అన్వేషించండి

Ram Charan : పిల్లలను మట్టిలో ఆడనిస్తా - అయ్యప్ప దీక్షతో మార్పు... రామ్ చరణ్ ఇంటర్వ్యూ హైలెట్స్

Ram Charan Interview : తన ఫ్యామిలీ, పిల్లలు, సినిమాల గురించి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. ఎస్క్రైర్ ఇండియా ఇంటర్వ్యూ హైలెట్స్ ఓసారి చూస్తే...

Ram Charan Esquire India Interview Highlights : ఎస్క్వైర్ ఇండియా ఏప్రిల్ ఎడిషన్ కవర్ పేజీపై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మెరిసిన సంగతి తెలిసిందే. ఆ ఇంటర్వ్యూలో తన కెరీర్, పిల్లలు, ఫ్యామిలీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. ఓ నటుడిగా మాత్రమే కాకుండా... తండ్రిగా, భర్తగా తన బాధ్యతలను ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారో వివరించారు. 

'పిల్లలను మట్టిలో ఆడనిస్తా'

పిల్లలే తన ప్రపంచం అని... షూటింగ్ నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత వారితో టైం స్పెండ్ చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు రామ్ చరణ్. 'తండ్రి అయిన తర్వాత నా లైఫ్ పూర్తిగా మారిపోయింది. షూటింగ్ నుంచి ఇంటికి వెళ్లగానే పిల్లలతో టైం స్పెండ్ చేస్తా. వారి అల్లరి చూస్తూ పక్కనుండి ప్రోత్సహిస్తా. వాళ్లను రిస్కులు తీసుకోనిస్తా. దూకనిస్తూ... మట్టిలో ఆడనిస్తా. వాళ్లు కింద పడినా, ఎత్తుపళ్లాలు ఎక్కినా భయపడను. రిస్క్ తీసుకోవాలని, ధైర్యంగా పెరగాలని కోరుకుంటా.

వాళ్ల అమ్మ ఉపాసన మాత్రం పిల్లలను సున్నితంగా చూసుకుంటుంది. క్లీంకారను ఎప్పుడైన తిడితే నా దగ్గరకు వస్తుంది. వాళ్లకు ఏదైనా సాహసం చేయాలన్నా, ధైర్యం కావాలన్నా నా దగ్గరకు వస్తారు. నా ఫ్యామిలీ, పెంపుడు జంతువులే నా ప్రపంచం. నా పెంపుడు కుక్క రైమ్ కూడా ఆటతో నా అలసట పోగొడుతుంది.' అని చెప్పారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Esquire India (@esquireindia)

Also Read : రజనీ కాంత్, కమల్ ప్రాజెక్ట్ నుంచి ఆ డైరెక్టర్ అవుట్? - ఒకే మూవీపై ఎందుకింత కన్ఫ్యూజన్

తండ్రి చెప్పిన మాట...

తన తండ్రి చిరంజీవి వారసత్వంతో పాటు కష్టపడి పని చేసే తత్త్వాన్ని కూడా అందిపుచ్చుకున్నట్లు చెప్పారు చరణ్. అందరూ 50 గంటలు కష్టపడితే నువ్వు 100 గంటలు కష్టపడు అన్నదే తండ్రి తనకు నేర్పిన సూత్రమని... దాన్నే ఫాలో అవుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తాను ఓ నటుడిగా ఉండడమే కాకుండా బాధ్యతలు నిర్వర్తించే తండ్రిగా ఉండడం కూడా తన ఫస్ట్ ప్రయారిటీ అని అన్నారు.

అయ్యప్ప దీక్షతో మార్పు...

అయ్యప్ప దీక్ష తనలో పెను మార్పులు తీసుకొచ్చిందని చెప్పారు చరణ్. 'మా నాన్న చిరంజీవి సూచనతో 17 ఏళ్ల వయసులో ప్రారంభించిన అయ్యప్ప దీక్ష నా లైఫ్‌లో క్రమశిక్షణ పెంచింది. నా ఆలోచనలు నియంత్రించడానికి ఉపయోగపడింది. అనవసర విషయాలకు దూరంగా ఉండి మానసిక ప్రశాంతత పొందడానికి సహాయపడుతుంది.' అని అన్నారు. హాంకాంగ్‌లో ఓ విలాసవంతమైన హోటల్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు చెప్పుల్లేకుండా నడిచి చరణ్ అందరినీ ఆశ్చర్యపరిచారు. అప్పుడు ఆయన అయ్యప్ప దీక్ష తీసుకున్నారు. 

పెద్ది... ఏడాదిన్నర కఠోర శిక్షణ

తన రాబోయే మూవీ పెద్ది కోసం చాలా కష్టపడుతున్నట్లు చెప్పారు చరణ్. 'పెద్దిలో పవర్ ఫుల్ రోల్ కోసం ఏడాదిన్నరగా కఠోర శిక్షణ తీసుకున్నా. ఇలాంటి పాత్రల్లో ఫిట్‌గా కనిపించడం ముఖ్యం. సుల్తాన్, దంగల్ వంటి మూవీస్‌కు పని చేసిన కోచ్ దగ్గర కుస్తీ నేర్చుకున్నా. 'ఆర్ఆర్ఆర్'తో వచ్చిన అంతర్జాతీయ గుర్తింపు నాపై బాధ్యత పదింతలు పెంచింది. మనం కేవలం సినిమాను మాత్రమే కాదు. మన సంస్కృతిని ప్రపంచానికి చెబుతున్నాం. అందుకే ప్రతీ షాట్‌లోనూ నిజాయతీగా నటించాల్సి ఉంటుంది.' అని అన్నారు. ప్రస్తుతం చరణ్ నటిస్తోన్న పెద్ది షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఏప్రిల్ 30న మూవీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Embed widget