Samantha: అమెరికా వీధుల్లో చెట్టాపట్టాల్... తెరపైకి మళ్లీ సమంత డేటింగ్ వ్యవహారం
Samantha Dating Raj?: దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ చేస్తున్నారని వార్తలు కొత్త కాదు ఇప్పుడు మరోసారి అమెరికా వీధుల సాక్షిగా అవి తెర మీదకు వచ్చాయి.

Is Samantha dating Raj Nidimoru?: దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్‌లో ఉన్నారా? ఈ ప్రశ్నకు ఆవిడ ఎప్పుడు నేరుగా సమాధానం ఇచ్చింది లేదు. అలాగని 'కాదు' అని కూడా చెప్పడం లేదు. సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోల ద్వారా ఎప్పటికప్పుడు తామిద్దరం చాలా క్లోజ్ అని హింట్స్ మాత్రం ఇస్తూ ఉంటారు. అమెరికా వీధుల సాక్షిగా మరోసారి సమంత డేటింగ్ వ్యవహారం తెర మీదకు వచ్చింది.
అమెరికా వీధుల్లో చెట్టాపట్టాల్!
సమంత అమెరికా వెళ్లారు. అక్కడ తెలుగు ప్రజలు నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమెతో పాటు అమెరికా వెళ్ళిన బృందంలో రాజ్ నిడిమోరు కూడా ఉన్నారు. డెట్రాయిట్ సిటీలో తాను దిగిన ఫోటోలను సమంత సోషల్ మీడియాలో షేర్ చేశారు. వాటిని చాలా నిశితంగా పరిశీలిస్తే... ఒక ఫోటోలో డెట్రాయిట్ వీధుల్లో రాజ్ నిడిమోరు చేతిలో చెయ్యి వేసుకుని సమంత కనిపించారు. మరొక ఫోటోలో... రెస్టారెంట్‌లో ఇద్దరూ పక పక్కన కూర్చుని ఉన్నారు. ఈ జంట డేటింగ్ గురించి మరొకసారి డిస్కషన్ జరగడానికి ఆ ఫోటోలు కారణం అయ్యాయి.
Also Read: మలయాళంలో బిగ్గెస్ట్ హిట్ 'మంజుమ్మేల్ బాయ్స్' నిర్మాతల అరెస్ట్, బెయిల్ మీద విడుదల... అసలు ఏమైందంటే?

సమంత, రాజ్ నిడిమోరు కలిసి జంటగా కనిపించడం ఇదేమి కొత్త కాదు. గత కొన్ని నెలలుగా జరుగుతున్న వ్యవహారం. రాజ్ భార్య సోషల్ మీడియాలో చేసే పోస్టుల్లో సమంతను నేరుగా ఏమీ అనరు. కానీ ఆవిడ పోస్ట్ చేసే కోట్స్ చూస్తే సమంత మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు ఉంటాయి. సమంత సైతం సోషల్ మీడియాలో రాజ్ నిడిమోరుతో కలిసి దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉన్నారు.
'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 2లో సమంత నటించారు. దానికి రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. ఆ వెబ్ సిరీస్ సెట్స్ మీద రాజ్ నిడిమోరుతో సమంతకు పరిచయం అయింది. ఆ తర్వాత 'సిటాడెల్: హనీ బన్నీ' వెబ్ సిరీస్ చేశారు. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ డేటింగ్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. నాగ చైతన్యతో విడాకులకు 'ది ఫ్యామిలీ మ్యాన్ 2'లో సీన్స్ కారణం అనే ప్రచారం సైతం జరిగింది. ఇటీవల 'శుభం' సినిమాతో సమంత నిర్మాతగా మారారు. ప్రస్తుతం 'రక్త్ బ్రహ్మాండ్' వెబ్ సిరీస్ చేస్తున్నారు. దానికి రాజ్ అండ్ డీకే షో రన్నర్స్.





















