By: ABP Desam | Updated at : 17 Feb 2023 10:42 AM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@Mohanlal/twitter
భారతీయ సినీ పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. ప్రస్తుతం తెరకెక్కుతున్న ఇండియన్ సినిమాలన్నీ హాలీవుడ్ స్థాయిలో రూపొందిస్తున్న సినీ దర్శకులు. ఇప్పటికే ఇండియన్ యాక్టర్లు హాలీవుడ్ లో రాణిస్తున్నారు. ఇక భారతీయ సినిమాలకు హాలీవుడ్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. తాజాగా తెరకెక్కిన ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలకు ఫారిన్ టెక్నీషియన్లు తమ సహాయ సహకరారాలు అందించారు. తాజాగా సౌత్ నుంచి తెరకెక్కతున్న ఓ ప్రతిష్టాత్మక మూవీకి హాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేయబోతున్నాడు.
మోహన్ లాల్ సినిమాకు మార్క్ కిలియన్ మ్యూజిక్
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘బరోజ్: గార్డియన్ ఆఫ్ డిగామాస్ ట్రెజర్’. ఈ చిత్రానికి జిజో పున్నూస్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అతడు రాసని ‘బరోజ్: గార్డియన్ ఆఫ్ డ'గామాస్ ట్రెజర్’ నవలను బేస్ చేసుకునే ఈ సినమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు హాలీవుడ్ సంగీత దర్శకుడు మార్క్ కిలియన్ మ్యూజిక్ అందిస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని మోహన్ లాల్ వెల్లడించారు. తన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులోకి మార్క్ ను ఆహ్వానిస్తూ అతడితో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Team Barroz welcomes musical genius Mr. Mark Kilian onboard!#Barroz@santoshsivan #Jijo #RajeevKumar@antonypbvr @aashirvadcine pic.twitter.com/ZTfGp5BHhi
— Mohanlal (@Mohanlal) February 16, 2023
ఫాంటసీ మూవీగా రూపుదిద్దుకుంటున్న ‘బరోజ్’
ఇక మోహన్ లాల్ నటిస్తూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఫాంటసీ మూవీగా రూపుదిద్దుకుంటున్నది. మోహన్‌లాల్ డి'గామాకు చెందిన పురాతన నిధికి కాపలాగా ఉండే వ్యక్తి పాత్రను పోషిస్తున్నారు. దాని రక్షణ కోసం తన వారసుడిని ఎంపిక చేయడమే సినిమా కథగా తెలుస్తోంది. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ లో ఆంటోని ప్రీం బావూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాయ, శర వేగ, తుహిన్ మీనన్, గురు సోమసుందరం, సీజర్ లోరెంటే రాటన్ సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రానికి లిడియన్ నాధస్వరం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్నన ‘బరోజ్’ చిత్రం, ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమా సమ్మర్ కానుకగా విడుదలయ్యే అవకాశం ఉంది. త్వరలో అధికారికంగా ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.
వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న మోహన్ లాల్
ఇక మోహన్ లాల్ ఇతర సినిమాల విషయానికి వస్తే ‘రామ్: చాప్టర్1’ పేరుతో మరో మూవీ చేస్తున్నారు. ఉగ్రవాద నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మరోవైపు గత కొంతకాలంగా మోహన్ లాన్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటలేకపోతున్నాయి. తాజాగా విడుదలైన ‘అలోన్’ కూడా నిరాశపరచ్చింది. దానికి ముందు విడుదలైన ‘మాన్ స్టర్’ కూడా ఫ్లాప్ గానే నిలిచింది.
Read Also: లిప్ లాక్ సీన్లపై స్పందించిన అనిఖా సురేంద్రన్ - ఎంత మాట అనేసింది!
Saindhav: గన్నులు, బుల్లెట్లు, బాంబులతో వస్తున్న వెంకటేష్ ‘సైంధవ్’ - రిలీజ్ డేట్ ఫిక్స్!
PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!
Dasara' movie: ‘దసరా’ సినిమా వెనుక 5 ఆసక్తికర విషయాలు, తెలిస్తే మిస్ చేయకుండా చూస్తారు!
Priyanka Chopra: పెళ్లికి ముందే అండాలను దాచిపెట్టాను, అమ్మే అలా చేయమంది: ప్రియాంక చోప్రా
Shaakuntalam in 3D: 3Dలో ‘శాకుంతలం’ - ఐమ్యాక్స్‌లో ట్రైలర్ చూసి, ప్రేక్షకులు ఫిదా
ABP CVoter Karnataka Opinion Poll: కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్, ఆసక్తికర విషయాలు చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్
Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !
TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!
Sri Rama Navami Wishes In Telugu 2023: మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి