అన్వేషించండి

Salaar Japan Release: అఫీషియల్, జపాన్‌లో రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసుకున్న ప్రభాస్‌ 'సలార్‌' - ఎప్పుడంటే!

Salaar Release Date: ప్రభాస్‌ సలార్‌ మూవీ జపాన్‌ రిలీజ్‌ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ అక్కడ రిలీజ్‌ డేట్‌ను ఫిక్స్‌ చేసుకుంది. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

Prabhas Salaar Movie Japan Release Date Locked: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా 'సలార్‌: సీజ్‌ ఫైర్‌'. గతేడాది డిసెంబర్‌ 22న విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టింది. 'బాహుబలి' తర్వాత వరుస ప్లాప్స్‌ చూస్తున్న ప్రభాస్‌కు చాలా గ్యాప్‌ తర్వాత అతడి మార్కేట్‌ రేంజ్‌‌ హిట్‌ ఇచ్చింది ఈ మూవీ. ఈ సినిమాలో ప్రభాస్ యాక్షన్, క్యారెక్టరైజేషన్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ప్రిమియర్‌ షో నుంచి ఈ మూవీ పాజిటివ్‌ రివ్యూస్‌తో దూసుకుపోయింది. ఫైనల్‌గా థియేట్రికల్‌ రన్‌లో ఈ మూవీ వరల్డ్‌ వైడ్‌గా రూ. 700పైగా గ్రాస్‌ కలెక్షన్స్‌ చేసింది.

ఆ రోజే రిలీజ్

వరుసగా ప్రభాస్‌ పాన్‌ ఇండియా సినిమాలు చేస్తున్న ఆరేంజ్‌ హిట్‌ లేదు. బ్యాక్‌ టూ బ్యాక్‌ ఫ్లాప్స్‌ అనంతరం సలార్‌ ఓ సాలీడ్‌ హిట్‌ ఇవ్వడంతో 'డార్లింగ్స్'‌ ఫ్యాన్స్‌ అంతా రిలాక్స్‌ అయ్యారు. ఓటీటీలోనూ ఈ చిత్రం అదరగొట్టింది. మిలియన్ల వ్యస్‌ స్ట్రీమింగ్‌తో డిజిటల్‌ వేదికపై దూసుకుపోయింది. ఇదిలా ఉంటే ఇక మన పాన్‌ ఇండియా సినిమాలు ఇతర భాషల్లోనూ రిలీజ్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ జపాన్‌లో సంచలనం సృష్టించింది. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవ ఏడాది పూర్తయిన సందర్భంగా ఇటీవల అక్కడ ఈ చిత్రం రీరిలీజ్‌ కూడా అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సలార్‌ కూడా ఆర్‌ఆర్‌ఆర్ బాటలో జపాన్‌ రిలీజ్‌ చేస్తున్నట్టు గతంలో మూవీ టీం అధికారిక ప్రకటన ఇచ్చింది. అయితే రిలీజ్‌ డేట్‌పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

తాజాగా 'సలార్‌' జపాన్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ అయ్యింది. జూలై 5న జపాన్‌లో గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతుంది. దీనిపై జపాన్‌కు చెందిన ఓ మూవీ సంస్థ తమ ఆఫిషియల్‌ ఎక్స్‌ పేజిలో ట్వీట్‌ చేసింది. ఈ మేరకు స్పెషల్‌ వీడియోను కూడా రిలీజ్‌ చేశారు. అయితే ప్రభాస్‌ సినిమాలకు జపాన్‌లో మంచి డిమాండ్‌‌ ఉంది. మరోసారి 'సలార్‌'తో మరోసారి జపాన్‌లో తన మార్కెట్‌ను మరింత పెంచుకోవడం పక్కా అని ఫ్యాన్స్‌ కాలర్‌ ఎగిరేస్తున్నారు. కాగా ఈ సినిమాలో మలయాళ సూపర్‌ స్టార్‌  పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించారు. ప్రభాస్‌ స్నేహితుడిగా వరదరాజులు పాత్రలో ఆకట్టుకున్నారు. ఇక జగపతి బాబు, శ్రీయా రెడ్డి, యాంకర్‌ ఝాన్సీ, బాబీ సింహా, ఈశ్వరి రావు కీలక పాత్రలో నటించిన ఈ సినిమాను ప్రముఖ హోంబళే ఫిలిం వారు నిర్మించారు.

పార్ట్ 2 షూటింగ్ ఈనెలలోనే

కాగా సలార్‌ రెండు భాగాలు వస్తున్న సంగతి తెలిసింది. ఫస్ట్‌ పార్ట్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌తో రెండో పార్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే పార్ట్‌ 2 ఉంటుందని స్పష్టం చేసిన మూవీ టీం దీనికి 'సలార్‌: శౌర్యాంగ పర్వం' అనే టైటిల్‌ను కూడా ప్రకటించింది. దీంతో సెకండ్‌ పార్ట్‌ షూటింగ్‌పై ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్‌ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పార్ట్‌ షూటింగ్ మేలో ప్రారంభం అయ్యే అవకాశం ఉందట. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేసిన ప్రశాంత్‌ నీల్‌ మేలో షూటింగ్‌ మొదలు పెట్టాడానికి సన్నాహాలు చేస్తున్నారట. మరోవైపు ప్రభాస్‌ 'కల్కి 2898 AD' మూవీతో బిజీగా ఉన్నాడు.ఈ సినిమా జూన్‌ 27 రిలీజ్‌ ఉండటంతో అప్పటి వరకు ప్రభాస్‌ బిజీ బిజీగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సలార్‌ సెట్‌లో ప్రభాస్‌ అడుగుపట్టేది జూన్‌ తర్వాతే అని సినీ సర్కిల్లో గుసగుస. 

Also Read: ఇప్పుడే స్వర్గంలో శ్రీదేవిని కలిశాను - ఆర్జీవీ షాకింగ్‌ ట్వీట్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Gay Murderer: గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నచ్చని పని చేసిన మన్మోహన్, అయినా మోదీ పొగడ్తలుమేం చీమూ, నెత్తురు ఉన్న నాకొడుకులమే! బూతులతో రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్ రెడ్డిManmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Gay Murderer: గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
Manmohan Singh: 'మన్మోహన్ దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు' - మాజీ ప్రధాని పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి
'మన్మోహన్ దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు' - మాజీ ప్రధాని పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Boxing Day Test Live Updates: పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
Tirumala : తిరుమలలో వైకుంఠ ఏకాదశి - వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ
తిరుమలలో వైకుంఠ ఏకాదశి - వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ
Embed widget