Anikha Surendran: లిప్ లాక్ సీన్లపై స్పందించిన అనిఖా సురేంద్రన్ - ఎంత మాట అనేసింది!
‘ఓ మై డార్లింగ్’లో లిప్ లాక్ సన్నివేశాలపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో నటి అనిఖా సురేంద్రన్ వివరణ ఇచ్చింది. రొమాంటిక్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో కచ్చితంగా రొమాంటిక్ సీన్లు ఉండాల్సిందేనని చెప్పింది.
బాలనటిగా పలు చిత్రాల్లో కనిపించిన అనిఖా సురేంద్రన్ ‘బుట్ట బొమ్మ’ మూవీతో హీరోయిన్ గా తెలుగులోకి తెరంగేట్రం చేసింది. మలయాళ చిత్రం ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అనిఖా నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ మలయాళంలో నటించిన సినిమా ‘ఓ మై డార్లింగ్’. ఇందులో అనిఖా ముద్దు సీన్లతో అభిమానులకు షాకిచ్చింది. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ లో అనిఖాను చూసి సినీ అభిమానులు ముక్కున వేలేసుకున్నారు. తాజాగా ఈ విమర్శలపై నటి అనిఖా వివరణ ఇచ్చింది.
లిప్ లాక్ సీన్లపై అనిఖా సురేంద్రన్ వివరణ
“ఓ మై డార్లింగ్' అనేది కంప్లీట్ గా రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందింది. ఇందులో ముద్దు సీన్లు కచ్చితంగా ఉండాల్సిందే. అవి లేకుండా సినిమా ఉండదు. దర్శకుడు తనకు స్క్రిప్ట్ చెప్పేటప్పుడు సన్నిహిత సన్నివేశాల ఇంపార్టెన్స్ కూడా చెప్పాడు. కథకు అవసరమైన సన్నివేశాల్లో మాత్రమే రొమాంటిక్ సీన్లు చేశాను. అయితే, ఈ సీన్లలో ఎలాంటి అశ్లీలత కనిపించదు. సినిమా చూసినప్పుడు ప్రేక్షకులకు ఈ విషయం అర్థం అవుతుంది” అని అనిఖా వివరించింది.
ఈ మధ్యే 18 ఏళ్లు పూర్తి చేసుకున్న అనిఖా
అనిఖా తాజా మలయాళ చిత్రం ‘ఓ మై డార్లింగ్’ కు సంబంధించి మేకర్స్ ఇటీవల విడుదల చేసిన ట్రైలర్, సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ట్రైలర్‌లో హాట్ హాట్ లిప్ లాక్ సన్నివేశాలు అందరినీ షాక్ కి గురి చేశాయి. అనిఖా అప్పుడే హాట్ సీన్లలో రెచ్చిపోవడంపై నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడే ఇలాంటి సీన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే మున్ముందు ఇంకెలా ఉంటుందో? అని కామెంట్స్ చేస్తున్నారు. అనిఖా ఇటీవలే 18 ఏళ్లు పూర్తి చేసుకుంది. దీంతో హీరోయిన్ అవకాశాల కోసం గట్టిగానే ట్రై చేస్తోంది. ఇకపై చెల్లి, కూతురు పాత్రలకు దూరంగా ఉండాలని అనిఖా భావిస్తున్నట్లు టాక్.
Also Read: ముద్దు సీన్లతో షాకిచ్చిన ‘బుట్టబొమ్మ’ స్టార్ అనిఖా సురేంద్రన్, ఆ ట్రైలర్ వైరల్
ఫిబ్రవరి 24న ‘ఓ మై డార్లింగ్’ విడుదల
ఈ సినిమాకు ఫ్రెడ్ డి శామ్యూల్ దర్శకత్వం వహించాడు. జినీష్ కె జోయ్ హాస్ ఈ చిత్రానికి కథను అందించారు. అన్సార్ షా సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. షాన్ రెహమాన్ సంగీతం అందించాడు. లిజో పాల్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో మెల్విన్ జి బాబు, ముఖేష్, లీనా, జానీ ఆంటోని, మంజు పిళ్లై, విజయ రాఘవన్, నందు, అర్చన మీనన్, ఫుక్రు, డైన్ డేవిస్, రీతు, మనోజ్ శ్రీకాంత, షాజు శ్రీధర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యాష్ ట్రీ వెంచర్స్ బ్యానర్‌పై మనోజ్ శ్రీకాంత నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 24న థియేటర్లలోకి రానుంది.
View this post on Instagram
Read Also: అమెరికాలో దుమ్మురేపుతున్న ‘రైటర్ పద్మభూషణ్’, బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం!