అన్వేషించండి

Demonte Colony 2: అప్పుడు బూత్... ఇప్పుడు డీమాంటీ కాలనీ - రామ్ గోపాల్ వర్మ!

Ram Gopal Varma: తమిళనాడులో ఆగస్టు 15న విడుదలై, ఈ శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానున్న సినిమా 'డీమాంటీ కాలనీ 2'. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో రామ్ గోపాల్ వర్మ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు.

అరుళ్ నిధి హీరోగా అజయ్ ఆర్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన 'డీమాంటీ కాలనీ 2' తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అక్కడ ఆగస్టు 15న విడుదల కాగా... తెలుగు రాష్ట్రాల్లో ఈ శుక్రవారం విడుదలకు సిద్ధమైంది. ఆల్రెడీ ప్రీమియర్ షోలు వేశారు. వాటికి మంచి స్పందన లభించింది. శ్రీ బాలాజీ ఫిలింస్ పతాకంపై ఎన్. శ్రీనివాస రెడ్డి సమర్పణలో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు నిర్మాతలు బి సురేష్ రెడ్డి, బి మానస రెడ్డి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముఖ్య అతిథిగా విచ్చేశారు. 

బూత్ షూటింగ్ చేసిన బంగ్లా ఇంకా అమ్ముడు పోలేదు!
'డీమాంటీ కాలనీ 2' ప్రీ రిలీజ్ వేడుకలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ... ''నేను  20 సంవత్సరాల క్రితం 'భూత్' సినిమాను తీశా. ఆ కథంతా ఓ అపార్ట్మెంట్‌లో జరుగుతుంది. 'బూత్' (తెలుగులో '12వ అంతస్థు') విడుదలైన తర్వాత అందులోకి వెళ్లేందుకు చాలా మంది భయపడి కొంతకాలం భయపడి చాలామంది వెళ్లలేదు. ఇప్పటికీ ఆ బిల్డింగ్ అమ్ముడు కాలేదు. 'డీమాంటీ కాలనీ' విడుదల అయ్యాక సినిమాకు ఆ కాలనీ పేరు పెట్టినందుకు కాంట్రవర్సీ జరిగిందని దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు చెప్పారు'' అని అన్నారు. అప్పట్లో బూత్... ఇప్పుడు 'డీమాంటీ కాలనీ 2' భారీ విజయాలు సాధించాయి. 

'డీమాంటీ కాలనీ 2' తెలుగు రిలీజ్ గురించి రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ... ''ఈ సినిమా తమిళంలో ఆల్రెడీ సక్సెస్ సాధించింది. ఇప్పుడు మరో భాష తెలుగులోకి వస్తోందంతే. నిర్మాత సురేష్ రెడ్డి మంచి సినిమాలు తీసుకుంటాడనే నమ్మకం ఉంది. నేను ప్రీమియర్ చూడలేదు కానీ తమిళ స్నేహితుల నుంచి ఇక్కడ ప్రీమియర్ చూసినోళ్ల వరకు అందరి నుంచి మంచి టాక్ వచ్చింది. ఇప్పుడు కంటెంట్ ఉన్న సినిమాలు చూస్తున్నారు. సో, తెలుగులోనూ 'డీమాంటీ కాలనీ 2' పెద్ద హిట్ అవుతుంది'' అని అన్నారు.

దర్శకుడి మీద నమ్మకంతో తెలుగులో విడుదల!
'డీమాంటీ కాలనీ 2'ను తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాత బి సురేష్ రెడ్డి ''నాకు ఫస్ట్ ఫిల్మ్ 'డీమాంటీ కాలనీ' బాగా నచ్చింది. దాంతో సీక్వెల్ అనౌన్స్ అయినప్పటి నుంచి దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు గారితో మాట్లాడుతున్నాను. వీఎఫ్ఎక్స్ వల్ల విడుదల కొంత ఆలస్యమైంది. తమిళంలో పెద్ద విజయం సాధించిన ఈ సినిమా తెలుగులో అంత కంటే ఘన విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా. ఇందులో హారర్ కంటే థ్రిల్లర్ అంశాలు ఎక్కువ పేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. 'అంజలి ఐపీఎస్', 'కోబ్రా', 'డీమాంటీ కాలనీ'... అజయ్ జ్ఞానముత్తు తీసిన సినిమాలు బాగుంటాయి. ఆయన ప్రతిభ మీద నమ్మకంతో ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నా'' అని అన్నారు.

Also Read: ఇష్టమైతే, నచ్చితే వెళ్తా... వైసీపీ సపోర్ట్, నంద్యాల ఎపిసోడ్‌పై పవన్, నాగబాబుకు బన్నీ కౌంటర్?


'ఆర్ఎక్స్ 100', 'మహాసముద్రం', 'మంగళవారం' చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ... ''నేను దర్శకత్వ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో 'డీమాంటీ కాలనీ' విడుదలైంది. అది ఎన్నోసార్లు చూసి థ్రిల్ అయ్యాను. సగం సినిమా అంతా ఒక్క  గదిలో జరిగినా దర్శకుడు ఎంగేజ్ చేయగలిగాడు. 'డీమాంటీ కాలనీ 2' తీసుకుంటున్నానని నా మిత్రుడు సురేష్ రెడ్డి చెప్పినప్పుడు ఒక్క క్షణం ఆలోచించకుండా తీసుకోమని చెప్పా. సేమ్ డైరెక్టర్ కాబట్టి ఖచ్చితంగా బాగా చేస్తాడని అన్నాను. నేను తెలుగు ప్రీమియర్ చూశా. ఎంతో థ్రిల్ ఫీలయ్యా'' అని చెప్పారు.

Also Readబాక్సాఫీస్ బరిలో 9000 కోట్లు, ఆస్కార్స్‌లో 2 అవార్డులు... హాలీవుడ్ బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్ రెడీ - రిలీజ్ ఎప్పుడంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Casio launches first smart ring: స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లో -  అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లో - అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
Embed widget