Roshan Meka New Movie: శ్రీకాంత్ కుమారుడు రోషన్ నెక్స్ట్ మూవీ - వయలెంట్ యాక్షన్ థ్రిల్లర్స్ డైరెక్టర్ విత్ లవ్ స్టోరీ
Roshan Sailesh Kolanu: సీనియర్ హీరో శ్రీకాంత్ కుమారుడు, టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ నెక్స్ట్ మూవీపై క్లారిటీ వచ్చేసింది. వయలెంట్ యాక్షన్ థ్రిల్లర్ డైరెక్టర్స్‌తో సినిమా చేయబోతున్నారు.

Roshan Meka Next Movie With Director Sailesh Kolanu: ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరోస్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎంచుకుంటూ తనదైన నటనతో ఆడియన్స్ మదిలో చెరగని ముద్ర వేశారు రోషన్. సీనియర్ హీరో శ్రీకాంత్ కుమారుడిగానే కాకుండా స్క్రిప్ట్స్ విషయంలో ఆచి తూచి సెలక్ట్ చేసుకుంటున్నారు. తాజాగా రోషన్ నెక్స్ట్ మూవీ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయ్యింది.
వయలెంట్ మూవీస్ డైరెక్టర్‌తో...
ప్రస్తుతం 2 సినిమాలు రోషన్ చేతిలో ఉండగా తర్వాత మూవీని కూడా అనౌన్స్ చేశారు. వయలెంట్ యాక్షన్ థ్రిల్లర్ డైరెక్టర్ శైలేష్ కొలనుతో ఆయన తన నెక్స్ట్ మూవీ చేయబోతున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో మూవీ వస్తుందని ఫిలింనగర్ వర్గాల్లో రూమర్స్ వచ్చినా తాజాగా అది అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయ్యింది. రోషన్‌తో ఓ లవ్ స్టోరీ తెరకెక్కించేందుకు శైలేష్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు.
'హిట్' ఫ్రాంచైజీతో డైరెక్టర్ శైలేష్ కొలను ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఫస్ట్ కేస్ నుంచి రీసెంట్‌గా నేచరల్ స్టార్ నాని హీరోగా వచ్చిన 'హిట్ 3' మూవీ సైతం బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించాయి. అయితే, మధ్యలో వెంకటేష్ హీరోగా వచ్చిన 'సైంధవ్' అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఇప్పటివరకూ యాక్షన్ థ్రిల్లర్స్ మాత్రమే ఆయన డైరెక్ట్ చేయగా... ఇప్పుడు సరికొత్తగా లవ్ స్టోరీతో రాబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలపై అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది.
వరుసగా మూవీస్ చేసెయ్యాలన్న ఆలోచనతో కాకుండా తనదైన స్టైల్‌కు సూట్ అయ్యే కథలు మాత్రమే ఎంచుకుంటున్నారు రోషన్. స్క్రీప్ట్స్ విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. 2016లో 'నిర్మలా కాన్వెంట్' మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు రోషన్. ఇందులో కింగ్ నాగార్జున ఓ కీలక రోల్ పోషించారు. ఫస్ట్ మూవీ అంతగా సక్సెస్ కాకపోయినా తనదైన నటనతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ మూవీకి గానూ రోషన్‌కు బెస్ట్ మేల్ డెబ్యూ అవార్డు దక్కింది. అంతకు ముందు రుద్రమదేవి మూవీలో బాల నటుడిగా మెప్పించారు. ఇక ఐదేళ్ల గ్యాప్ తర్వాత 2021లో 'పెళ్లిసందD' మూవీలో నటించారు. యంగ్ బ్యూటీ శ్రీలీల సైతం ఈ మూవీతోనే టాలీవుడ్‌కు పరిచయమైంది.
ప్రస్తుతం 2 మూవీస్...
ప్రస్తుతం 2 మూవీస్‌లో రోషన్ బిజీగా ఉన్నారు. మలయాళ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన 'వృషభ'లో చేస్తున్నారు. మోహన్ లాల్ తనయుడిగా రోషన్ నటిస్తుండగా... ఆయన సరసన బాలీవుడ్ బ్యూటీ షనయా కపూర్ నటిస్తున్నారు. మరో మూవీ 'ఛాంపియన్'. ప్రదీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే లుక్స్, గ్లింప్స్ రిలీజ్ కాగా ఆకట్టుకుంటున్నాయి. పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ గతేడాది ప్రారంభం కాగా... ప్రస్తుతం షూటింగ్ సాగుతోంది. ఫుట్ బాల్ గేమ్ బ్యాక్ డ్రాప్‌గా మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీస్ కంప్లీట్ అయిన తర్వాత శైలేష్ కొలను మూవీ స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం.






















