అన్వేషించండి

NaniOdela2 Title: నాని, శ్రీకాంత్ ఓదెల రెండో సినిమాకు ఆసక్తికర టైటిల్... షూటింగ్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే?

నాని, శ్రీకాంత్ ఓదెల సినిమాకు ఆసక్తికర టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఆ టైటిల్ ఏంటో తెలుసుకుందాం పదండి.

నేచురల్ స్టార్ నాని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో రెండవసారి సినిమా చేయడానికి కమిట్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చెక్కర్లు కొడుతోంది. మరి నాని కొత్త సినిమాకు మేకర్స్ అనుకుంటున్న టైటిల్ ఏంటో తెలుసుకుందాం పదండి. 

'దసరా' డైరెక్టర్ తో మరోసారి
గత ఏడాది 'దసరా' మూవీతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను నాని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత నాని 'హాయ్ నాన్న', 'సరిపోదా శనివారం' వంటి హ్యాట్రిక్ హిట్లను అందుకుని ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ప్రస్తుతం ఆయన శైలేష్ కొలను దర్శకత్వంలో 'హిట్ 3' అనే సినిమాలో నటిస్తున్నారు. గతేడాది రిలీజ్ అయిన 'హిట్ 2' మూవీకి ఇది సీక్వెల్. ఇందులో నాని పవర్ ఫుల్ కాప్ గా కనిపించబోతున్నాడు. ఆ తర్వాత నాని చేయబోయే సినిమా ఎవరితో అన్న ప్రశ్నకు రీసెంట్ గా దసరా సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పాడు నాని. ఈ ఏడాది అక్టోబర్ 13న నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో రెండో ప్రాజెక్టును దసరా పండుగ రోజు పూజా కార్యక్రమంతో మొదలు పెట్టారు. అయితే సుధాకర్ చెరుకూరి నిర్మాతగా  వ్యవహరిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ 'దసరా' మూవీకి సీక్వెల్ మాత్రం కాదు. 

నాని ఫస్ట్ 100 కోట్ల మూవీ అయిన 'దసరా' మూవీకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. తొలి సినిమాతోనే శ్రీకాంత్ ఓదెల తన ప్రతిభను చాటుకోగా మరోసారి ఇదే కాంబినేషన్లో ఇప్పుడు కొత్త సినిమా రాబోతుంది. కొన్ని నెలల క్రితమే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రీ లుక్ పోస్టర్ ఆసక్తిని రేకెత్తించింది. అలాగే దీనికి సంబంధించి ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసి సినిమాను గ్రాండ్ గా ప్రకటించడానికి ప్లాన్ చేసుకున్నారు మేకర్స్. కానీ ఆ వీడియోను రిలీజ్ చేయకుండానే సినిమా ఓపెనింగ్ జరిపారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించబోతున్నారు.

నాని, ఓదెల మూవీ టైటిల్ ఇదేనా?
ఈ నేపథ్యంలోనే నాని, శ్రీకాంత్ ఓదెలా కొత్త సినిమాకు 'ప్యారడైజ్' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు సమాచారం. కానీ దీనిపై ఇంకా అఫిషియల్ అనౌన్మెంట్ రాలేదు. హైదరాబాద్ పాతబస్తీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది మొదట్లో ప్రారంభం కానుంది. ప్రస్తుతానికి 'Nani-Odela 2' అనే వర్కింగ్ టైటిల్ తో పిలుచుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ప్రస్తుతం నాని.. శ్రీకాంత్ ఓదెలతో పాటు సుజిత్ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేయాల్సి ఉంది. నిజానికి శ్రీకాంత్ కంటే ముందే ఆయన సుజిత్ తో సినిమా చేస్తారని టాక్ నడిచింది. కానీ సుజిత్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో 'ఓజి' సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉండగా, ఇటు శ్రీకాంత్ బౌండెడ్ స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నాడు. అందుకే సుజిత్ కంటే ముందు శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్టును నాని మొదలుపెట్టారు.

Read Also : Citadel Honey Bunny: సమంత 'సిటాడెల్' వెబ్ సిరీస్‌ రన్ టైమ్ ఎంత? టోటల్ ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయ్?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget