Ram Gopal Varma: ఇప్పుడే స్వర్గంలో శ్రీదేవిని కలిశాను - ఆర్జీవీ షాకింగ్ ట్వీట్
RGV Meets Sridevi: రామ్ గోపాల్ వర్మ తాజాగా దివంగత నటి శ్రీదేవిని కలిశాను అంటూ ఓ పోస్ట్ చేశారు. ఇందులో శ్రీదేవి డ్రైవింగ్ చేస్తూ ఉంటే పక్కనే సిగరేట్ తాగుతూ వర్మ కనిపించాడు.
Ram Gopal Varma Shared Late Actor Sridevi Morphed Photo: రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన కామెంట్స్‌తో తరచూ వివాదంలో నిలుస్తుంటారు. నిజం చెప్పాలంటే వర్మ ఏం మాట్లాడాలిన అదే హాట్ టాపికే. ఏ విషయంపై ఎలా స్పందిస్తాడో తెలియదు.ఎప్పుడు ఎవరికిని టార్గెట్ చేస్తారో తెలియదు. ఎప్పుడు ఒకరిపై సటైరికల్ కామెంట్స్ చేసే ఆర్జీవీ ఎవరి గురించి అయినా పాజిటివ్ మాట్లాడితే అది చర్చనీయాంశం అవుతుంది. అలాంటి ఆర్జీవీ ఇండస్ట్రీలో అత్యంత అభిమానించే.. ఆరాధించే వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆమె అతిలోక సుందరి శ్రీదేవి. ఆమెను ఆర్జీవీ ఎంతగా అభిమానిస్తారో అందరికి తెలిసిందే. ఎన్నో సందర్భంగా శ్రీదేవిపై ఉన్న ప్రేమను ఆయన వ్యక్తం చేశారు. నిజానికి ఆర్జీవీ శ్రీదేవిని ప్రేమించారనేది ఇండస్ట్రీలో టాక్.
సందర్భం వచ్చినప్పుడల్లా ఆవిడ ప్రేమించడం కంటే ఆరాధించానని చెబుతుంటారు వర్మ. అయితే తాజాగా ఆర్జీవీ ఓ షాకింగ్ పోస్ట్ షేర్ చేశారు. శ్రీదేవి కలిశానంటూ ఆమె దిగిన ఫోటోను షేర్ చేశారు. ఇది చూసి అంతా ఒక్కసారి షాక్ అవుతున్నారు. దీనికి 'ఇప్పుడే స్వర్గంలో శ్రీదేవిని కలిశాను' అంటూ తనదైన స్టైల్లో క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. అయితే ఇది ఎడిటెడ్ ఫోటో. డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తికి శ్రీదేవి ఫేస్‌ను ఎడిట్ చేసి షేర్ చేశాడు. ఇందులో ఆర్జీవీ పక్కనే కూర్చోని సిగరేట్ తాగుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ హాట్‌టాపిక్ అవుతుంది. దీనిపై కొందరు "పిచ్చి పీక్స్ వెళ్లడమంటే ఇదేనేమో " అంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న దుబాయ్ ఆమె అనుమానాస్పదంగా మృతి చెందిన సంగతి తెలిసిందే.
I just came to HEAVEN to visit HER https://t.co/HaPvjzjvMg
— Ram Gopal Varma (@RGVzoomin) May 1, 2024
కాగా కాంట్రవర్సికి కేరాఫ్ అడ్రస్ అయిన ఆర్జీవీ ఈ మధ్య వివాదస్పద సినిమాలు చేస్తున్నారు. రాజకీయాలు, సమాజంలో జరిగే నిజజీవిత సంఘటనలపై సినిమాలు చేస్తూ వివాదంలో నిలుస్తున్నారు. ఆయనతో పాటు ఆయన సినిమాలు తరచూ వివాదంలో నిలుస్తుంటాయి. అలా ఇటీవల వచ్చిన శపథం, వ్యూహం చిత్రాలు ఎన్ని వివాదాల తర్వాత విడుదల అయయాయి. ఒకప్పుడు కమర్షియల్, యాక్షన్, థ్రిల్లర్ సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్నాడు ఆర్జీవీ. ఆయన సినిమా అంటే సూపర్ డూపర్ హిట్టు అనే మార్క్ కొట్టేశారు. శివ, రంగీలా, క్షణక్షణం ఇలా ఎన్నో సినిమాలు చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఆర్జీవీ కెరీర్‌లో శివ మూవీ ఓ మైలురాయి అని చేప్పడంలో సందేహం లేదు. అంతగా ఒకప్పుడు కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకున్న ఆర్జీవీ ఈ మధ్య బోల్డ్ కంటెంట్‌తో కాంట్రవర్సల్ అవుతున్నారు. బాక్సాఫీసు వద్ద అవి బొల్తా కొట్టిన తన తీరు మాత్రం మార్చుకోవడం. ఫలితాలు ఎలా ఉన్న తను మాత్రం అనుకున్న సినిమాలు చేస్తూనే ఉంటానని చెబుతుంటారు.
Also Read: మొటిమల కోసం సర్జరీ చేసుకున్నారా? సాయి పల్లవి రియాక్షన్ ఇదే!