News
News
X

Writer Padmabhusan Movie Collections: అమెరికాలో దుమ్మురేపుతున్న ‘రైటర్ పద్మభూషణ్’, బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం!

సుహాస్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా చక్కటి విజయాన్ని అందుకుంది. అమెరికాలో భారీగా వసూళ్లను సాధిస్తోంది.

FOLLOW US: 
Share:

యంగ్ టాలెంటెడ్ హీరో సుహాస్, దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో టీనా శిల్పరాజ్ హీరోయిన్ గా నటించింది. అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహార్ కలిసి నిర్మించారు. ఫిబ్రవరి 3న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తొలి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. సుహాస్ నటనతో పాటు కథ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. చిన్న సినిమాగా రూపొందిన ఈ చిత్రం, పెద్ద విజయాన్ని  అందుకుంది. 

అమెరికాలో భారీగా వసూళ్లు

ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది.  USA బాక్సాఫీస్ దగ్గర 350K$ వసూలు చేసింది. చిన్న బడ్జెట్ చిత్రిం అమెరికాలో సంచలన విజయాన్ని  సాధించింది. అంతేకాదు, క్లాస్ సినిమాలకు యూఎస్ ఎప్పుడూ మంచి మార్కెట్ ఉంటుందని ‘రైటర్ పద్మభూషణ్’తో మరోసారి నిరూపించబడింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.10 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.

View this post on Instagram
 
A post shared by Suhas (@suhassssssss)

మహిళలకు ఉచితంగా సినిమా చూసే అవకాశం

ఇక ‘రైటర్ పద్మభూషణ్’ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోని మహిళలు ఉచితంగా చూసే విధంగా ఏర్పాట్లు చేశారు చిత్రబృందం. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా సుమారు 38 థియేటర్లలో ఈ అవకాశం కల్పించారు. మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా ఒక నెల ముందుగా ఫిబ్రవరి 8న ఈ ప్రత్యేక అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఒక్క రోజునే  సుమారు 33,136 మంది మహిళలు ఈ చిత్రాన్ని ఉచితంగా వీక్షించారు. టాలీవుడ్ చరిత్రలో ఇంతమంది మహిళలు ఒక సినిమాను థియేటర్లో ఫ్రీగా చూడటం ఇదే మొదటిసారి. ‘రైటర్  పద్మభూషణ్’ క్లైమాక్స్, అమ్మ ప్రేమను చూపించిన విధానం ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. దీంతో దర్శక నిర్మాతలపై ప్రశంసలు వర్షం కురుస్తోంది. కంటెంట్‌ ఉంటే ప్రేక్షకులు సినిమాలను ఎంతైనా ఆదరిస్తారని మరోసారి తెలుగు ప్రేక్షకులు నిరూపించారు.   

కమెడియన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సుహాస్ కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారిపోయారు. అంతేకాదు, ఇటీవల విడుదలైన ‘హిట్ -2’ సినిమాలో సైకో కిల్లర్ పాత్రను పోషించాడు సుహాస్. అటు హీరోగానే కాదు ఇటు విలన్ గా కూడా తనదైన నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. తాజాగా ‘రైటర్ పద్మభూషణ్ ’ మూవీతో కూడా ఆకట్టుకుంటున్నాడు. ఈ మూవీ ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే మంచి రెస్పాన్స్ ను సొంత చేసుకుంది.

అటు ఈ సినిమా బృందాన్ని  సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం అభినందించారు. ట్విట్టర్ వేదికగా ‘రైటర్ పద్మభూషణ్’ ట్రైలర్ లింక్ ను షేర్ చేస్తూ... మీరు ఎప్పుడూ కొత్తగా ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారని చెబుతూ మూవీ నిర్మాతలు అనురాగ్ రెడ్డి, శరత్ చంద్రలను ప్రశంసించారు.

Read Also: ‘పుష్ప2‘ కోసం బంపర్ ఆఫర్, రిజెక్ట్ చేసిన సమంత? బన్నీ ప్రయత్నించినా ఒప్పుకోలేదట!

Published at : 16 Feb 2023 10:27 AM (IST) Tags: USA Box-office Writer Padmabhusan Movie Writer Padmabhusan Collections

సంబంధిత కథనాలు

Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!

Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!

Kangana Ranaut on Thalaivii: కంగనాకు ‘తలైవి’ రూపంలో కొత్త చిక్కులు, ఆరు కోట్లు ఇవ్వాలంటూ ఆ సంస్థ డిమాండ్?

Kangana Ranaut on Thalaivii: కంగనాకు ‘తలైవి’ రూపంలో కొత్త చిక్కులు, ఆరు కోట్లు ఇవ్వాలంటూ ఆ సంస్థ డిమాండ్?

Padipotunna Song : ప్రేమలో 'పడిపోతున్న' అబ్బాయ్ - 'గేమ్ ఆన్'లో కొత్త సాంగ్ 

Padipotunna Song : ప్రేమలో 'పడిపోతున్న' అబ్బాయ్ - 'గేమ్ ఆన్'లో కొత్త సాంగ్ 

Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?

Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?

Chiranjeevi - Brahmanandam : బ్రహ్మికి చిరు, చరణ్ సత్కారం - స్టార్స్‌ను మెప్పిస్తున్న 'రంగమార్తాండ'

Chiranjeevi - Brahmanandam : బ్రహ్మికి చిరు, చరణ్ సత్కారం - స్టార్స్‌ను మెప్పిస్తున్న 'రంగమార్తాండ'

టాప్ స్టోరీస్

Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి

Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి  బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి

KCR in Khammam: రైతులకు కేసీఆర్ గుడ్‌న్యూస్ - ఎకరానికి 10 వేలు, గంటలోనే నిధులు మంజూరు: సీఎం

KCR in Khammam: రైతులకు కేసీఆర్ గుడ్‌న్యూస్ - ఎకరానికి 10 వేలు, గంటలోనే నిధులు మంజూరు: సీఎం

Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్‌ లీక్- సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు

Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్‌ లీక్-  సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు

TDP On Tammneni : డిగ్రీ చేయకుండానే లా కోర్సులో చేరిన ఏపీ స్పీకర్ తమ్మినేని - తెలంగాణ టీడీపీ నేతల ఆరోపణ !

TDP On Tammneni : డిగ్రీ చేయకుండానే లా కోర్సులో చేరిన ఏపీ స్పీకర్ తమ్మినేని - తెలంగాణ టీడీపీ నేతల ఆరోపణ !