అన్వేషించండి

Ram Charan: నేరుగా హాలీవుడ్‌కే - అభిమానులకు రామ్ చరణ్ గుడ్ న్యూస్!

ఆస్కార్ అవార్డుల వేడుకలో పాల్గొనేందుకు గాను అమెరికాలో ఉన్న రామ్ చరణ్ తాజాగా ప్రముఖ టాక్ ఈజీ టాక్ షో లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా హాలీవుడ్ ఎంట్రీ గురించి ఆసక్తికర ప్రకటన చేయడం జరిగింది.

ఆస్కార్‌ అవార్డు వేడుకల్లో పాల్గొనేందుకు ప్రస్తుతం రామ్ చరణ్ అమెరికాలో ఉన్న విషయం తెల్సిందే. ‘ఆర్‌ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్ లో భాగంగా అక్కడ అనేక షోల్లో చరణ్‌ పాల్గొంటున్నారు. తాజాగా రామ్ చరణ్‌ 'టాక్‌ ఈజీ' అనే ప్రముఖ టాక్ షో లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా రామ్‌ చరణ్‌ ‘ఆర్ఆర్‌ఆర్‌’ షూటింగ్ అనుభవాలు మొదలుకుని.. తన హాలీవుడ్‌ ఎంట్రీ వరకు పలు విషయాలను గురించి మాట్లాడారు.
 
‘‘నాటు నాటు’’ పాటకు ఆస్కార్‌ అవార్డ్‌ నామినేషన్స్ దక్కడంపై సంతోషాన్ని వ్యక్తం చేసిన రామ్‌ చరణ్‌ త్వరలోనే హాలీవుడ్‌ సినిమా ప్రకటన ఉంటుందని కూడా ప్రకటించడం గమనార్హం. కొన్ని నెలల్లో తన హాలీవుడ్‌ ఎంట్రీ ప్రకటన చేయబోతున్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. 
 
రామ్ చరణ్‌ 'టాక్‌ ఈజీ' షో లో మాట్లాడుతూ.. ‘‘రాజమౌళి ఏది చేసినా ప్రత్యేకమే. ఆయన సినిమాలన్నీ కూడా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తాయి. ‘ఆర్ఆర్‌ఆర్’ సినిమాలో తారక్‌ తో కలిసి నటించడం కిక్ ఇచ్చింది. ఇద్దరు హీరోలే కాకుండా పది మంది హీరోలు కలిసి ఒక సినిమాలో నటించినా కూడా ప్రతి ఒక్క హీరోకు కూడా తగిన గుర్తింపు ఇవ్వగల సమర్థుడు రాజమౌళి. ఆయన స్క్రిప్ట్‌ మేము ఇద్దరం కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకునేలా చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చిత్రీకరణ చాలా సరదాగా సాగింది. ఈ సినిమాలోని రామరాజు పాత్ర వ్యక్తిగతంగా నాకు చాలా దగ్గరగా ఉంటుంది. లాక్ డౌన్ సమయంలో కూడా విశ్రాంతి తీసుకోకుండా వర్చువల్‌ క్లాస్ లకు తారక్ నేను హాజరయ్యాం’’ అని తెలిపారు.  

‘‘నాటు నాటు’’ కోసం చాలా కష్టపడ్డాం

‘‘నాటు పాటు’’ పాట గురించి రామ్ చరణ్‌ ఆ షో లో మాట్లాడుతూ.. ఈ పాటను ఉక్రెయిన్‌ లో చిత్రీకరించబోతున్నాం అనగానే సర్ ప్రైజ్ అయ్యాం. అక్కడ షూట్ చేయగలమని మొదట అనుకోలేదు. కానీ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ అధ్యక్ష భవనంలో చిత్రీకరణకు అనుమతి ఇవ్వడం గొప్ప విషయం. ఆ పాటకు డాన్స్‌ చేయడానికి తారక్ నేను చాలా కష్టపడ్డాం. కొన్ని షాట్స్ కోసం టేక్ ల మీద టేక్ లు తీసుకున్నాం. ఆ సమయంలో మేము పడ్డ కష్టం కారణంగానే ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. ఉక్రెయిన్ లో చిత్రీకరణ చేస్తున్న సమయంలో అక్కడి ప్రజలను దగ్గర నుంచి చూశాం. వారు చాలా మంచి వారు.. అక్కడి ఫుడ్ ను ఎంజాయ్ చేశాం. ‘‘నాటు నాటు’’ పాట చిత్రీకరణ పూర్తి అయిన మూడు నెలలకే ఉక్రెయిన్‌ పై రష్యా యుద్దం మొదలు పెట్టడం బాధకరం అన్నారు. 
 
 
హాలీవుడ్‌ సినిమాలు ‘గ్లాడియేటర్‌’, ‘టర్మినేటర్‌’, ‘బ్రేక్‌ హార్ట్‌’ సినిమాలు నాకు చాలా ఇష్టం. ఒక నటుడిగా నేను అన్ని దేశాల సినిమాల్లో నటించాలని కోరుకుంటాను. ప్రస్తుతానికి హాలీవుడ్ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే హాలీవుడ్ లో నా సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుంది. జులియా రాబర్ట్స్ తో కలిసి ఒక్క చిన్న సన్నివేశంలో అయినా నటించాలని కోరుకుంటున్నాను అంటూ ఆమెపై అభిమానంను రామ్‌ చరణ్ కనబర్చారు. 

టాప్ హెడ్ లైన్స్

Idupu Kayitham Ullipoola Song : ఉల్లిపూల సీరే గట్టి... ఉత్తరాది సెరువే దాటి - ఇడుపు కాయితం తెలంగాణ క్యూట్ సాంగ్ లిరిక్స్
ఉల్లిపూల సీరే గట్టి... ఉత్తరాది సెరువే దాటి - ఇడుపు కాయితం తెలంగాణ క్యూట్ సాంగ్ లిరిక్స్
Arjun Sarja : ఆపరేషన్ సింధూర్ బ్యాక్ డ్రాప్‌లో సినిమా - అర్జున్ పాన్ ఇండియా హిస్టారికల్ ప్రాజెక్ట్
ఆపరేషన్ సింధూర్ బ్యాక్ డ్రాప్‌లో సినిమా - అర్జున్ పాన్ ఇండియా హిస్టారికల్ ప్రాజెక్ట్
Ram Charan Sukumar : చరణ్ మూవీలో హీరోయిన్ సాత్వికనేనా? - ఆడిషన్ ఇచ్చింది ఏ భారీ ప్రాజెక్ట్ కోసం!
చరణ్ మూవీలో హీరోయిన్ సాత్వికనేనా? - ఆడిషన్ ఇచ్చింది ఏ భారీ ప్రాజెక్ట్ కోసం!
Anil Ravipudi Ramayana : మైథలాజికల్ జానర్‌లో అనిల్ రావిపూడి మూవీ - డ్రీమ్ ప్రాజెక్టు‌పై స్టార్ డైరెక్టర్ రియాక్షన్
మైథలాజికల్ జానర్‌లో అనిల్ రావిపూడి మూవీ - డ్రీమ్ ప్రాజెక్టు‌పై స్టార్ డైరెక్టర్ రియాక్షన్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thiruparankundram Deepam: తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
PM Modi: మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై ప్రధాని మోదీ
మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై PM Modi
విశాఖ కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థులకు గాయాలు - ఘటనపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆరా
విశాఖ కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థులకు గాయాలు - ఘటనపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆరా
MP Seats In AP and Telangana: గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
Adilabad News: జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
Rohit Sharma - Pollard Combo: కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
Delimitation Bill 2026: డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
Embed widget