Ravi Teja: రవితేజ ఇంట తీవ్ర విషాదం - ఆయన తండ్రి కన్నుమూత
Ravi Teja: హీరో రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని రవితేజ నివాసంలో వయస్సు వల్ల వచ్చిన అనారోగ్య సమస్యలతో మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

Ravi Teja's Father Raj Gopal Passed away: హీరో రవితేజ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి రాజగోపాల్ రాజు (90) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని రవితేజ నివాసంలో మంగళవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యం, అనారోగ్య సమస్యల కారణంగా ఆయన కన్ను మూశారని కుటుంబసభ్యులు తెలిపారు. రాజగోపాల్ రాజుకు ముగ్గురు కుమారులు కాగా... రవితేజ పెద్ద కుమారుడు. రెండో కుమారుడు భరత్ 2017లో కారు ప్రమాదంలో మృతి చెందారు. మూడో కుమారుడు రఘు సైతం పలు సినిమాల్లో నటించారు.
తూ.గో జిల్లా జగ్గంపేటకు చెందిన రాజగోపాల్ ఫార్మసిస్ట్‌గా పని చేశారు. వృత్తి రీత్యా ఆయన ఉత్తర భారతదేశంలోనే ఎక్కువగా ఉన్నారు. దీంతో రవితేజ స్కూల్ ఎడ్యుకేషన్ జైపుర్, ఢిల్లీ, ముంబయి, భోపాల్‌లోనే జరిగింది. అందువల్లే రవితేజ చిన్నప్పటి నుంచి వివిధ యాసలు నేర్చుకున్నారు. ఇది ఆయన యాక్టింగ్ టాలెంట్‌కు స్పెషల్ క్రేజ్ తీసుకొచ్చింది.
Also Read: రాజమౌళి రూటులో నీల్, సుక్కు నడుస్తారా? ఆ సినిమాలు మళ్ళీ థియేటర్లలోకి వస్తాయా?





















