Mandaadi Movie: సుహాస్ 'మందాడి' షూటింగ్‌లో యాక్సిడెంట్ - అంతా సేఫ్... కానీ...
Mandaadi Shooting Accident: తమిళ స్టార్ సూరి, టాలీవుడ్ స్టార్ సుహాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న మందాడి మూవీ షూటింగ్‌లో ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు సముద్రంలో పడవ బోల్తా పడింది.

Boat Accident In Mandaadi Movie Shooting: కోలీవుడ్ స్టార్ సూరి, టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో సుహాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న మూవీ 'మందాడి'. సుహాస్‌కు ఇది తమిళ డెబ్యూ మూవీ కాగా ఆయన విలన్ రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా శుక్రవారం సెట్‌లో ప్రమాదం చోటు చేసుకుంది.
అసలేం జరిగిందంటే?
రామనాథపురం జిల్లాలోని తొండి బీచ్‌లో షూటింగ్ జరుగుతుండగా... RED డిజిటల్ కెమెరా తీసుకెళ్తోన్న పడవ ప్రమాదానికి గురైంది. సముద్రంలో పడవ బోల్తా పడగా... అదృష్టవశాత్తు సిబ్బంది ఎలాంటి గాయాలు లేకుండా సేఫ్‌గా బయటపడ్డారు. ఇద్దరు వ్యక్తులు నీటిలో మునిగిపోగా మూవీ టీం వారిని రక్షించింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, కెమెరాతో పాటు ఇతర సామగ్రి మాత్రం నీటిలో మునిగిపోయింది. దీని విలువ దాదాపు రూ.60 లక్షలు ఉంటుందని మూవీ టీం వెల్లడించింది.
Also Read: 80s లెజెండరీ స్టార్స్ రీయూనియన్ - ఒకప్పటి స్టార్ హీరోస్, హీరోయిన్స్ ఇప్పుడు ఎలా ఉన్నారో చూశారా?
ఇక 'మందాడి' విషయానికొస్తే ఈ మూవీతోనే తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నారు సుహాస్. ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్, స్టోరీస్ ఎంచుకుంటూ తనదైనన నటనతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన ఆయన ఈ మూవీలో విలన్ రోల్ చేస్తున్నారు. టాలీవుడ్‌లోనూ 'హిట్ 2' వంటి మూవీస్‌లో సుహాస్ నెగిటివ్ రోల్‌లో మెప్పించారు.
ఈ మూవీలో సూరి, సుహాస్‌తో పాటు మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మథిమారన్ పుళగేంది దర్శకత్వం వహిస్తుండగా... ఆర్ఎస్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు.





















