The Raja Saab Trailer: రెబల్ స్టార్ ప్రభాస్ 'ది రాజా సాబ్' ట్రైలర్ రేపే... ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారంటే?
The Raja Saab Trailer Release Date: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వం వహించిన 'ది రాజా సాబ్' ట్రైలర్ రిలీజ్ డేట్ అండ్ టైం కన్ఫర్మ్ చేశారు. రేపే ప్రేక్షకుల ముందుకు ట్రైలర్ రానుంది.

రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) కథానాయకుడిగా రూపొందుతున్న హారర్ కామెడీ సినిమా 'ది రాజా సాబ్' (The Raja Saab Movie). మారుతి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇందులో వింటేజ్ ప్రభాస్ కామెడీ టైమింగ్ వింటేజ్ డార్లింగ్ స్టైల్ చూపిస్తామని దర్శకుడు ప్రామిస్ చేశారు. ఆల్రెడీ విడుదలైన గ్లింప్స్, టీజర్ అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ట్రైలర్ విడుదల చేయడానికి చిత్ర బృందం రెడీ అయ్యింది.
సోమవారం సాయంత్రం 6 గంటలకు!
The Raja Saab Trailer Release Date and Time: సోమవారం... అంటే సెప్టెంబర్ 29వ తేదీన సాయంత్రం 6 గంటలకు 'ది రాజా సాబ్' ట్రైలర్ విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో ట్రైలర్ స్క్రీనింగ్ చేయనున్నట్లు తెలిసింది. ఈ సినిమా మీద అభిమానులలో అంచనాలు ఏర్పడిన నేపథ్యంలో ట్రైలర్ మరింత హైప్ ఇస్తుందని చెప్పవచ్చు. ప్రభాస్ స్టైల్, కామెడీని ఇప్పటివరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలలో పరిచయం చేశారు ఇప్పుడు కథ గురించి ఏం రివీల్ చేస్తారని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
The GATES of FEAR are opening…
— The RajaSaab (@rajasaabmovie) September 28, 2025
Enter if you dare 😎#TheRajaSaabTRAILER on SEP 29th, 6PM 💥💥#TheRajaSaab #Prabhas pic.twitter.com/8wuQO2Webl
'కాంతార'తో పాటు థియేటర్లలో ట్రైలర్!
అక్టోబర్ రెండున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న సినిమా 'కాంతార: ఏ లెజెండ్'. రిషబ్ శెట్టి కథానాయకుడిగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన ఆ సినిమాకు 'ది రాజా సాబ్' ట్రైలర్ అటాచ్ చేస్తున్నారు. 'కాంతార' ప్రదర్శిస్తున్న థియేటర్లలో ట్రైలర్ ప్లే కానుంది. అయితే అక్టోబర్ రెండున ట్రైలర్ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని అభిమానులు అందరూ భావించారు. కానీ, 'ది రాజా సాబ్' చిత్ర బృందం ముందుగా ట్రైలర్ విడుదల చేస్తోంది.
Also Read: ఏఐ ఫోటోలు కాదు... ఒరిజినల్స్ ఇవిగో, షాక్ ఇచ్చిన సాయి పల్లవి
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఫస్ట్ సాంగ్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని చిత్ర నిర్మాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గతంలో చెప్పారు. అక్టోబర్ 23న 'ది రాజా సాబ్' ఫస్ట్ సాంగ్ విడుదల కానుంది. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో సంజయ్ దత్ కీలక పాత్ర చేశారు. ప్రభాస్ శీను, సప్తగిరి, వీటీవీ గణేష్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.





















