అన్వేషించండి

Rakesh Varre: 'బాహుబలి' to 'జితేందర్ రెడ్డి'.... పాన్ ఇండియా సక్సెస్ to రాకేష్ వర్రే కంటెంట్ రిచ్ జర్నీ

Jithender Reddy Movie: టాలీవుడ్ యంగ్ స్టార్ రాకేష్ వర్రే హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'జితేందర్ రెడ్డి' నవంబర్ 8న రిలీజ్ కానుంది. నవంబర్ 7న పెయిడ్ ప్రీమియర్లు వేస్తున్నారు. ఆయన జర్నీ చూస్తే...

'జితేందర్ రెడ్డి' సినిమాలో రాకేష్ వర్రే హీరోగా నటించగా... విరించి వర్మ డైరెక్షన్ చేశారు. ఇంతకు ముందు 'ఉయ్యాల జంపాల' అనే ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో పాటు నాని హీరోగా నటించిన 'మజ్ను' మూవీకి కూడా విరించి వర్మ దర్శకత్వం వహించారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న 'జితేందర్ రెడ్డి' సినిమాపై టాలీవుడ్ లో మంచి బజ్ క్రియేట్ అయింది. 1980లో కాలంలో జగిత్యాల చుట్టు పక్కల జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా, అప్పట్లో ప్రజా సమస్యలపై జితేందర్ రెడ్డి ఎలా పోరాటం చేశారు? అనే విషయాలను బేస్ చేసుకుని 'జితేందర్ రెడ్డి'ని తెరకెక్కించారు. ఈ మూవీ నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ లో "అమ్మా బలవంతుడు కదా ఆయన మీద శివాజీ ఎలా గెలిచాడు... శత్రువు బలవంతులైనప్పుడు శత్రు సైన్యం మీద కాదు వాడి ధైర్యం మీద గెలవాలి, ఒక్కడి మీద తిరగబడితే పగ ఒక వ్యవస్థ మీద తిరగబడితే ఉద్యమం" అంటూ వచ్చిన డైలాగులు బాగున్నాయి.

'జితేందర్ రెడ్డి' ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచింది. అయితే... ఈ సినిమాకు ముందు రాకేష్ వర్రే ఏం చేశారో తెలుసా? ప్రభాస్ 'మిర్చి' సినిమాలో వచ్చే ఇంట్రడక్షన్ ఫైట్ సీన్‌లో ఆయన నటించారు. అలాగే 'బాహుబలి' మూవీలో ప్రభాస్ నిండు సభలో ఒక వ్యక్తి తలను నరికేస్తాడు కదా... ఆ పాత్రను పోషించింది రాకేష్ వర్రేనే. అలా పాన్ ఇండియా సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న రాకేష్ వర్రే... ఆ తర్వాత వెంట వెంటనే సినిమాలు చేయాలని అనుకోలేదు. కంటెంట్ రిచ్ కథల కోసం, కొత్త సినిమాలను ప్రేక్షకులను అందించడం కోసం ఎదురు చూశారు.

'బాహుబలి' తర్వాత 'ఎవరికీ చెప్పొద్దు' అని ఓ సినిమాను కూడా చేశారు రాకేష్ వర్రే. ఆ సినిమాలో హీరోగా నటించడంతో పాటు ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించాడు. కులాలు, పట్టింపులు కథతో ఆ మూవీ రూపొందింది. కాస్ట్ ఫీలింగ్‌ను సున్నితంగా డిస్కస్ చేసిన సినిమా అది. ఆ తర్వాత 'పేక మేడలు' అని మరో సినిమాను నిర్మించారు. అందులో గాల్లో మేడలు కట్టే యువత తీరును కళ్లకు కట్టినట్లు చూపించడంతో పాటు మహిళలు ఎంత ధైర్యంగా ఉండాలో చెప్పారు. ఇలా కమర్షియల్ సినిమాల జోలికి వెళ్లకుండా కేవలం కంటెంట్ బేస్డ్ సినిమాలకే ప్రాధాన్యం ఇస్తూ మంచి సినిమాలు చేస్తున్న రాకేష్ వర్రే... ఈ శుక్రవారం 'జితేందర్ రెడ్డి' సినిమాతో థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. 

Read Also : Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 


టాలీవుడ్ లో ప్రస్తుతం కంటెంట్ బేస్డ్ సినిమాలకి ఆదరణ బాగా పెరిగింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో పాన్ ఇండియా ట్రెండ్ తో పాటు చాలా మార్పులు కనిపిస్తున్నాయి. భాషతో సంబంధం లేకుండా కంటెంట్ ఉంటే చాలు అనుకుంటున్నారు ఇప్పటి తరం మూవీ లవర్స్.  అంతేకాకుండా చిన్న, పెద్ద హీరో అని తేడా లేకుండా 'కటౌట్ కాదు కంటెంట్ ముఖ్యం బిగిలూ' అంటున్నారు. ఇక ప్రేక్షకులు చూపిస్తున్న ఈ ఆదరాభిమానాలతో మేకర్స్ కూడా కొత్త కంటెంట్ తో ఆకట్టుకోవడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. 

అయితే చిన్న హీరోలకు ఇదొక మంచి అవకాశం అని చెప్పాలి. సాధారణంగా స్టార్ హీరోలకు మూవీ అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు పెరిగి, ప్రెజర్ ఉంటుంది. కానీ చిన్న హీరోలకు అలాంటి టెన్షన్స్ ఏమీ ఉండవు. కాబట్టి కంటెంట్ బాగుంటే హిట్ కొట్టి తమ టాలెంట్ నిరూపించుకోవచ్చు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న చిన్న హీరోలలో సుహాస్ కూడా ఇదేవిధంగా దూసుకెళ్తున్నాడు. తాజాగా ఆ లిస్ట్ లో రాకేష్ వర్రే కూడా చేరిపోయారు.

Also Read: నాని, శ్రీకాంత్ ఓదెల రెండో సినిమాకు ఆసక్తికర టైటిల్... షూటింగ్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Embed widget