అన్వేషించండి

Ram Charan: మల్టీప్లెక్స్‌లకు రామ్ చరణ్ షాక్... థియేటర్లలో పాప్‌కార్న్ రేట్లపై సంచలన వ్యాఖ్యలు

Ram Charan On Popcorn Rates: రిపబ్లిక్ టీవీ నిర్వహించిన కాన్‌క్లేవ్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యారు. పాప్ కార్న్ రేట్లపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 'పెద్ది' తర్వాత రామ్ చరణ్ జాతీయ సమ్మిట్‌లో పాల్గొన్నారు.
  • మల్టీప్లెక్స్‌లలో అధిక పాప్‌కార్న్ ధరలపై ఆయన వ్యాఖ్యలు చేశారు.
  • ఈ ధరలు ప్రేక్షకులను థియేటర్‌లకు దూరం చేస్తున్నాయని చరణ్ అన్నారు.
  • ప్రేక్షకులు చరణ్ వ్యాఖ్యలు స్వాగతించారు, థియేటర్లలో మార్పు ఆశిస్తున్నారు.

'పెద్ది'లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటనకు ప్రశంసలు లభించాయి. అయితే... బాక్సాఫీస్ బరిలో ఆశించిన స్థాయిలో సినిమాకు కలెక్షన్లు రాలేదని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ, తెలుగులో వసూళ్ళ సునామీ సృష్టించింది. 'పెద్ది' సినిమా విడుదల తర్వాత తొలిసారి జాతీయ వేదికపై రామ్ చరణ్ కనిపించారు. రిపబ్లిక్ టీవీ నిర్వహించిన సమ్మిట్ 2026'లో ఆయన పాల్గొన్నారు. అందులో పాప్ కార్న్ రేట్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

రామ్ చరణ్ కామెంట్... మల్టీప్లెక్స్‌లకు షాక్! 
ఇండియాలో ఇప్పటికీ చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమా అన్నారు రామ్ చరణ్. ఇంకా ఆయన మాట్లాడుతూ... "మన దేశంలో నేటికీ సామాన్య మానవుడికి అందుబాటులో ఉన్న అతి చౌకైన వినోద సాధనం సినిమా మాత్రమే. కుటుంబంతో కలిసి అందరూ థియేటర్‌కు వెళ్లి... వెండితెరపై సినిమా చూస్తూ ఎక్స్‌పీరియన్స్‌ చేయడం అనేది ఓ కమ్యూనిటీ యాక్టివిటీ. సినిమా చూడటం కేవలం కాలక్షేపం మాత్రమే కాదు... మన కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలకు వేదికగా నిలుస్తుంది'' అని చెప్పారు.

'గ్రేట్ పవర్ ఇండియా: నేషన్ ఫస్ట్' ఇతివృత్తంతో నిర్వహించిన ఈ సమ్మిట్‌లో రామ్ చరణ్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఇండియాలో సినిమా, ప్రేక్షకుల అనుబంధం గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రస్తుతం సినిమా విషయంలో ఒక్కరి నుంచి వినబడుతున్న ప్రధాన విమర్శ, సమస్య - టికెట్ రేట్లు. టికెట్స్ కంటే ముఖ్యంగా పాప్ కార్న్ రేట్లు. ఆ అంశంలో నిర్మొహమాటంగా, ధైర్యంగా తన అభిప్రాయాలను - అలాగే ప్రేక్షకులు ఎదుర్కొంటున్న ఇబ్బందిని ప్రస్తావించారు.

Also Read: Maa Inti Bangaram Day 4 Collections - 50 కోట్ల క్లబ్బులోకి సమంత బంగారం... నాలుగు రోజుల కలెక్షన్స్ ఎంత? ఎన్ని కోట్లు వచ్చాయంటే?

''థియేటర్లలో పాప్‌ కార్న్ రేట్లు కొంచెం తగ్గితే... ప్రేక్షకులకు సినిమా ఎక్స్‌పీరియన్స్ మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. థియేటర్లలో పాప్ కార్న్, కూల్ డ్రింక్ రేట్స్ విపరీతంగా పెరగడంపై మెజారిటీ ప్రేక్షకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ రేట్స్ వల్ల కొంత మంది ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఆలోచిస్తున్నారు. వెనుకంజ వేస్తున్నారు'' అని రామ్ చరణ్ అభిప్రాయపడ్డారు. ఆయన వ్యాఖ్యలు మల్టీప్లెక్స్‌లకు షాక్ అని చెప్పాలి. పీవీఆర్, ఐనాక్స్ వంటి మల్టీప్లెక్స్‌లో రేట్స్ మీద ఎప్పట్నుంచో ప్రేక్షకులలో వ్యతిరేకత ఉంది. ఇప్పుడు రామ్ చరణ్ వ్యాఖ్యలకు అటువంటి మల్టీప్లెక్స్ ఫ్రాంచైజీలకు షాక్ అని చెప్పాలి.

Also Read: Samantha Meets Chiranjeevi: సమంతకు మెగా అభినందనలు... చిరంజీవిని కలిసిన సామ్ & రాజ్... స్పెషల్ మూమెంట్ ఫోటోలు

సాధారణ ప్రేక్షకులు ఎదుర్కొంటున్న సమస్యను జాతీయ వేదికపై రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో ప్రస్తావించడం నిజంగా అభినందనీయమని పలువురు ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నారు. ఆల్రెడీ వస్తున్న వ్యతిరేకత, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో థియేటర్ల యాజమాన్యాల్లో మార్పు వస్తుందో లేదో చూడాలి. 

Also Read: Nandamuri Balakrishna - అమ్మ క్యాన్సర్ బాధ నుంచే బసవతారకం ఆసుపత్రి ఆలోచన.. నందమూరి బాలకృష్ణ భావోద్వేగం

Frequently Asked Questions

రామ్ చరణ్ ఇటీవల ఏ వేదికపై పాల్గొన్నారు?

'పెద్ది' సినిమా విడుదలైన తర్వాత రామ్ చరణ్ తొలిసారి జాతీయ వేదికపై కనిపించారు. రిపబ్లిక్ టీవీ నిర్వహించిన 'సమ్మిట్ 2026'లో ఆయన పాల్గొన్నారు.

థియేటర్లలో ఏ విషయంపై రామ్ చరణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు?

థియేటర్లలో పాప్ కార్న్, కూల్ డ్రింక్ రేట్లపై రామ్ చరణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అధిక ధరల వల్ల ప్రేక్షకులు సినిమా చూడటానికి వెనుకంజ వేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

మన దేశంలో సినిమా గురించి రామ్ చరణ్ ఏమని అభిప్రాయపడ్డారు?

సినిమా ఇప్పటికీ భారతదేశంలో సామాన్య మానవుడికి అందుబాటులో ఉన్న అతి చౌకైన వినోదం అని రామ్ చరణ్ అన్నారు. ఇది కుటుంబ బంధాలను బలోపేతం చేసే సామూహిక అనుభవం అని ఆయన పేర్కొన్నారు.

రామ్ చరణ్ వ్యాఖ్యలు మల్టీప్లెక్స్‌లకు ఎలాంటి ప్రభావం చూపాయి?

రామ్ చరణ్ వ్యాఖ్యలు మల్టీప్లెక్స్‌లకు షాక్ అని చెప్పాలి. పీవీఆర్, ఐనాక్స్ వంటి మల్టీప్లెక్స్‌లలో అధిక రేట్లపై ప్రేక్షకులలో ఉన్న వ్యతిరేకతను ఆయన ప్రస్తావించారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Balakrishna Koratala Siva Movie: కొరటాలతో బాలకృష్ణ సినిమా ఆగిందా? యూనిట్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే?
కొరటాలతో బాలకృష్ణ సినిమా ఆగిందా? యూనిట్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే?
Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Embed widget