చిత్రీకరణ సమయంలో చరణ్‌కు కంటికి గాయమై సర్జరీ జరిగినప్పటికీ, పట్టుదలతో సినిమా పూర్తి చేశాడని చిరంజీవి తెలిపారు. ఈ విషయాన్ని తన భార్య సురేఖకు కూడా చెప్పలేదని అన్నారు.
New Age Megastar: ఇప్పుడు రామ్ చరణ్ 'న్యూ ఏజ్ మెగాస్టార్'... ప్రధాని ఇచ్చిన ట్యాగ్, అనౌన్స్ చేసిన చిరంజీవి
Chiranjeevi On Ram Charan: చిరంజీవికి ప్రేమతో ఫ్యాన్స్ ఇచ్చిన ట్యాగ్ మెగాస్టార్. అయితే... తనయుడు రామ్ చరణ్‌ను 'న్యూ ఏజ్ మెగాస్టార్' అన్నారు చిరంజీవి. అదీ 'పెద్ది' సక్సెస్ మీట్‌లో!

- తానూ నటుడిగా కొనసాగుతానని చిరంజీవి స్పష్టం చేశారు.
తెలుగు చిత్రసీమలో చిరంజీవి ప్రయాణం ప్రత్యేకం. అగ్ర హీరోల వారసుల మధ్య తనకంటూ పేరు, గుర్తింపు తెచ్చుకున్నారు. నాలుగు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ప్రేక్షకులు, అభిమానులు ప్రేమతో ఆయనకు ఇచ్చిన ట్యాగ్... మెగాస్టార్. అయితే... తనయుడు రామ్ చరణ్ (Ram Charan)కు ఆ ట్యాగ్ ఇచ్చారు చిరంజీవి. అదీ 'పెద్ది' సక్సెస్ మీట్ (Peddi Success Meet)లో.
న్యూ ఏజ్ మెగాస్టార్... ప్రధాని మోడీ నోటి నుంచి!
'పెద్ది'కి ప్రేక్షకుల ఆదరణతో పాటు భారీ వసూళ్ళు వచ్చాయి. ఈ ఘన విజయాన్ని పురస్కరించుకుని మంగళవారం రాత్రి హైదరాబాద్ సిటీలో సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. అందులో రామ్ చరణ్ నటనపై చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించారు. అంతే కాదు... చరణ్‌ను 'న్యూ ఏజ్ మెగాస్టార్'గా ఆయన అనౌన్స్ చేయడం విశేషం.
ఢిల్లీలో జరిగిన 'రిపబ్లిక్ కాంక్లేవ్'లో రామ్ చరణ్ పాల్గొన్నారు. అక్కడ థియేటర్లలో పాప్ కార్న్ రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పారు. అంతే కాదు... నెట్‌ఫ్లిక్స్ వల్ల 'ఆర్ఆర్ఆర్' విదేశీ ప్రేక్షకులకు చేరువైందని, తమకు లాభం జరిగిందని చెప్పారు. ఆ కాంక్లేవ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ సైతం పాల్గొన్నారు. అక్కడ చరణ్‌ను 'న్యూ ఏజ్ మెగాస్టార్' అని ఆయన సంబోధించారు. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ... ఆ బిరుదును తాను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నానని చిరంజీవి తెలిపారు. తన వారసత్వాన్ని తనయుడు తదుపరి స్థాయికి తీసుకు వెళ్తుండటం తనకు ఎంతో సంతృప్తిని ఇస్తోందన్నారు. అలాగే, 'పెద్ది'లో నటన చూసి ప్రేక్షకులు 'చరణ్ జీవి' అనడం కూడా తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.
"ఇప్పుడు నేను వెనుక సీటులో కూర్చుని, చరణ్‌ను ముందుండి నడిపిస్తూ ఆ ఆటను చూసి ఆస్వాదించాల్సిన సమయం వచ్చింది" అన్నారు చిరంజీవి. ఆ వెంటనే... తన మాటలకు అర్థం తాను నటించడం మానేస్తానని, సినిమాలు ఆపేస్తానని కాదని, నటుడిగా తన ప్రయాణం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికీ అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ అంటే ఉదయం నాలుగు గంటలకు నిద్రలేచి వెళతానని, జిమ్‌లో చరణ్‌తో పోటీ పడతానని చెప్పారు.
'పెద్ది' సక్సెస్ మీట్‌లో తండ్రీ కొడుకుల మధ్య సంభాషణలు మెగా అభిమానులను, ప్రేక్షకులను అలరించాయి. ఇద్దరి మధ్య ప్రేమ వాళ్ళ మాటల్లో వ్యక్తం అయ్యింది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో చరణ్‌కు కంటికి గాయమై కనురెప్పకు సర్జరీ జరిగినప్పటికీ... పట్టుదలతో సినిమాను పూర్తి చేసి చేశాడని, అప్పుడు తన భార్య సురేఖకు గాయమైన విషయాన్ని చెప్పలేదని తెలిపారు చిరంజీవి.
Also Read Tamil Nadu Power Cuts - తమిళనాడులో కరెంట్ కోతలపై యంగ్ హీరో సెటైర్లు... రచ్చ రచ్చే
Before You Go
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Frequently Asked Questions
'పెద్ది' చిత్రీకరణ సమయంలో రామ్ చరణ్ పట్టుదల గురించి చిరంజీవి ఏమి చెప్పారు?
ట్రెండింగ్ వార్తలు






















