అన్వేషించండి

Narakasura Movie : 'నరకాసుర'గా 'పలాస' ఫేమ్ హీరో రక్షిత్ అట్లూరి - విడుదల ఎప్పుడంటే?

'పలాస' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న హీరో రక్షిత్ అట్లూరి. రా అండ్ రస్టిక్ సినిమా 'నరకాసుర'తో ఆయన ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

'పలాస 1978'తో తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు రక్షిత్ అట్లూరి (Rakshit Atluri). ఆ సినిమా గుర్తింపు మాత్రమే కాదు... ఆయనకు మంచి విజయాన్ని కూడా అందించింది. అంతకు ముందు 'లండన్ బాబులు' సినిమాలో కూడా ఆయన హీరోగా నటించారు. 'పలాస' తర్వాత మూడు సినిమాలకు రక్షిత్ సైన్ చేశారు. అందులో 'నరకాసుర' ఒకటి. ఇది కూడా రా అండ్ రస్టిక్ సినిమా. త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. 

సెప్టెంబర్ రెండో వారంలో...
రక్షిత్‌ అట్లూరి కథానాయకుడిగా (Rakshit Atluri Movie) సెబాస్టియన్‌ దర్శకత్వం వహించిన సినిమా 'నరకాసుర' (Narakasura Telugu Movie). ఇందులో అపర్ణా జనార్థన్‌, సంకీర్తన విపిన్‌ కథానాయికలు. 'పుష్ప'తో పాటు పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన శత్రు కీలక పాత్రధారి. సుముఖ క్రియేషన్స్‌, ఐడియల్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ సంస్థలపై తెరకెక్కింది.  డా. అజ్జా శ్రీనివాస్‌, కారుమూరు రఘు నిర్మాతలు. 

Narakasura movie release date : 'నరకాసుర' చిత్రీకరణ కొన్ని రోజుల క్రితమే పూర్తి అయ్యింది. ఇటీవల పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేశారు. త్వరలో సెన్సార్ పనులు పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ రెండో వారంలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శక, నిర్మాతలు తెలిపారు. 

''ఇటీవల మేం 'నరకాసుర' టీజర్ విడుదల చేశాం. దానికి వచ్చిన స్పందన మాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. టీజర్‌ చూసిన పలువురు సినీ ప్రముఖులు 'కాంతారా స్థాయిలో ఉంది' అని మమ్మల్ని ప్రశంసించారు. ఆ మాటలు మాకు పెద్ద బూస్ట్ ఇచ్చాయి. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. 'నరకాసుర' అనే ఓ రాక్షసుడి జననం నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఇదొక యాక్షన్‌ థ్రిల్లర్‌'' అని దర్శకుడు సెబాస్టియన్ చెప్పారు.

Also Read : వెంకటేష్ vs నాని vs నితిన్ vs సుధీర్ బాబు... క్రిస్మస్‌కు టాలీవుడ్ హీరోల పాన్ ఇండియా పోటీ
 
'నరకాసుర' కాకుండా రక్షిత్ అట్లూరి 'శశివదనే' అని మరో సినిమా చేస్తున్నారు. ఆ చిత్రంలో కోమలీ ప్రసాద్ కథానాయిక. గోదావరి నేపథ్యంలో రూపొందుతోంది. 'నరకాసుర' సినిమాలో నాజర్‌, చరణ్‌రాజ్‌, శ్రీమాన్‌, ఎస్‌ఎస్‌ కాంచీ, గాయత్రి రవి శంకర్‌, తేజ్‌ చరణ్‌రాజ్‌, కార్తిక్‌ సాహస్‌, రాజా రావు, 'ఫిష్‌' వెంకట్‌, మస్త్‌ అలీ, భాను తేజ, లక్ష్మణ్‌, రాము, దేవంగన, పింటు శర్మ, ప్రమోద్‌, చతుర్వేది తదితరులు ప్రధాన తారాగణం. 

Also Read : ప్రతి పండక్కి... ప్రతి నెలలో శ్రీ లీల సినిమా - వినాయక చవితి నుంచి సంక్రాంతి వరకు!

'నరకాసుర' చిత్రానికి సౌండ్‌ ఇజైనింగ్‌ : కృష్ణ సుబ్రమణియన్‌, పోరాటాలు : రాబిన్‌ సుబ్బు, నృత్య దర్శకత్వం : పోలకి విజయ్‌, కళా దర్శకత్వం : సుమిత్‌ పాటిల్‌, కొప్పినీడి నాగవ్‌ తేజ్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ : పూజితా తాడికొండ, ప్రొస్థెటిక్ మేకప్‌ : రషీద్‌ అహ్మద్‌, కూర్పు : సిహెచ్‌ వంశీకృష్ణ, ఛాయాగ్రహణం : నాని చామిడిశెట్టి, సంగీత దర్శకత్వం : ఎఐఎస్‌ నవ్‌ఫాల్‌ రాజా, నిర్మాతలు : డా. అజ్జా శ్రీనివాస్‌, కారుమూరు రఘు, కథ - మాటలు - కథనం - దర్వకత్వం : సెబాస్టియన్‌. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Nandyal  News:   కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య -  వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య - వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
Lookback 2024: ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువ ప్లేయర్లు - భవిష్యత్తుపై భరోసా నింపిన ఆటగాళ్లు
ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువ ప్లేయర్లు - భవిష్యత్తుపై భరోసా నింపిన ఆటగాళ్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Nandyal  News:   కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య -  వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య - వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
Lookback 2024: ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువ ప్లేయర్లు - భవిష్యత్తుపై భరోసా నింపిన ఆటగాళ్లు
ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువ ప్లేయర్లు - భవిష్యత్తుపై భరోసా నింపిన ఆటగాళ్లు
VRS For Wife: విధి అంటే ఇదేనేమో! - అనారోగ్యంతో ఉన్న భార్యను చూసుకునేందుకు వీఆర్ఎస్ తీసుకున్నాడు, ఇంతలోనే!
విధి అంటే ఇదేనేమో! - అనారోగ్యంతో ఉన్న భార్యను చూసుకునేందుకు వీఆర్ఎస్ తీసుకున్నాడు, ఇంతలోనే!
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
Embed widget