Rashmika Vijay Deverakonda : రేపే విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి? - రాజస్థాన్ ప్యాలెస్ వీడియో వైరల్... ఆ వార్తల్లో నిజమెంత?
Rashmika Vijay Deverakonda Wedding : విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి టాపిక్ మళ్లీ హైలెట్ అవుతోంది. ఉదయపూర్ ప్యాలెస్‌లో భారీ డెకరేషన్ వీడియో వైరల్ అవుతుండగా ఇది వారి పెళ్లే అంటూ ప్రచారం సాగుతోంది.

Vijay Deverakonda Rashmika Wedding Plan : నేషనల్ క్రష్ రష్మిక, విజయ్ దేవరకొండల పెళ్లి వార్తలు గత కొంత కాలంగా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. గతేడాది అక్టోబరులో వీరిద్దరూ రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారంటూ బయటకు వచ్చినా అది ఎక్కడా కన్ఫర్మ్ చేయలేదు. వీరిద్దరి పెళ్లి సోమవారం జరగబోతోందంటూ నెట్టింట ఓ వీడియో వైరల్ అవుతోంది.
ఉదయపూర్ ప్యాలెస్‌లో...
రాజస్థాన్‌లోని ఉదయపూర్ ప్యాలెస్‌ను భారీ స్థాయిలో డెకరేట్ చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఇద్దరమ్మాయిలు ప్యాలెస్‌ను భారీగా డెకరేట్ చేస్తున్నారంటూ చూపించారు. 'చూస్తుంటే ఇక్కడ ఏదో పెళ్లి వేడుక జరగబోతున్నట్లుంది. విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి జరగబోతున్నట్లుంది.' అంటూ చెప్పారు. ప్యాలెస్ వద్ద కళ్లు మిరిమిట్లు గొలిపే అలంకరణలు, భారీ వేదికలు ఆకట్టుకుంటున్నాయి.
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా... ఇది నిజమేనా అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు వారి పెళ్లికి ముందస్తు విషెష్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. అయితే, ఈ వార్తల్లో నిజం లేదని రష్మిక టీం క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
tea ☕️ on RASHMIKA MANDANA & VIJAY DEVEKONDA
— vedika (@vedikabaisa) January 31, 2026
they are getting married on 2nd Feb in UDAIPUR pic.twitter.com/sAZFLiVjQf
View this post on Instagram
Also Read : మెగా ఫ్యామిలీలో డబుల్ ఆనందం - ఉపాసనకు డెలివరీ చేసిన డాక్టర్స్ వీళ్లే
గతేడాది అక్టోబర్ 3న హైదరాబాద్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో విజయ్, రష్మికల ఎంగేజ్మెంట్ జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పటివరకూ దీనిపై అటు రష్మిక కానీ ఇటు విజయ్ దేవరకొండ కానీ రియాక్ట్ కాలేదు. రీసెంట్ మూవీస్ ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో రష్మికకు ఈ ప్రశ్న ఎదురైతే సరైన టైంలో అన్నీ రివీల్ చేస్తామంటూ చెప్పారు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ, రష్మికల వేలికి రింగ్స్ ఫోటోలు సైతం వైరల్ అయ్యాయి. దీంతో ఇద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగినట్లు సోషల్ మీడియాలో కన్ఫర్మ్ అయిపోయింది.
ఆ తర్వాత రష్మిక సైతం ఓసారి ఉదయపూర్ ప్యాలెస్ సందర్శించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఇది పెళ్లి కోసమే ప్లాన్ అంటూ ప్రచారం సాగింది. ఫిబ్రవరి 26న వీరి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయ్యిందంటూ టాక్ వినిపించింది. తాజా వీడియోతో మళ్లీ వీరి పెళ్లి టాపిక్ ట్రెండ్ అవుతోంది.
ఆన్ స్క్రీన్ బెస్ట్ పెయిర్!
విజయ్, రష్మిక గీత గోవిందం మూవీతో ఆన్ స్క్రీన్ బెస్ట్ పెయిర్ అనిపించుకున్నారు. ఆ తర్వాత 'డియర్ కామ్రేడ్' చేశారు. ఆ టైంలోనే ఇద్దరూ లవ్‌లో ఉన్నారనే ప్రచారం సాగింది. ప్రస్తుతం ఇద్దరూ కలిసి 'రణబాలి' మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీకి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు.
Before You Go
Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు























