Pawan Kalyan: మళ్ళీ భగవంతుడిగా పవన్ కళ్యాణ్ - కొబ్బరికాయలు కొట్టారట
Vinodhaya Sitham Remake In Telugu: పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైందని తెలిసింది. మేనల్లుడితో కలిసి నటించే సినిమాకు ఆయన కొబ్బరికాయ కొట్టారట.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కలిసి ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ప్రముఖ నటుడు, గతంలో తెలుగులో రవితేజ 'శంభో శివ శంభో' తీసిన తమిళ ఫిల్మ్ మేకర్ సముద్రఖని దర్శకత్వం వహించనున్నారు. తమిళ హిట్ 'వినోదయ సీతమ్'కి రీమేక్ ఇది. మాతృకకు సైతం సముద్రఖని దర్శకత్వం వహించారు.
లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే... పవన్, సాయి తేజ్ సినిమా పూజా కార్యక్రమాలు ఈ రోజు హైదరాబాద్‌లో జరిగాయని తెలిసింది. జూలై రెండో వారంలో షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. (Vinodhaya Sitham Telugu Remake starts today with Pooja)
Also Read : 'సమ్మతమే' రివ్యూ: కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఎలా ఉందంటే?
కారు యాక్సిడెంట్‌లో మరణించిన యువకుడికి దేవుడు రెండో అవకాశం ఇవ్వడం అనేది 'వినోదయ సీతమ్' మెయిన్ కాన్సెప్ట్. తెలుగులో భగవంతుని పాత్రను పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. యువకుడి పాత్రలో సాయి ధరమ్ తేజ్ కనిపించనున్నారు. ఆయన ఈ తరహా పాత్ర చేయడం రెండోసారి. గతంలో 'గోపాల గోపాల'లో మోడ్రన్ శ్రీ కృష్ణుని పాత్ర చేశారు (Pawan Kalyan Plays Lord Role Once Again). అదీ సంగతి!
Also Read : చోర్ బజార్ సినిమా రివ్యూ: బచ్చన్ సాబ్‌గా ఆకాష్ పూరి మెప్పించాడా? లేదా?
View this post on Instagram