Ram Charan: ఎన్టీఆర్‌ను డామినేట్ చేశాడా? రామ్ చరణ్ ఆన్సర్ ఏంటి?
Ram Charan responds on dominating NTR in RRR: 'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్‌ను రామ్ చరణ్ డామినేట్ చేశాడా? అసలు, చరణ్ ఏమనుకుంటున్నారు? ఏమిటి?
![Ram Charan: ఎన్టీఆర్‌ను డామినేట్ చేశాడా? రామ్ చరణ్ ఆన్సర్ ఏంటి? Ram Charan vs NTR in RRR, Who score more marks? Ram Charan clears air about dominating NTR Ram Charan: ఎన్టీఆర్‌ను డామినేట్ చేశాడా? రామ్ చరణ్ ఆన్సర్ ఏంటి?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/07/c4c8d04fa856ea2ba0c7ae65463a95a4_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
RRR 1000 Crore Success Bash: 'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదలైనప్పటి నుంచి ఒక డిబేట్ జరుగుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాగా చేశాడా? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాగా చేశాడా? ఇద్దరిలో ఎవరు బాగా చేశారు? అని! ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య గానీ... దర్శక నిర్మాతలు రాజమౌళి, డీవీవీ దానయ్య మధ్య గానీ... అటువంటి చర్చ వచ్చి ఉండదు. కానీ, కొంత మంది ప్రేక్షకుల్లో ఉంది.
కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్‌ను, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్‌ను రాజమౌళి బాగా చూపించినప్పటికీ... ఎన్టీఆర్ కంటే చరణ్‌కు మంచి పాత్ర లభించిందని, అతడు బాగా నటించాడని, పతాక సన్నివేశాల్లో చరణ్ ఎలివేట్ అయ్యాడనేది కొందరి అభిప్రాయం. ఇది రామ్ చరణ్ దగ్గరకు వెళ్ళింది.
ముంబైలో జరిగిన 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ పార్టీలో రామ్ చరణ్ ఇదే విషయమై మాట్లాడుతూ "ఒక్క క్షణం కూడా నేను అలా అనుకోను. నమ్మను కూడా! మేం ఇద్దరం బాగా చేశాం. తారక్ ఫెంటాస్టిక్. అతడితో పని చేయడం ఎంజాయ్ చేశా. 'ఆర్ఆర్ఆర్' కోసం అతడితో చేసిన ప్రయాణాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటా" అని రామ్ చరణ్ చెప్పారు.
Also Read: యూనివర్సిటీకి వెళ్తున్న రామ్ చరణ్, కియారా అడ్వాణీ! ఎక్కడంటే?
'ఆర్ఆర్ఆర్' సక్సెస్ పార్టీకి బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, ప్రముఖ రచయిత జావేద్ అక్తర్, దర్శక నిర్మాత కరణ్ జోహార్, హీరోయిన్ హ్యూమా ఖురేషి తదితరులు హాజరయ్యారు.
Also Read: ప్రేమించడానికి రీజన్, ఎందుకు ప్రేమించామా అంటే ఆన్సర్ ఉండకూడదు - '18 పేజెస్' గ్లింప్స్ చూశారా?
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)