Ramarao On Duty Trailer: రవితేజ ఆన్ డ్యూటీ - మాస్ మహారాజా ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే ట్రైలర్ వచ్చేసిందిగా
Watch Ravi Teja's Ramarao On Duty Trailer Here: మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' ట్రైలర్ ఈ రోజు విడుదలైంది.
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'రామారావు ఆన్ డ్యూటీ'. ఈ రోజు సినిమా ట్రైలర్ (RamaRao On Duty Movie Trailer) విడుదల చేశారు. యూట్యూబ్‌లో తెలుగు, హిందీ భాషల్లో ట్రైలర్ అందుబాటులో ఉంది.
'రామారావు ఆన్ డ్యూటీ' ట్రైలర్ విషయానికి వస్తే... 'ఇన్నాళ్లు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గా చట్టప్రకారం డ్యూటీ చేసిన నేను, ఇకపై రామారావుగా ధర్మం కోసం డ్యూటీ చేస్తాను' అని రవితేజ ఒక డైలాగ్ చెప్పారు. అందులో కథను అర్థం చేసుకోవచ్చు. ధర్మం కోసం చట్టాన్ని పక్కన పెట్టిన ఒక అధికారి కథే ఈ సినిమా అని తెలుస్తోంది. ప్రభుత్వ అధికారి - ప్రతినాయకుడి మధ్య పోరాటం, ఫైట్లు, పాటలు... కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ అని అర్థం అవుతోంది. కనపడకుండా పోయిన వందల మంది కష్టజీవుల కోసం ఒక ప్రభుత్వ అధికారి చేశాడన్నది ఆసక్తి కలిగించింది. మాస్ మహారాజా అభిమానులకు ఈ ట్రైలర్ కిక్ ఇస్తోంది. సినిమాపై అంచనాలు పెంచింది.
Also Read : మెగా 154 సెట్స్‌లో రవితేజ, వెల్కమ్ చెప్పిన చిరంజీవి - మెగా మాస్ కాంబో షురూ
శరత్ మండవ (Sarath Mandava) ను దర్శకుడిగా పరిచయం చేస్తూ... ఎస్ఎల్‌వీ సినిమాస్, ఆర్‌టీ టీం వర్క్స్ పతాకాలపై యువ నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లు. జూలై 29న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.
View this post on Instagram