒక సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజీని తయారు చేసినందుకు ప్రశాంతి, నాని, శైలేష్‌లను అభినందించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...

‘హిట్ అనేదాన్ని ఒక సినిమాలా కాకుండా ఫ్రాంచైజీలా తయారు చేసిన ప్రశాంతి, నాని, శైలేష్‌లకి కంగ్రాట్యులేషన్స్. ఎందుకంటే ఒక ఫ్రాంచైజీని తయారు చేయడం చాలా కష్టం. ఈ జానర్‌లో మనదేశంలో ఇంతవరకు ఫ్రాంచైజీ లేదు. హిట్ ఫ్రాంచైజీకి ఫ్యాన్స్ ఉండటం చాలా సంతోషం. హిట్ సిరీస్‌లో ఏ హీరో ఉన్నా సినిమా చూడటానికి ప్రేక్షకులు వస్తారు. అలాంటి ఫ్రాంచైజీ క్రియేట్ చేసినందుకు వారికి అభినందనలు.’

‘హిట్ 1లో విష్వక్ సేన్, హిట్ 2లో చేసిన అడివి శేష్ ఈ ఫ్రాంచైజీకి చాలా ఎనర్జీ తీసుకువచ్చారు. ట్రైలర్ నాకు బాగా నచ్చింది. ట్రైలర్‌లో నాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా నచ్చింది. హీరోకి, విలన్ చాలెంజ్ చేయడం నాకు బాగా నచ్చింది. దీన్ని చేసింది ఎవరో చూడాలనే ఆసక్తి నాలో కలిగింది. ఈ ఉత్సుకత కలిగించడం థ్రిల్లర్‌కు చాలా ముఖ్యం. శైలేష్ అందులో సక్సెస్ అయ్యాడు.’

‘హిట్ 3, హిట్ 4, హిట్ 5 ఇలా వస్తూనే ఉంటాయి. కానీ అవి ప్రతి సంవత్సరం ఒకే సీజన్‌లో రావాలి. ఆ సీజన్ హిట్‌కే సొంతం అని జనాలకు అర్థం కావాలి. ప్రతి సంవత్సరం ఒకే తేదీన లేదా ఒకే వారంలో హిట్ సిరీస్‌లో నుంచి ఒక సినిమా రావాలి. అది జరగాలని నేను కోరుకుంటున్నాను. మీరు అది చేస్తారని అనుకుంటున్నాను.’

’సినిమాలో టెక్నికల్ వాల్యూస్ చాలా బాగున్నాయి. నటులందరూ బాగా నటించారు. స్క్రీన్‌పై అడివి శేష్, మీనాక్షి జంట బాగుంది. శ్రీలేఖ చేసిన ఉరికే ఉరికే పాట, పోరాటమే పాట చాలా బాగా వచ్చాయి. తెలుగు సినిమా అందించే మంచి క్వాలిటీ ప్రొడక్ట్ ఇది. డిసెంబర్ 2వ తేదీన థియేటర్లో కలుద్దాం.’ అంటూ ముగించారు.

ఆ తర్వాత మహేష్ బాబుతో సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది అని యాంకర్ సుమ అడగ్గా... ‘అవన్నీ తెలీదు కానీ దాని ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు మాత్రం మీరే యాంకర్.’ అన్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Wall Poster Cinema (@wallpostercinemaofficial)

టాప్ హెడ్ లైన్స్

Thursday OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - రొమాంటిక్ డ్రామా తెల్ల కాగితం To కామెడీ డ్రామా 'బత్తా'... నెల రోజుల్లోపే స్ట్రీమింగ్
గురువారం ఓటీటీ మూవీస్ - రొమాంటిక్ డ్రామా తెల్ల కాగితం To కామెడీ డ్రామా 'బత్తా'... నెల రోజుల్లోపే స్ట్రీమింగ్
Janhvi Kapoor : 'పెద్ది' వివాదం... అచ్చియమ్మ రోల్‌పై జాన్వీ కపూర్ షాకింగ్ కామెంట్స్
'పెద్ది' వివాదం... అచ్చియమ్మ రోల్‌పై జాన్వీ కపూర్ షాకింగ్ కామెంట్స్
Emotional Drama OTT: కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Ramayana First Review - 'రామాయణ' ఫస్ట్ రివ్యూ: హాలీవుడ్ బ్లాక్ బస్టర్ స్టైల్‌లో... సినిమా చూసిన ఎన్నారై క్రిటిక్ ఏం చెప్పారంటే?
'రామాయణ' ఫస్ట్ రివ్యూ: హాలీవుడ్ బ్లాక్ బస్టర్ స్టైల్‌లో... సినిమా చూసిన ఎన్నారై క్రిటిక్ ఏం చెప్పారంటే?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP vs TS Essential Commodities Subsidies: నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Cyclone Arnab Damage: అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
Embed widget