అన్వేషించండి

Rashmika Mandanna: ఆ బాధను చెప్పలేం - మనాలీలో పెళ్లి సీన్‌పై రష్మిక కామెంట్స్

Rashmika Mandanna: గత ఏడాది విడుదలైన బ్లాక్ బస్టర్ సినిమాల్లో ‘యానిమల్’ ఒకటి. ఈ సినిమా షూటింగ్ లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి హీరోయిన్ రష్మిక మందన్న ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

Rashmika Mandanna: రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్. గత డిసెంబర్‌ 1న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. దాదాపు రూ.900 కోట్ల పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తండ్రి-కొడుకు మధ్య సెంటిమెంట్ బేస్ చేసుకుని రూపొందించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అయితే, ఈ మూవీ ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో, అదే స్థాయిలో విమర్శలపాలైంది. కొంత మంది సినీ ప్రముఖులు సినిమా చాలా బాగుందని ప్రశంసించినా, మరికొంత మంది సమాజంలో స్త్రీలను చిన్నచూపు చూసేలా ఉందని విమర్శించారు. ఈ సినిమాపై పార్లమెంట్ లోనూ చర్చజరిగింది. ఇలాంటి సినిమాలు చాలా ప్రమాదకరమని సభ్యులు అభిప్రాయపడ్డారు.

ఆ సీక్వెన్స్ షూటింగ్ కోసం చాలా ఇబ్బంది పడ్డాం- రష్మిక

ఇక తాజాగా ‘యానిమల్’ సినిమా షూటింగ్ సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి రష్మిక మందన్న కీలక విషయాలను వెల్లడించింది. ఈ సినిమాలో రష్మిక గీతాంజలి పాత్రలో కనిపించింది. ఆమెకు, రణబీర్ కు మనాలిలోని మంచు పర్వతాల్లో వివాహం జరుగుతుంది. ఈ సన్నివేశాన్ని షూట్ చేసే సమయంలో చాలా కష్టపడినట్లు చెప్పింది. “ఈ సినిమా షూట్ జరిగే ప్రదేశం అంతా మంచుతో గడ్డకట్టుకుపోయింది. అక్కడ రణబీర్ కుర్తాలో, నేను చీరలో కనిపించాలి. ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకునే సీన్ కావడంతో చలి నుంచి కాపాడే ఎలాంటి దుస్తులు వేసుకోవద్దని దర్శకుడు చెప్పారు. అందుకే మేం స్వెటర్లు వేసుకోలేదు. రణబీర్ కుర్తా, నేను చీరలో ఉన్నాం. కానీ, అక్కడ ఉన్న చలికి చాలా ఇబ్బంది పడ్డాం. మంచులో షూట్ చేస్తున్నంత సేపు పడిన బాధ చెప్పలేం. చర్మం పూర్తిగా డ్రై అయ్యింది. మేకప్ ఆర్టిస్టులు దాన్ని కవర్ చేసేందుకు మరింత మేకప్ వేయాల్సి వచ్చింది. జుట్టు కూడా పొడిబారిపోయింది. మళ్లీ మళ్లీ హెయిర్ సెట్ చేయాల్సి వచ్చింది.  అయినప్పటికీ ఎంతో ఓపికతో అక్కడ షూటింగ్ లో పాల్గొన్నాం, ఎలాంటి అవాంతరాలు లేకుండా అనుకున్న సీన్లు అనుకున్నట్లుగా వచ్చేలా ప్రయత్నం చేశాం” అని చెప్పుకొచ్చింది.   

నెట్ ఫ్లిక్స్ లో ‘యానిమల్’ స్ట్రీమింగ్

ప్రస్తుతం ‘యానిమల్’ మూవీ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. డిజిటల్ వేదికపైనా ఈ సినిమాకు ఓ రేంజిలో ఆదరణ లభిస్తోంది.  ‘యానిమ‌ల్’ మూవీలో బాబీ డియోల్ విల‌న్‌గా కనిపించగా, రణబీర్‌ క‌పూర్ తండ్రిగా అనిల్ క‌పూర్ న‌టించాడు. త్రిప్తి దిమ్రీ మరో కీలకపాత్రలో కనిపించింది. ఈ మూవీకి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ మ్యూజిక్ అందించారు. టీ సిరీస్ అధినేత భూష‌ణ్ కుమార్‌తో క‌లిసి సందీప్ వంగా సోద‌రుడు ప్ర‌ణ‌య్ వంగా ఈ మూవీని నిర్మించారు. ‘యానిమ‌ల్’ మూవీ త‌ర్వాత ప్ర‌భాస్‌తో ‘స్పిరిట్’ మూవీ చేయ‌బోతున్నారు సందీప్ వంగా.

Read Also: వివాదాలకు చిరునామా పూనమ్ పాండే, ఆమె కెరీర్‌లో టాప్ 10 కాంట్రవర్సీలు ఇవే

టాప్ హెడ్ లైన్స్

Horror Thriller OTT : రెండు రోజుల్లోనే మూడు ఓటీటీల్లోకి హారర్ థ్రిల్లర్ - ఎందుకు చూడాలంటే?
రెండు రోజుల్లోనే మూడు ఓటీటీల్లోకి హారర్ థ్రిల్లర్ - ఎందుకు చూడాలంటే?
Thamizh Murugan Vs God of War: ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
Lenin Collection Day 1: లెనిన్ కలెక్షన్లు... ఫస్ట్ డే అదరగొట్టిన అయ్యగారు - ఎన్ని కోట్లు వచ్చాయంటే?
లెనిన్ కలెక్షన్లు... ఫస్ట్ డే అదరగొట్టిన అయ్యగారు - ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Akhil Akkineni : తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
Thamizh Murugan Vs God of War: ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
Lenin Collection Day 1: లెనిన్ కలెక్షన్లు... ఫస్ట్ డే అదరగొట్టిన అయ్యగారు - ఎన్ని కోట్లు వచ్చాయంటే?
లెనిన్ కలెక్షన్లు... ఫస్ట్ డే అదరగొట్టిన అయ్యగారు - ఎన్ని కోట్లు వచ్చాయంటే?
విష్ణు సహస్రనామ పఠనం: అద్భుత ప్రయోజనాలు, శక్తి రహస్యాలు!
విష్ణు సహస్రనామ పఠనం: అద్భుత ప్రయోజనాలు, శక్తి రహస్యాలు!
Cancer Risk: అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
CM Revanth Reddy Khammam Sabha: కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
Embed widget