RK Sagar: ప్రభాస్ సినిమా చేసినందుకు ఫీలవుతున్నా... 'మొగలి రేకులు' సాగర్ సెన్సేషనల్ కామెంట్స్
Mogali Rekulu Sagar: 'మొగలి రేకులు' సీరియల్ ద్వారా తెలుగులో పాపులర్ అయిన ఆర్టిస్ట్ సాగర్. ఇప్పుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తనకు ప్రభాస్ సినిమాలో అన్యాయం జరిగిందని ఆయన చెప్పారు.

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఆర్కే సాగర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. 'చక్రవాకం', 'మొగలి రేకులు' సీరియల్స్ ద్వారా ఆయన చాలా పాపులర్. ఓ నంది అవార్డు కూడా ఉంది. టీవీ ఇండస్ట్రీలో స్టార్ అయ్యాక సిల్వర్ స్క్రీన్ మీద తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. హీరోగా సినిమాలు చేస్తున్న సాగర్... తనకు ప్రభాస్ సినిమాలో అన్యాయం జరిగిందని తెలిపారు.
మిస్టర్ పర్ఫెక్ట్... సెకండ్ లీడ్ అని!
RK Sagar On Mr Perfect: రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా దశరథ్ దర్శకత్వం వహించిన సినిమా 'మిస్టర్ పర్ఫెక్ట్'. కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతను ఆకట్టుకున్న ఆ సినిమా మంచి విజయం సాధించింది. అందులో ఆర్కే సాగర్ కూడా ఒక చిన్న క్యారెక్టర్ చేశారు. అయితే తనకు కథ చెప్పినప్పుడు అది చిన్నది కాదని, ఆల్మోస్ట్ సెకండ్ లీడ్ రోల్ అని చెప్పారని తాజా ఇంటర్వ్యూలో ఆయన వివరించారు.
'మిస్టర్ పర్ఫెక్ట్' గురించి ఆర్కే సాగర్ మాట్లాడుతూ... ''నేను డబ్బులు కోసం హీరోగా సినిమాలు చేయడం లేదు. నాకంటూ ఒక పేరు తెచ్చుకోవాలని సినిమాలు చేస్తున్నాను. అప్పటికి నేను సీరియల్స్‌లో బిజీగా ఉన్నాను. ఆ సమయంలో దశరథ్ గారు కథ చెప్పారు. కానీ షూటింగ్ మొదలైన తర్వాత చూస్తే... నాకు చెప్పినది ఒకటి, అక్కడ జరిగింది మరొకటి. మూడు రోజులు నాతో షూటింగ్ చేయలేదు. దర్శకుడిని ఏమైందని అడిగా. షూటింగ్ మొదలైన తర్వాత నాకు చెప్పిన క్యారెక్టర్ ఇది కాదని అడిగాను. అర్థం చేసుకోమని, ఒక్కోసారి క్యారెక్టర్లు మారుతాయని దశరథ్ అన్నారు. ఆ సినిమా చేసినందుకు రిగ్రెట్ ఫీలవుతున్నా'' తెలిపారు.
Also Read: అమెరికా వీధుల్లో చెట్టాపట్టాల్... తెరపైకి మళ్లీ సమంత డేటింగ్ వ్యవహారం
"Mr. Perfect was a disappointing experience for me. When they approached me, they told me I was the second lead.
— Movies4u Official (@Movies4u_Officl) July 8, 2025
But once I went to the shoot, everything was completely different from what I was told. I honestly regret doing that film," said actor RK Sagar. pic.twitter.com/Cy9gsdmIbI
'మిస్టర్ పర్ఫెక్ట్' చేసిన నాలుగేళ్ల తర్వాత 'సిద్ధార్థ'తో ఆర్కే సాగర్ హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్', 'షాది ముబారక్' సినిమాలు చేశారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన సినిమా 'ది 100'. ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తుంది. బుధవారం రాత్రి ప్రీమియర్ షోలు వేస్తున్నారు.
Also Read: మలయాళంలో బిగ్గెస్ట్ హిట్ 'మంజుమ్మేల్ బాయ్స్' నిర్మాతల అరెస్ట్, బెయిల్ మీద విడుదల... అసలు ఏమైందంటే?





















