Actor Ram Charan: చెర్రీ మనసు దోచిన ఇద్దరు హీరోయిన్లు, ఇంతకీ ఆ ముద్దుగుమ్మలు ఎవరో తెలుసా?
హీరో రామ్ చరణ్ ఆన్ స్క్రీన్ క్రష్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇద్దరు హీరోయిన్లు అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. వాళ్లు తెర మీద కనిపిస్తే కళ్లు ఆర్పకుండా చూస్తానని చెప్పుకొచ్చారు.
రామ్ చరణ్ తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోగా కొనసాగుతున్న నటుడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం తమిళ దర్శకుడు శంకర్ తో కలిసి భారీ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా చెర్రీ ఓ అంతర్జాతీయ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన ఆన్ స్క్రీన్ క్రష్ ఎవరో చెప్పుకొచ్చారు. వారంతే తనకు ఎందుకు అంత ఇష్టమో కూడా వివరించారు.
ఆ హీరోయిన్లు అంటే చాలా ఇష్టం - చెర్రీ
ఈ ఇంటర్వ్యూలో మీ క్రష్ ఎవరు? అనే ప్రశ్నకు రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పారు. తనకు హాలీవుడ్ నటి జూలియా రాబర్ట్స్ అంటే చాలా క్రష్ ఉందన్నారు. “జూలియా రాబర్ట్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఆమె ఎప్పుడు స్క్రీన్ మీద కనిపించినా కళ్లు ఆర్పకుండా చూస్తాను. ‘ప్రెట్టీ ఉమెన్’ సినిమా దగ్గరి నుంచి తనకు నేను పెద్ద ఫ్యాన్” అని చెర్రీ వివరించారు. అటు కేథరీనా జీటా జోన్స్ అంటే కూడా తనకు చాలా ఇష్టం అని చెప్పారు. తను నటించిన ‘ది మాస్క్ ఆఫ్ జోరో’ అనే సినిమా అంటే నాకు చాలా ఇష్టం” అని తెలిపారు.
శంకర్ సినిమా షూటింగ్ లో బిజీ బిజీ
ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో బిజీగా ఉన్నాడు. ‘RC15’ వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో కియారా అద్వానీ, SJ సూర్య, అంజలి, జయరామ్, సునీల్, శ్రీకాంత్ నటించారు. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తన 16వ సినిమాను యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో చేయనున్నారు. నవంబర్‌లో షురూ కానున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. అటు సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించబోతున్నారు.
ఆస్కార్ అవార్డుల కోసం ఎదురు చూస్తున్న చెర్రీ
మరోవైపు చెర్రీ ఆస్కార్ 2023 అవార్డుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అతడు నటించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేషన్ పొందింది. ఈ చిత్రం ఆస్కార్ అవార్డును గెలుచుకుంటే ఈ కేటగిరీలో అవార్డు పొందిన తొలి భారతీయ చిత్రంగా నిలుస్తుంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఇప్పటికే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకుంది.
View this post on Instagram
Read Also: మోహన్‌లాల్ మూవీకి హాలీవుడ్ సంగీత దర్శకుడి మ్యూజిక్