News
News
X

RC15లో రామ్ చరణ్ వండర్ - 80 సెకన్లపాటు ఆగకుండా డ్యాన్స్

మొన్న ‘ఆర్ఆర్ఆర్’లో ‘‘నాటు నాటు’’ స్టెప్పులతో ఇరగదీసిన చెర్రీ.. ఇప్పుడు RC15లో కూడా అదిరిపోయే డ్యాన్స్ చేశాడట.

FOLLOW US: 
Share:

‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత రామ్ చరణ్ ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో RC15 మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటోంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. రాంచరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ టీమ్ కొన్నాళ్లు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే మళ్లీ షూటింగును మొదలుపెట్టి.. శరవేగంగా సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. `RC15` సినిమా కోసం చరణ్ చేసిన డ్యాన్స్ వైరల్‌గా మారింది. 

`RC15` సినిమాలో ఓ పాటను చిత్రీకరిస్తుంది చిత్ర యూనిట్. ఈ పాటకు దాదాపుగా రూ.5 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారట. ఈ పాట కోసం రామ్ చరణ్ చేసిన 80 సెకన్ల డాన్స్.. సినిమాకు హైలెట్ గా నిలవనుందని తెలుస్తోంది. సింగిల్ టేక్ లో చెర్రీ డాన్స్ ను అదరగొట్టేశారని సమాచారం. ఆ డ్యాన్స్ చూసి దర్శకుడు శంకర్ కూడా అలా చూస్తుండిపోయారట. అంటే చెర్రీ మరోసారి డ్యాన్స్‌తో ఫిదా చేయనున్నాడని అర్థమైపోతోంది.

ఈ సినిమాలోనే మరోపాట కోసం కూడా దాదాపుగా రూ.15 కోట్లు ఖర్చు చేశారని తెలుస్తోంది. ఈ విషయంపై నెటిజన్స్ స్పందిస్తూ.. ఈ రెండు పాటల కోసం పెట్టే ఖర్చుతో ఓ చిన్న పాటి సినిమా తీయచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక త్వరలోనే మరో కొత్త షెడ్యూల్ రానుందని తెలుస్తోంది. ప్రస్తుతం శంకర్ ‘ఇండియన్ 2’ కోసం చెన్నై వెళ్లినట్లు సమాచారం. ఓ నెల రోజుల పాటు ఆ సినిమా షూటింగ్ జరుపనున్నారట. ఆ తర్వాత చరణ్ సినిమా కొత్త షెడ్యూల్ షురూ కానుంది. 

ఈ సినిమాలో సీనియర్ నటి ఖుష్బూ ఓ కీలకపాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది. ఈ పాత్ర సినిమా మొత్తంలో చాలా కీలకం అని తెలుస్తోంది. అలాగే ఈ మూవీలో రామ్ చరణ్ డ్యుయల్ రోల్ లో కనిపించనున్నాడని సమాచారం. వీటిలో ఒక పాత్రలో గ్రామీణ యువకుడిగా కనిపిస్తే.. మరో పాత్రలో స్టైలిష్ గా కనిపిస్తారని టాక్. ఇక మంచి అంచనాల నడుమ వస్తున్న ఈ సినిమా విషయంలో మొదటి నుంచి లీకులు మాత్రం తప్పడం లేదు. ఇప్పటికే ఓ వీడియో, ఫోటోలు లీక్ అవ్వగా.. తాజాగా మరికొన్ని లీక్ అయినట్లు తెలుస్తోంది. షూటింగ్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎన్ని సార్లు హెచ్చరించినా.. కూడా కొన్ని ఫోటోలు లీక్ అవుతున్నాయని తెలుస్తోంది. గతంలో రామ్ చరణ్ రిక్షా తొక్కుకుంటూ తెల్లని దుస్తుల్లో ఒక కామన్ మ్యాన్ కనిపించిన విషయం తెలిసిందే. 

Read Also: చెర్రీ మనసు దోచిన ఇద్దరు హీరోయిన్లు, ఇంతకీ ఆ ముద్దుగుమ్మలు ఎవరో తెలుసా?

లోకేష్ యూనివర్శ్‌లో చెర్రీ?

రామ్ చరణ్ గురించి మైండ్ బ్లాక్ అయిపోయే మరో వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారట. ఇంతకీ ఆ వార్త ఏంటంటే.. తమిళ స్టార్ నటుడు విజయ్ దళపతి విజయ్ నటిస్తోన్న సినిమా ‘లియో’. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో దుమ్ములేపుతోన్న విషయం తెలిసిందే. ఇప్పుడీ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Published at : 17 Feb 2023 09:34 PM (IST) Tags: RC15 Movie Dance Ram charan Dance Ram Charan 80 Seconds Dance

సంబంధిత కథనాలు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Silk Smitha Poster: ‘దసరా’ మూవీలో సిల్క్ స్మితా పోస్టర్ వెనుక ఇంత కథ ఉందా - అసలు విషయం చెప్పేసిన దర్శకుడు

Silk Smitha Poster: ‘దసరా’ మూవీలో సిల్క్ స్మితా పోస్టర్ వెనుక ఇంత కథ ఉందా - అసలు విషయం చెప్పేసిన దర్శకుడు

Naga Chaitanya - Sobhita Dhulipala: చైతూ - శోభిత మళ్లీ దొరికిపోయారా? వైరల్ అవుతున్న డేటింగ్ ఫొటో!

Naga Chaitanya - Sobhita Dhulipala: చైతూ - శోభిత మళ్లీ దొరికిపోయారా? వైరల్ అవుతున్న డేటింగ్ ఫొటో!

Parineeti Chopra Wedding: ఆ ఎంపీతో బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా పెళ్లి? అసలు విషయం చెప్పేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత

Parineeti Chopra Wedding: ఆ ఎంపీతో బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా పెళ్లి? అసలు విషయం చెప్పేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత

Actress Samantha:వాళ్లంతట వాళ్లే ఇవ్వాలి గానీ, అడుక్కోకూడదు: సమంత

Actress Samantha:వాళ్లంతట వాళ్లే ఇవ్వాలి గానీ, అడుక్కోకూడదు: సమంత

టాప్ స్టోరీస్

KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

KTR On Amaravati :   అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మ‌ర‌డం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మ‌ర‌డం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Eesha Rebba: అందాలతో అబ్బా అనిపిస్తున్న ఈషా రెబ్బ

Eesha Rebba: అందాలతో అబ్బా అనిపిస్తున్న ఈషా రెబ్బ