Rajinikanth: హిమాలయాల్లో రజనీకాంత్ - తలైవా సింపుల్ లుక్ చూశారా?
Rajinikanth Himalayas Tour: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆధ్యాత్మిక సేవలో భాగంగా హిమాలయాలకు వెళ్లారు. ప్రస్తుతం 'జైలర్ 2' షూటింగ్ జరుగుతుండగా వారం పాటు బ్రేక్ తీసుకున్నారు.

Rajinikanth Himalayas Tour Photos Gone Viral: రీసెంట్‌గా 'కూలీ' మూవీ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. ప్రస్తుతం 'జైలర్ 2'లో నటిస్తున్నారు. 2023లో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన 'జైలర్'కు సీక్వెల్‌గా మూవీ తెరకెక్కుతుండగా... ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే, తాజాగా తలైవా షెడ్యూల్‌కు కాస్త బ్రేక్ ఇచ్చారు.
హిమాలయాల్లో తలైవా...
రజనీకాంత్‌కు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. ప్రతీ ఏడాది ఎంత బిజీగా ఉన్నా కాస్త బ్రేక్ తీసుకుని హిమాలయాలకు వెళ్తుంటారు. 'జైలర్ 2 బిజీ షెడ్యూల్‌లోనూ వారం రోజుల పాటు బ్రేక్ తీసుకుని ప్రస్తుతం హిమాలయాలకు వెళ్లారు. అక్కడ రిషికేశ్, బద్రీనాథ్, బాబా గుహ వంటి పవిత్ర స్థలాలను సందర్శించి కాస్త సేదతీరారు. రిషికేశ్ ఆశ్రమంలో ఆయన ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సింపుల్ లుక్‌లోనే కనిపించిన ఆయన భోజనం చేస్తూ అక్కడ తన స్నేహితులతో సరదాగా ముచ్చటించారు. వీటిని షేర్ చేస్తున్న తలైవా ఫ్యాన్స్ ఆయన సింప్లిసిటీని కొనియాడుతున్నారు. రజనీ ఎక్కడకి వెళ్లినా చాలా సింపుల్‌గా ఉంటారని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, జైలర్ రిలీజ్‌కు ముందు కూడా ఆయన హిమాలయాల సందర్శనకు వెళ్లారు.
Superstar #Rajinikanth in his spiritual journey to Himalayas ♥️✨ pic.twitter.com/OMbz0RJZRt
— AmuthaBharathi (@CinemaWithAB) October 5, 2025
Also Read: శ్రీకాంత్ కుమారుడు రోషన్ నెక్స్ట్ మూవీ - వయలెంట్ యాక్షన్ థ్రిల్లర్స్ డైరెక్టర్ విత్ లవ్ స్టోరీ
సినిమాల విషయానికొస్తే... తలైవా ప్రస్తుతం 'జైలర్ 2' మూవీ చేస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ 12న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫస్ట్ పార్ట్ రూ.200 కోట్లతో రూపొందించగా దాదాపు రూ.600 కోట్లు వసూలు చేసింది. ఫస్ట్ పార్టులో కనిపించిన వారంతా సీక్వెల్‌లోనూ కనిపించనున్నారు. రమ్యకృష్ణ, జాకీ ష్రాఫ్, కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్, మోహన్ లాల్, మిర్నా మేనన్ కీలక పాత్రలు పోషించారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ మూవీని నిర్మించారు. ఫస్ట్ పార్ట్‌ను మించి సెకండ్ పార్ట్ ఉంటుందని టీజర్ అనౌన్స్‌మెంట్ వీడియోను బట్టే తెలుస్తోంది. ఈ సీక్వెల్ కోసం తలైవా ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ మూవీ తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో ఓ మూవీని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి.అశ్వనీదత్ ఈ ప్రాజెక్టును భారీ స్థాయిలో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. నాగ్ అశ్విన్ చెప్పిన ఇంట్రెస్టింగ్ స్టోరీకి తలైవా ఫిదా అయినట్లు తెలుస్తోంది. 'జైలర్ 2' తర్వాత ఈ సినిమా ట్రాక్ ఎక్కే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.






















