Pushpa 2 Film: ‘పుష్ప2‘ కోసం బంపర్ ఆఫర్, రిజెక్ట్ చేసిన సమంత? బన్నీ ప్రయత్నించినా ఒప్పుకోలేదట!
‘పుష్ప‘ సినిమాలో ఐటెమ్ సాంగ్ తో దుమ్మురేపిన సమంతా, ‘పుష్ప2‘ నుంచి వచ్చిన భారీ ఆఫర్ ను తిరస్కరించిందట. అల్లు అర్జున్ ఆమెను ఒప్పించేందు ప్రయత్నించినా ఫలితం లేదట.
అల్లు అర్జున్ సెన్సేషనల్ పాన్ ఇండియన్ హిట్ ‘పుష్ప: ది రైజ్’ చిత్రంలో సమంత రూత్ ప్రభు ‘ఊ అంటావా మావా ఊ ఊ అంటావా’ అంటూ ఐటెమ్ సాంగ్‌తో అదరగొట్టింది. సినిమా విడుదలకు ముందే దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది. తన అందంతో పాటకే కొత్త ఊపు తీసుకొచ్చింది సమంత. ఈ పాటతో సమంత విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆమె డ్యాన్సుకు అభిమానులు ఓ రేంజిలో ఫిదా అయ్యారు. ‘పుష్ప’ హిట్ లో సమంత పాట సైతం కీరోల్ పోషించింది.
‘పుష్ప-2’ ఆఫర్ ను తిరస్కరించిన సమంత?
‘పుష్ప2’ సినిమాలో సమంత కీలక పాత్ర పోషించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, సమంతా ఈ సినిమా కోసం వచ్చిన భారీ ఆఫర్ ను తిరస్కరించినట్లు సమాచారం. ఓ వార్తా సంస్థ కథనం ప్రకారం.. ‘పుష్ప2’ కోసం దర్శకుడు సుకుమార్ మరో స్పెషల్ సాంగ్ కోసం సమంతను సంప్రదించాడట. అయితే, తాను ప్రస్తుతం స్పెషల్ నంబర్స్ చేయడానికి సిద్ధంగా లేనని చెప్పిందట. సుక్కు ఆఫర్ ను సున్నితంగా తిస్కరరించిందట. అయినా, ఆమెతో ఐటెం సాంగ్ చేయించేందుకు సినిమా బృందం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ సమంతా కోసం ఈ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ కూడా రూపొందిస్తానని చెప్పాడట. మరోవైపు అల్లు అర్జున్ కూడా రంగంలోకి దిగాడట. సమంతతో స్వయంగా మాట్లాడి ఒప్పించేందుకు ప్రయత్నించాడట. అయినా ఆమె నో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, ఇవన్నీ ‘పులిహోర’ పుకార్లని అంటున్నారు కొందరు. అల్రెడీ ‘పుష్ప: ది రైజ్’లో ఐటెమ్ సాంగ్ చేసిన సమంతాతో మళ్లీ ఎందుకు అదే ప్రయత్నం చేస్తారని అంటున్నారు. అంతేగాక ప్రత్యేకంగా ఆమెకు పాత్రను ఇచ్చినా.. అతికించినట్లుగా ఉంటుందే తప్పా, సినిమాకు పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చని కూడా అంటున్నారు.
'ఊ అంటావా' పాటతోనే గుర్తు పెట్టుకుంటున్నారు - సమంత
మూడు నిమిషాల ‘‘ఊ అంటావా మావా ఊ ఊ అంటావా’’ పాట కోసం ఆమె రూ.5 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. గత సంవత్సరం క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ లో మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా, సమంత ‘ఊ అంటావా’ పాట గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. “ప్రజలు నాపై ఎలాంటి ప్రేమను కురిపిస్తున్నారో మాటల్లో చెప్పలేను. 'ఊ అంటావా' పాట ఇంత హిట్ అవుతుందని నేను ఊహించలేదు" అని వెల్లడించింది. "తెలుగు ప్రేక్షకులే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు నేను చేసిన ఇతర సినిమాలను మర్చిపోయారు. ఇప్పుడు 'ఊ అంటావా' పాటతోనే గుర్తు పెట్టుకుంటున్నారు" అని వెల్లడించింది.
శరవేగంగా కొనసాగుతున్న ‘పుష్ప-2’ షూటింగ్
ప్రస్తుతం ‘పుష్ప2’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి వైజాగ్ షెడ్యూల్ పూర్తయ్యింది. సుమారు 18 రోజుల పాటు అక్కడ కీలక సన్నివేశాలను షూట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తొలి భాగం ‘పుష్ప’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో రెండో భాగం ‘పుష్ప2’ను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. తొలి భాగంతో పోల్చితే రెండో భాగంలో మరింత ఆసక్తికరంగా రూపొందిస్తున్నారట. ‘పుష్ప’ అద్భుత విజయం సాధించడంతో ‘పుష్ప2’ పై అభిమానుల్లో ఓ రేంజిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అంచనాలకు మించి ఉండేలా దర్శకుడు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
Read Also: బాలీవుడ్ లోకి బన్నీ ఎంట్రీ? ‘జవాన్‘ మూవీలో మెరవనున్న పుష్పరాజ్!