హీరో నిఖిల్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు

కార్తికేయ సినిమా కాస్తా గ్యాప్‌ తీసుకున్న ఈ హీరో రీఎంట్రీలో మరింత దూసుకుపోతున్నాడు

ప్రస్తుతం బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు, వరుస హిట్లతో ఫుల్‌ ఫామ్‌లో ఉన్నాడు

ఈ హీరో చేతిలో ప్రజెంట్‌ పాన్‌ ఇండియా పిరియాడికల్‌ డ్రామా 'స్వయంభు' చిత్రంతో బిజీగా ఉన్నాడు

ఇటీవల తండ్రైన హీరో నిఖిల్‌ గురించి తాజాగా ఓ ఆసక్తికర విషయం తెలిసింది

హీరోగా కంటే ముందు నిఖిల్‌ ఓ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడట

ఈ విషయాన్ని డైరెక్టర్‌ చందూ మొండేటి తాజాగా ఓ ఇంటర్య్వూలో వెల్లడించారు

ఇండస్ట్రీలో తాను నిఖిల్‌, డైరెక్టర్‌ సుధీర్‌ వర్మ మంచి ఫ్రెండ్స్‌ అని చెప్పారు

నిఖిల్‌, సుధీర్‌ వర్మ నేను హైదరాబాద్ నవాబ్స్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్స్‌గా పనిచేశామంటూ ఆసక్తికర విషయం చెప్పారు

నవాబ్‌ సినిమాకు నిఖిల్‌ డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేయడమే కాకుండ ఓ చిన్న రోల్‌ కూడా చేశాడన్నారు

Image Source: All Image Credit: actor_nikhil/Instagram

ఆ తర్వాత శేఖర్‌ కమ్ముల హ్యాపీడేస్‌ సినిమాకు సెలక్ట్‌ అయ్యి హీరో అయిపోయాడంటూ నిఖిల్‌ గురించి చెప్పుకొచ్చారు