Ravi Kishan: చిన్నప్పుడే కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నా... ఇండస్ట్రీపై మరోసారి 'రేసుగుర్రం' విలన్ షాకింగ్ కామెంట్స్
Ravi Kishan: సీనియర్ నటుడు రవి కిషన్ తన యవ్వనంలో కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చారు. కొత్త నటీనటులు విజయం సాధించడానికి షార్ట్ కట్‌ల గురించి ఆలోచించొద్దని కోరారు.
ప్రముఖ నటుడు రవి కిషన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అయితే ఆయనను పేరు పెట్టి పిలవడం కన్నా 'రేసుగుర్రం' విలన్ అంటేనే బాగా గుర్తుపడతారు తెలుగు ఆడియన్స్. తాజాగా ఈ నటుడు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వంటి దాడులను తాను కూడా ఎదుర్కొన్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
యంగ్ ఏజ్‌లో క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నా
తాజాగా ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ తో పాటు ఇండస్ట్రీలోకి ఎలాంటి పరిస్థితుల్లో అడుగు పెట్టాల్సి వచ్చిందో చెప్పుకొచ్చారు సీనియర్ నటుడు రవి కిషన్. ఆయన మాట్లాడుతూ "నేను నిరుపేద కుటుంబంలో పుట్టాను. ఈ క్రమంలోనే కుటుంబ పోషణ కోసం సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని భావించాను. అందుకే బీహార్ లోని నా స్వగ్రామాన్ని వదిలి యంగ్ ఏజ్‌లోనే ముంబైలో అడుగు పెట్టాను. అయితే మొదట్లో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాను. చేతిలో డబ్బులులేని టైం చూసి, ఇబ్బంది పెట్టాలని చూసేవారు ఎక్కడైనా కాచుకుని ఉంటారు. అప్పట్లో నేను సన్నగా ఉండేవాడిని. పొడవాటి చుట్టూ ఉండడంతో పాటు చెవి పగులు కూడా పెట్టుకునేవాడిని. దీంతో యవ్వనంలో ఉన్నప్పుడు ఇలాంటి కష్టాలను ఎన్నో ఎదుర్కొన్నాను. కానీ ఇలాంటి పరిస్థితులు కేవలం చిత్రపరిశ్రమలోనే కాదు, అన్ని రంగాల్లోనూ సాధారణంగా ఉంటాయి. అలాంటి అన్ని పరిస్థితులను దాటుకొని నేను ఈ రోజు ఈ స్థాయిలో నిలబడ్డాను" అంటూ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో చెప్పుకోచ్చారు.
Also Read: లైంగిక వేధింపులకు పాల్పడిన టీవీ నటుడు - అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసిన కేసులో అరెస్ట్
గతంలోనూ ఓ మహిళ తనను ఇబ్బంది పెట్టాలని చూసిందంటూ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేశారు రవికిషన్. పైగా ఆమె సమాజంలో మంచి పలుకుబడి, హోదా ఉన్న మహిళా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. అయితే ఆ మహిళ ఎవరు అన్న విషయాన్ని మాత్రం రవి కిషన్ ఎక్కడా బయట పెట్టలేదు.
సక్సెస్ కు షాట్ కట్స్ ఉండవు
సక్సెస్ అవ్వడానికి షార్ట్ కట్స్ గురించి వెతుక్కునే వాళ్ళ గురించి రవి కిషన్ మాట్లాడుతూ "విజయానికి ఎలాంటి షార్ట్ కట్స్ ఉండవు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి రూట్స్ ఎంచుకున్న ఎంతోమంది నాకు తెలిసిన వ్యక్తులు ఆ తర్వాత ఎంతగానో బాధపడ్డారు. చివరికి వారు బ్యాడ్ హ్యాబిట్స్ కి బానిస కావడం లేదా ఆత్మహత్య చేసుకోవడం లాంటివి జరిగాయి. షార్ట్ కట్ లో స్టార్డం సొంతం చేసుకున్న వారు ఒక్కరు కూడా లేరు. సహనంగా ఎదురు చూడండి అని మాత్రమే నేను చెప్పగలను. 90వ దశంలో నా స్నేహితులుగా ఉన్న అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ లాంటివారు సూపర్ స్టార్స్ అయ్యారు. కానీ నేను ఇంకా ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నాను" అన్నారు. భోజ్ పురి, హిందీలో దాదాపు 400లకు పైగా సినిమాలలో నటించిన రవి కిషన్ 'రేసుగుర్రం' మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత పలు సినిమాలు చేసిన ఆయన ఇప్పుడు 'డాకు మహారాజ్' సినిమాలో కీలకపాత్రను పోషిస్తున్నారు.
Also Read: జీసస్‌తో పాటు గణేశుడికీ పూజలు... సమంత ఇంట్లో హిందూ దేవుళ్లు