అన్వేషించండి

Ram Charan : మహిళలే బలం... డబుల్ హ్యాపీ నెస్ - కవలలు జన్మించిన తర్వాత రామ్ చరణ్ ఫస్ట్ రియాక్షన్

Ram Charan Reaction : మెగా ఫ్యామిలీలో ఆనందం డబుల్ అయ్యింది. తన భార్య ఉపాసనకు కవలలు జన్మించిన తర్వాత చరణ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

Ram Charan First Reaction After Twins Birth : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు కవలలకు జన్మనిచ్చిన నేపథ్యంలో మెగా ఫ్యామిలీలో సంబరాలు మొదలయ్యాయి. తాజాగా చరణ్ దీనిపై డబుల్ ఆనందం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. 'మాకు ఒక బాబు, పాప పుట్టారని చెప్పడానికి సంతోషంగా ఉంది.

ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు కలిగి ఉండడం ఎంతో కృతజ్ఞతగా భావిస్తున్నాం. మా జీవితంలో మహిళలే మాకు గొప్ప బలం. ప్రతీ క్షణం మాకు అండగా నిలిచిన కుటుంబ, సపోర్ట్ చేసిన మా అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ థాంక్స్' అంటూ రాసుకొచ్చారు. తన భార్య ఉపాసనతో దిగిన స్పెషల్ ఫోటోను షేర్ చేశారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ram Charan (@alwaysramcharan)

Also Read : రేపే విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి? - రాజస్థాన్ ప్యాలెస్ వీడియో వైరల్... ఆ వార్తల్లో నిజమెంత?

శనివారం రాత్రి మెగా కోడలు ఉపాసన పండంటి కవలలకు జన్మించారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకున్నారు. ఆదివారం ఉదయం ప్రెస్ మీట్‌లో ఆనందం వ్యక్తం చేస్తూ... తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని... ముందు బాబు, తర్వాత పాప పుట్టారని తెలిపారు. తమ మంచి కాంక్షించే మెగా అభిమానులకు థాంక్స్ చెప్పారు. అటు ఆస్పత్రి వద్దకు మెగా ఫ్యాన్స్ భారీగా చేరుకుని వారుసుడు వచ్చాడంటూ నినాదాలు చేశారు. 

అభిమానుల అత్యుత్సాహం

ఈ సందర్భంగా రామ్ చరణ్ అపోలో ఆస్పత్రి వద్దకు తన రెండేళ్ల చిన్నారి క్లీంకారతో చేరుకున్నారు. ఈ క్రమంలో అభిమానులు ఆయన్ను చుట్టుముట్టారు. ప్రైవేట్ సెక్యూరిటీతో భారీ భద్రతా ఏర్పాట్లు చేసినా అభిమానుల అత్యుత్సాహంతో చరణ్ కాస్త ఇబ్బంది పడ్డారు. క్లీంకారను ఫోటోలు తీసేందుకు ఎగబడ్డారు. ఓ దశలో ఆయన ఫ్యాన్స్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చివరకు సెక్యూరిటీ అతి కష్టం మీద ఆయన్ను ఆస్పత్రి లోపలికి పంపించారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. 

మెగా కోడలు ట్వీట్

రామ్ చరణ్ దంపతులకు మెగా కోడలు లావణ్య త్రిపాఠి విషెష్ తెలిపారు. ట్విన్స్‌కు జన్మనిచ్చిన ఉపాసనకు కంగ్రాట్స్ చెప్పారు. 'హాయ్ చిట్టి కవలలు. ఈ ప్రపంచానికి మీకు స్వాగతం. అందరూ మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. క్లీంకార ఇప్పుడు అక్కగా ప్రమోషన్ పొందింది. మీ చిన్న కజిన్ వాయువ్‌తో కలిసి పెరిగేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.' అంటూ పోస్ట్ చేశారు. ఇది వైరల్ అవుతోంది.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
Jo Jo Movie: దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
Husharu Pittalu Review - 'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget