రామ్ హీరోగా బోయపాటి శ్రీను తీసిన సినిమా 'స్కంద'. ఇందులో శ్రీలీల మెయిన్ హీరోయిన్. ఈవిడ రెండో హీరోయిన్. 'స్కంద'లో సయీ మంజ్రేకర్ కీలక పాత్ర చేశారు. ఇంతకు ముందు 'మేజర్', 'గని' చిత్రాల్లో నటించారు. 'స్కంద' ట్రైలర్‌లో సయీ మంజ్రేకర్ ఈ లుక్కులో కనిపించారు. ట్రైలర్ తర్వాతే ఆమె సినిమాల్లో ఉన్నారని అర్థమైంది. సయీ మంజ్రేకర్ ఎమోషనల్ రోల్ చేశారని రక్తం కారుతున్న ఈ కళ్ళు చూస్తే... ఈజీగా అర్థం అవుతోంది. విలన్స్ చేతిలో సయీ మంజ్రేకర్ తన్నులు తినే సీన్లు 'స్కంద'లో ఉన్నాయని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ తెలుసుగా! సయీ మంజ్రేకర్ ఎవరో కాదు... ఆయన కుమార్తె! సల్మాన్ ఖాన్ 'దబాంగ్ 3' సినిమాతో హీరోయిన్ గా సయీ మంజ్రేకర్ కెరీర్ మొదలైంది. 'దబాంగ్ 3' తర్వాత సయీ మంజ్రేకర్ తెలుగు సినిమాలు చేయడం స్టార్ట్ చేశారు. సయీ మంజ్రేకర్ (all images courtesy : saieemmanjrekar instagram, junglee music telugu youtube)