అన్వేషించండి

Tamil Nadu Power Cuts: తమిళనాడు కరెంట్ కోతలపై విజయ్‌కు సపోర్ట్... పాత పార్టీలపై యంగ్ హీరో సెటైర్లు

Master Mahendran On CM Joseph Vijay: తమిళనాడులో పవర్ కట్స్ అంశంపై రాజకీయ విమర్శల పర్వం మొదలైంది. ఈ అంశంలో సీఎం జోసెఫ్ విజయ్‌కు యంగ్ హీరో సపోర్ట్ ఇచ్చారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తమిళనాడులో సీఎం విజయ్ పాలనపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి.
  • కరెంట్ కోతలు, మహిళలపై నేరాలకు ముఖ్యమంత్రిని నిందించాయి.
  • నటుడు మహేంద్రన్ కొత్త ముఖ్యమంత్రికి కొంత సమయం ఇవ్వాలన్నారు.

తమిళనాడులో రాజకీయం రోజు రోజుకూ వేడెక్కుతోంది. పార్టీ స్థాపించి ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన ఘనత సొంతం చేసుకున్నారు దళపతి జోసెఫ్ విజయ్. దాంతో ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే, అలాగే అన్నా డీఎంకే పార్టీలు ప్రతిపక్షంలో కూర్చుకున్నాయి. జోసెఫ్ విజయ్ (CM Joseph Vijay) ముఖ్యమంత్రి అయ్యాక ఆయనపై ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. అందులో కరెంట్ కోతలు (Tamil Nadu Power Cuts) ఒకటి. ఆ అంశంలో సీఎంకు మద్దతుగా నిలిచారు ఓ యువ నటుడు.

అధికారంలోకి వచ్చి 35 రోజులే...
అప్పుడే విమర్శలు ఏంటి? తప్పు ఎవరిది?
తమిళనాడులో కరెంట్ కోతలతో పాటు మహిళలపై నేరాలు పెరిగాయని, అందుకు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ బాధ్యత వహించాలని ఉదయనిధి స్టాలిన్ విమర్శలు గుప్పించారు. ఈ అంశంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇందులో ఓ యువ కథానాయకుడు ఎంటరయ్యాడు. 

మోహన్ బాబు 'పెదరాయుడు', రజనీకాంత్ 'ముత్తు', వెంకటేష్ 'దేవి' సహా ఎన్టీఆర్ 'సింహాద్రి' వరకు పలు సినిమాల్లో బాల నటుడిగా మెప్పించారు మాస్టర్ మహేంద్రన్. ఇప్పుడు ఆయన హీరో అయ్యారు. 'వసుదేవ సుతం'తో జూలై 10న థియేటర్లలో సందడి చేయనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ట్రైలర్ విడుదల చేశారు. ఆ కార్యక్రమంలో తమిళ పాడ్‌ కాస్ట్‌ ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అయిన విషయాన్ని గుర్తు చేశారు ఓ జర్నలిస్ట్.

Also ReadVijay Trisha Breakup - విజయ్‌తో త్రిష బ్రేకప్... ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసిందా? అందులో నిజమెంత?

చెన్నైలో (తమిళనాడులో) కరెంట్ కోతల గురించి మీ మాటలు వైరల్ అయ్యాయి. అసలు ఏంటి విషయం? అని అడగ్గా... ''ప్రజల కష్టం గురించి నేను మాట్లాడాను. సరే... మహేంద్రన్ మాట్లాడాడు కదా! కొంచెం వాడదామని నన్ను వాడుకున్నారు. 75 ఏళ్ళుగా తమిళనాడును రెండు పార్టీలు పాలించాయి. విజయ్ గారి సీఎం అయ్యి 35 రోజులే అయ్యింది. 75 ఏళ్ళుగా పాలించిన వాళ్ళను ప్రశ్నించడం మానేసి, వాళ్ళను వదిలేసి... సీఎంగా 35 రోజులు నుంచి ఉన్న వ్యక్తిని ఎందుకు 'పవర్ పోయింది?' అని ప్రశ్నిస్తున్నారు. ఆయన ఎలా సమాధానం చెబుతారు. పెళ్ళి అయిన మర్నాడు పిల్లలు పుడతారా? తొమ్మిది నెలలు సమయం కావాలి కదా. ఇదీ అంతే... విజయ్ గారికి కొంత టైమ్ ఇవ్వండి'' అని మాస్టర్ మహేంద్రన్ చెప్పారు. ప్రజలకు ప్రశ్నించే హక్కు ఉందని, అయితే కొత్త ముఖ్యమంత్రికి కొంత సమయం ఇవ్వాలని ఆయన చెబుతున్నారు.

Also ReadChiranjeevi On Samantha Pregnancy - సమంత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన చిరంజీవి... మా ఇంటి బంగారానికి మెగా రివ్యూ

అసలు మహేంద్ర ఏమన్నారు? ఇష్యూ ఏమిటి?
చెన్నైలో కరెంట్ కోతలపై ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో మహేంద్రన్ మాట్లాడుతూ... ''ప్రతి అంశాన్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు? మైక్రో ఫోన్స్ ముందు మాట్లాడటం వల్ల పరిష్కారం లభించదు. మీరు చాలా రోజుల నుంచి పవర్ ఇష్యూలు లేకుండా జీవితాన్ని ఎంజాయ్ చేశారు కదా! ఒక్క ఆరు నెలలు వెయిట్ చేయలేరా?'' అన్నారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో తనకు ఎటువంటి పొలిటికల్ ఎజెండా లేదని ఆయన చెప్పారు. 

Also ReadRam Charan - మల్టీప్లెక్స్‌లకు రామ్ చరణ్ షాక్... థియేటర్లలో పాప్‌కార్న్ రేట్లపై సంచలన వ్యాఖ్యలు

Frequently Asked Questions

తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? ఆయన ఎలా అధికారంలోకి వచ్చారు?

దళపతి జోసెఫ్ విజయ్ తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి. పార్టీ స్థాపించి, ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.

సీఎం జోసెఫ్ విజయ్ ప్రభుత్వంపై ప్రధాన విమర్శలు ఏమిటి?

ఆయన ప్రభుత్వంపై కరెంట్ కోతలు, మహిళలపై నేరాలు పెరిగాయని ప్రధానంగా విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాలపై మాటల యుద్ధం చేస్తున్నాయి.

కరెంట్ కోతల విషయంలో సీఎం విజయ్‌కు మద్దతుగా ఎవరు నిలిచారు? ఆయన వాదన ఏమిటి?

యువ నటుడు మాస్టర్ మహేంద్రన్ సీఎం విజయ్‌కు మద్దతుగా నిలిచారు. విజయ్ అధికారంలోకి వచ్చి 35 రోజులే అయ్యిందని, సమస్యల పరిష్కారానికి కొంత సమయం ఇవ్వాలని ఆయన వాదించారు.

కరెంట్ కోతలపై మాస్టర్ మహేంద్రన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఏమిటి?

మైక్రోఫోన్ల ముందు మాట్లాడటం వల్ల పరిష్కారం లభించదని, గతంలో పవర్ సమస్యలు లేకుండా జీవితాన్ని ఆనందించారు కాబట్టి ఆరు నెలలు ఆగలేరా అని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
Embed widget