అన్వేషించండి

Akshay Kumar: ఏ సేఫ్టీ లేకుండా హెలికాప్టర్‌కు వేలాడి భయపెట్టాడు, ఫిట్‌నెస్ కోసం చేసే పనులివే: అక్షయ్ సీక్రెట్స్ చెప్పేసిన దర్శకుడు

Akshay Kumar: రోహిత్ శెట్టి, అక్షయ్ కుమార్ కాంబినేషన్‌లో ‘సూర్యవంశీ’ అనే యాక్షన్ సినిమా వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఆ మూవీ షూటింగ్ సమయలో అక్షయ్ చేసిన రిస్క్‌ను రోహిత్ బయటపెట్టాడు.

Rohit Shetty about Akshay Kumar: సినీ పరిశ్రమలో దాదాపు దర్శకులంతా తాము పనిచేసిన హీరోల గురించి గొప్పగానే మాట్లాడతారు. వారితో కలిసి పనిచేసిన అనుభవం గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఇక హీరోల గురించి చాలామంది ప్రేక్షకులకు తెలియని ఆసక్తికర విషయాలను కూడా బయటపెడతారు. అదే విధంగా బాలీవుడ్ సీనియర్ హీరో అక్షయ్ కుమార్ గురించి బయటపెట్టాడు రోహిత్ శెట్టి. అక్షయ్, రోహిత్ కాంబినేషన్‌లో ‘సూర్యవంశీ’ అనే పోలీస్ డ్రామా వచ్చింది. ఇక ఆ మూవీ షూటింగ్ సమయంలో అక్షయ్.. తన పాత్ర కోసం ఎలాంటి రిస్కులు తీసుకున్నాడనే విషయాన్ని చెప్తూ.. హీరో డైట్ ప్లాన్ గురించి రివీల్ చేశాడు.

సేఫ్టీ జాకెట్‌ లేకుండా..
‘‘అక్షయ్ కుమార్ చాలా సాధారణమైన ఫుడ్ తింటూ.. చాలా సాధారణమైన వ్యాయామం చేస్తాడు. తను ఎక్కువగా బరువులను కూడా ఎత్తడు. 80 ఫ్లోర్స్‌తో ఉన్న బిల్డింగ్ ఉంటే.. దానిని వెంటనే ఎక్కేస్తాడు. 50 పుల్ అప్స్ చేస్తాడు. త్వరగా తింటాడు. క్రమశిక్షణతో ఉంటాడు’’ అని అక్షయ్ కుమార్ ఫిట్‌నెస్ సీక్రెట్‌ను బయటపెట్టాడు రోహిత్ శెట్టి. అంతే కాకుండా 2021లో ‘సూర్యవంశీ’ షూటింగ్ జరుగుతుండగా.. ఒక సీన్ కోసం అక్షయ్ కుమార్ తీసుకున్న రిస్క్ గురించి కూడా గుర్తుచేసుకున్నాడు. ‘‘సేఫ్టీ జాకెట్‌తో అక్షయ్ కుమార్ హెలికాప్టర్‌కు వేలాడుతూ ఉండాలి. అందుకే పైలెట్‌ను ఎక్కువగా తిప్పకుండా ముందుకు వెళ్లి వచ్చేయన్నాను. కానీ అక్షయ్ ఆ సీన్ మొత్తం మార్చేశాడు’’ అని అన్నాడు రోహిత్.

చేతితో పట్టుకొని వేలాడాడు..
‘‘ఆ సీన్‌ను బ్యాంకాక్‌లో షూట్ చేశాం. అక్షయ్ హెలికాప్టర్‌కు వేలాడుతూ ఉన్నాడు. ఇది ఒక సేఫ్టీ షాట్. సేఫ్టీ జాకెట్ వేసేవరకు ముందుకు వెళ్లలేము. జస్ట్ అలా పైకి వెళ్లి, కిందకి వచ్చేయి, చుట్టూ తిరగకు అని నేను పైలెట్‌తో చెప్పాను. అక్షయ్ కూడా దీని గురించి పైలెట్‌తో మాట్లాడాడు. ఆ తర్వాత పైలెట్ హెలికాప్టర్‌ను చుట్టూ తిప్పాడు. అక్షయ్ కేవలం హెలికాప్టర్‌ను చేతితో పట్టుకొని వేలాడుతున్నాడు. తన శరీరం బరువు మొత్తం ఆ చేతిపైనే ఉంది. నాకు పైలెట్ మీద చాలా కోపం వచ్చింది. అది చూసి ఆయనే చేయమన్నాడు అంటూ అక్షయ్ వైపు చూపించాడు పైలెట్’’ అని అక్షయ్ చేసిన సాహసం గురించి చెప్పుకొచ్చాడు రోహిత్ శెట్టి. ఆ తర్వాత తనకు ఆ సీన్ చాలా నచ్చిందని, అక్షయ్ చాలా మంచి వ్యక్తి అని ప్రశంసించాడు.

వారు పట్టించుకోరు..
‘‘అక్షయ్‌కు భయం అనేది లేదు. తన ఆరోగ్యం కోసం విపరీతంగా తనేం చేయడు. గతంలో సొంతంగా స్టంట్లు చేయాలనే ఉద్దేశ్యంతో దెబ్బలు తగిలించుకున్నారు. కొంతమందికి కుట్లు కూడా పడ్డాయి. అయినా అక్షయ్ మాత్రం స్టంట్లు చేయడానికి వెనకాడడు. ఈతరంలో అందరూ నేచురల్ ఫుడ్ వల్ల వచ్చే లాభాలను పట్టించుకోరు. కానీ అక్షయ్ అలా కాదు. కేవలం సింపుల్, నేచురల్ ఫుడ్ తింటూనే తన శరీరాన్ని, ఆరోగ్యాన్ని మెయింటేయిన్ చేస్తాడు’’ అంటూ అక్షయ్ కుమార్ గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు రోహిత్ శెట్టి. ఇక అక్షయ్ హీరోగా నటించిన ‘సూర్యవంశీ’తో తను కూడా రోహిత్ కాప్ యూనివర్స్‌లో భాగమయ్యాడు. ఈ మూవీలో రణవీర్ సింగ్, అజయ్ దేవగన్ గెస్ట్ రోల్స్‌లో కనిపించారు. ‘సూర్యవంశీ’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.

Also Read: ‘అర్జున్ రెడ్డి’ హిట్ కాకపోతే సందీప్ ఆ పని చేేసేవాడు - ‘యానిమల్’ నిర్మాత ప్రణయ్ వంగ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
Om Prakash Chautala: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత
Om Prakash Chautala: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
Om Prakash Chautala: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత
Om Prakash Chautala: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Ambedkar Row in Parliament: మరింత తీవ్రమవుతున్న అమిత్‌షా కామెంట్స్ వివాదం- నేడు కాంగ్రెస్‌ దేశవ్యాప్త నిరసనలు
మరింత తీవ్రమవుతున్న అమిత్‌షా కామెంట్స్ వివాదం- నేడు కాంగ్రెస్‌ దేశవ్యాప్త నిరసనలు
Child Constable: ఐదేళ్లకే పోలీస్‌ అయిన బాలుడు- ఒక్కరోజు కాదు పర్మనెంట్‌గా- మేక్‌ ఏ విష్ కానేకాదు, అదెలాగంటే?
ఐదేళ్లకే పోలీస్‌ అయిన బాలుడు- ఒక్కరోజు కాదు పర్మనెంట్‌గా- మేక్‌ ఏ విష్ కానేకాదు, అదెలాగంటే?
Bachhala Malli Twitter Review - బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
Viduthalai 2 Twitter Review - విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
Embed widget