Mr Bachchan: మాస్ మహారాజా ఫ్యాన్స్‌కి అదిరిపోయే అప్‌డేట్ - 'మిస్టర్ బచ్చన్' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్, ఎప్పుడంటే..
Mr Bachchan Trailer: మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్‌కి మిస్టర్ బచ్చన్ టీం అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. తాజాగా ఈ ట్రైలర్ రిలీజ్ డేట్‌పై మూవీ నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన ఇచ్చింది.

Mr Bachchan Trailer Update: మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) హీరోగా డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా 'మిస్టర్ బచ్చన్'. నామ్ తో సునా హోగా (నా పేరు వినే ఉంటారు) అనేది ఉపశీర్షిక. 'షాక్', 'మిరపకాయ్' చిత్రాలతో వీరిద్దరి కాంబో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఇండిపెండెన్స్ డే సందర్బంగా ఆగష్టు 15న మిస్టర్ బచ్చన్ రిలీజ్ కానుంది. దీంతో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా గత కొద్ది రోజులుగా వరుసగ ఈ సినిమా నుంచి అప్‌డేట్ ఇస్తూ మూవీపై హైప్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. ఇక ఇప్పటికే విడుదలైన ప్రచార పోస్టర్స్, టీజర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక ఇటీవల విడుదలైన టీజర్‌కి భారీ రెస్పాన్స్ వచ్చింది.
మూవీ రిలీజ్ టైం దగ్గర పడుతుండటం ఫ్యాన్స్ బిగ్ ట్రీట్ ఇవ్వబోతుంది మిస్టర్ బచ్చన్ టీం. రేపు ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్. కాగా మనోరమా స్టూడియోస్ అండ్ టీ సిరీస్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఇందులో రవితేజ ఆదాయ పన్ను శాఖ అధికారిక పాత్రలో కనిపించబోతున్నాడని టీజర్ చూస్తే అర్థమైపోతుంది.
Get ready for #MrBachchan MASS MAHA TRAILER. Out tomorrow 💥💥
— People Media Factory (@peoplemediafcy) August 6, 2024
MASSive ENTERTAINMENT on the big screens in 9 days ❤🔥
GRAND RELEASE WORLDWIDE ON AUGUST 15th.#MassReunion
Mass Maharaaj @RaviTeja_offl #BhagyashriBorse @harish2you @vishwaprasadtg @peoplemediafcy @TSeries… pic.twitter.com/2CV7JO9Olu
దేశంలోని నల్ల ధనం చూట్టూ ఈ సినిమా సాగనుందని తెలుస్తోంది. నల్ల ధనాన్ని వెలికితీసే పవర్ఫుల్ ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసర్‌గా రవితేజ కనిపించబోతున్నాడట. హిందీ సినిమా 'రైడ్' సినిమా నుంచి మెయిన్ పాయింట్ తీసుకుని తెలుగు నేటివిటీకి తగ్గట్టు పలు మార్పులు, చేర్పులు చేసి హరీష్ శంకర్ 'మిస్టర్ బచ్చన్' ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నాడు. ఇటీవల మూవీ ప్రెస్‌మీట్ హరీశ్ శంకర్ మాట్లాడుతూ.. తాను ఈ సినిమా రవితేజ అభిమానిగా తీశానన్నారు. హిందీ రైడ్‌లోని కీ పాయింట్ తీసుకుని రవితేజ క్యారెక్టరైజేషన్‌కి తగ్గట్టుగా మార్పులు చేశానన్నారు. రైడ్ సీరియస్ టెంపోలో సాగితే... 'మిస్టర్ బచ్చన్'పూర్తి వినోదాత్మకంగా ఉంటుందని ఇటీవల ఓ ఇంటర్య్వూలో హరీశ్ శంకర్ వెల్లడించారు. రవితేజ క్యారెక్టర్ పరంగా కూడా చాలా మార్పులు ఉన్నాయని, ఫస్టాఫ్ లో కమెడియన్ సత్య కామెడీ హైలైట్ అవుతుందన్నారు. ఇక సెకండాఫ్ వచ్చేసరికి 'చమ్మక్' చంద్ర కామెడీ బాగుటుంందని ఆయన చెప్పుకొచ్చారు.
Also Read: Nandamuri Balakrishna: ఆ మలయాళ బ్లాక్‌స్టర్ మూవీ రీమేక్ చేయనున్న బాలయ్య? - డైరెక్టర్ ఎవరంటే..!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

