Jithender Reddy: 'ఈ దేశం మనకేం ఇచ్చిందని కాదు, దేశానికి మనం ఏం ఇచ్చాం' - గూస్‌బంప్స్ తెప్పిస్తున్న 'జితేందర్‌రెడ్డి' ట్రైలర్
Jithender Reddy Trailer: తాజాగా రిలీజైన జితేందర్‌రెడ్డి ట్రైలర్ మూవీపై ఆసక్తి పెంచుతుంది. 1980లో జగిత్యాల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా 'జార్జీరెడ్డి' సినిమాను గుర్తు చేస్తుంది.
Jithender Reddy Movie Official Trailer Out: 'బాహుబలి' ఫేం రాకేష్ వర్రే హీరోగా 'ఉయ్యాల జంపాల' డైరెక్టర్ విరించి వర్మ దర్శకత్వం తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'జితేందర్ రెడ్డి'. ప్రజలకు అతని కథ చెప్పాలి అనేది ఉపశీర్షిక. 1980 కాలంలో జరిగిన సంఘటనలు, వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జగిత్యాలకు చెందిన జితేందర్‌రెడ్డి అనే పోరాట యోధుడి జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. మే 30న ఈ సినిమా థియేటర్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ టీం 'జితేందర్‌రెడ్డి' ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్‌లో జితేందర్‌రెడ్డి బాల్యం నుంచి అతడు నక్స్‌లైట్‌గా మారిన వరకు గల సన్నివేశాలను ఆసక్తిగా చూపించారు. చిన్నప్పటి నుంచి పేద ప్రజలకు ఏదైనా చేయాలని అనే అభ్యుదయ భావాలతో పెరిగిన అతడు పెద్దయ్యాక పేద ప్రజల కోసం ఏం చేశాడనేది ఈ సినిమా కథ అని ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది.
ట్రైలర్ విషయానికి వస్తే..
జిత్తూ పెద్దాయ్యాక ఏం అవుతావు అని అతడి తల్లిదండ్రులు అడుగే సన్నివేశంతో ట్రైలర్ మొదలవుతుంది. దీనికి జితేందర్‌రెడ్డి సమాజంలో జరిగే అన్యాయాలను చూస్తే పోలీసు కావాలి అనిపిస్తది.. ప్రాణం బాగా లేని పేదోడిని చూస్తే డాక్టర్ కావాలనిపిస్తది.. చట్టం తెలియక మోసపోతున్నవాళ్లని చూస్తే లాయర్ కావాలనిపిస్తది. అందరికి అన్ని చేసేటట్టుకు ఏదైనా చేయాలని అనిపిస్తుంది!" అనే డైలాగ్ ఆసక్తిని పెంచుతుంది. అలా పెద్దయిన జితేందర్ రెడ్డి కాలేజీ చదువుతూ పోరాట భవాలు ఉన్న వ్యక్తిగా మారతాడు. ఓ కాలేజీ ఈ దేశం మనకు ఏం ఇచ్చింది.. ఏమి ఇవ్వలేదని అంటున్న ఉపాధ్యాయుడితో 'దేశం మనకు ఏం ఇచ్చిందని కాదు సార్.. మనం దేశానికి ఏం ఇచ్చామని చెప్పండి' అని రాకేష్ వర్రే చెప్పిన డైలాగ్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.
ఆ తర్వాత ఓ వ్యక్తి ఇండియ హిందు దేశం ఎట్ల అయితది.. ఇండియా హిందు దేశం కానేకాదు అనే ఓ పాత్రతో డైలాగ్ చెప్పించారు. దీనికి జితేందర్‌రెడ్డి.. మనం హిందు దేశంలో పుట్టాం.. హిందుగా జీవిద్దాం.. హిందుగా గర్విద్దాం అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత నక్సల్స్ కాల్పులు వంటి సీన్స్ చూపించారు. ప్రజలకు కోసం అడవుల బాట పట్టిన నక్సల్స్ దేశ భక్తులు అని, వారి పోరాట స్పూర్తి గొప్పది అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది. చూస్తుంటే ఇది మొత్తం గ్రామాల్లో పెద్ద మనుషుల చేతిలో పేద ప్రజల జీవితాలు నలిగిపోతుంటే వారి కోసం నక్సల్స్ చేసే పోరాటం.. అలాంటి భావలు ఉన్న జితేందర్‌రెడ్డి నక్సల్స్‌లోకి ఎలా వెళ్లాడు వంటి కథతో ఈ సినిమా సాగనుందని ట్రైలర్ చూస్తుంటే అర్థమైపోతుంది. జితేందర్‌రెడ్డి ట్రైలర్ చూస్తుంటే ఇది మరో జార్జీరెడ్డి సినిమా అనిపిస్తుంది. మరి థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా జార్జీరెడ్డి తరహాలో ఆకట్టుకుంటుందో లేదో చూడాలి!. సుబ్బరాజు, శ్రియా శరణ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను ముదుగంటి క్రియేషన్స్ పతాకంపై ముదుగంటి రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మలయాళ సంగీత దర్శకుడు గోపీసుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
Also Read: అఫీషియల్, జపాన్‌లో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ప్రభాస్ 'సలార్' - ఎప్పుడంటే!