Prabhu Deva For RC15 : రామ్ చరణ్ కోసం ప్రభుదేవా - అదీ శంకర్ స్టైల్‌లో
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం ప్రభుదేవాను తీసుకు వస్తున్నారు శంకర్, 'దిల్' రాజు.
ఇండియాలో గ్రేటెస్ట్ డాన్సర్, కొరియోగ్రాఫర్ ఎవరు? అంటే... అందరి నోటి నుంచి ముందుగా వినిపించే పేరు ప్రభుదేవా (Prabhu Deva). టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్... ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రజెంట్ యంగ్ హీరోల్లో మంచి డ్యాన్సర్లు ఎవరు? అని ప్రశ్నిస్తే ముందు వరుసలో వినిపించే పేర్లలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పేరు తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరి కలయికలో ఓ సాంగ్ తెరకెక్కించడానికి RC15 సినిమా టీమ్ రెడీ అవుతోంది.
ప్రభుదేవా కొరియోగ్రఫీలో...
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో 'దిల్' రాజు ఓ పాన్ ఇండియా సినిమా ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఓ పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేయనున్నారు. ఈ నెలాఖరున ఆ సాంగ్ షూటింగ్ చేయడానికి సన్నాహాలు చేశారు.
ఒక్క పాటకు పది రోజులు
సాంగ్స్ తీయడంలో శంకర్ కంటూ ఒక స్టైల్ ఉంది. ఆయన సినిమాల్లోని పాటల్లో భారీతనం కనబడుతుంది. రామ్ చరణ్ కోసమూ ఆయన అటువంటి సాంగ్స్ ప్లాన్ చేశారు. ఆ మధ్య విదేశాల్లో బాస్కో సీజర్ కొరియోగ్రఫీలో ఒక సాంగ్ తీశారు. ఆ తర్వాత హైదరాబాద్, రాజమండ్రి, విశాఖలో మరో సాంగ్ తీశారు. ఆ రెండూ భారీ పాటలే అట. ఇప్పుడు ప్రభుదేవా కొరియోగ్రఫీలో తీయబోయే సాంగ్ కూడా ఆ స్థాయిలో ఉంటుందట.
ఇప్పుడు రామ్ చరణ్ అమెరికాలో ఉన్నారు. మార్చి 12న ఆస్కార్స్ (Oscars 2023) ప్రోగ్రామ్ అటెండ్ అవుతారు. ఆ తర్వాత ఇండియా వచ్చారు. వచ్చిన తర్వాత మార్చి 20న సాంగ్ షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. పది రోజుల పాటు సాంగ్ తీస్తారట. శంకర్ స్టైల్ లో ఆ సాంగ్ ఉంటుందట.
Also Read : హీరోగా కాదు అభిమానిగా ఆస్కార్స్‌కు రామ్ చరణ్ - అక్కడ వాళ్ళిద్దర్నీ చూడాలని...
జూన్‌లో గుమ్మడికాయ కొడతారా?
రామ్ చరణ్, శంకర్ సినిమా మొదలై చాలా రోజులు అయ్యింది. మధ్యలో కమల్ హాసన్ 'భారతీయుడు 2' చిత్రీకరణకు శంకర్ చెన్నై వెళ్ళడం, 'ఆర్ఆర్ఆర్'కు విదేశాల్లో అవార్డులు రావడంతో రామ్ చరణ్ అక్కడకు వెళ్ళడం వల్ల బ్రేకులు పడ్డాయి. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే... జూన్ నెలాఖరుకు సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయాలని ప్లాన్ చేశారట!
ఐఏఎస్ అధికారిగా... ముఖ్యమంత్రి అభ్యర్థి!
శంకర్ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా కనిపించనున్నారు. అభ్యుదయం పార్టీ సీయం క్యాండిడేట్ చరణ్. రాజమండ్రి, విశాఖలో ఆ సీన్స్ తీసినప్పుడు విజువల్స్ లీక్ అయ్యాయి. ఫ్లాష్‌బ్యాక్ కాకుండా ప్రజెంట్‌కు వస్తే... ఐఏఎస్ అధికారిగా కనిపిస్తారు. తండ్రీ కొడుకులుగా రెండు క్యారెక్టర్లు ఉంటాయని టాక్.
ఈ సినిమాలో కియారా అడ్వాణీ (Kiara Advani) ఓ కథానాయిక. మరో కథానాయికగా తెలుగమ్మాయి అంజలి నటిస్తున్నారు. ఆమె ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో చరణ్ భార్యగా కనిపించనున్నారు. శ్రీకాంత్ ముఖ్యమంత్రిగా, సునీల్, 'వెన్నెల' కిషోర్, ప్రియదర్శి, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'దిల్' రాజు, శిరీశ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు.
Also Read : వెయ్యి కోట్ల సినిమాకు అయినా సరే 'ఆమె' కావాలి - ఆడదే ఆధారం