OG Universe: 'OG' ప్రీక్వెల్‌లో అకీరా నందన్ - కన్ఫర్మ్ చేసేసిన డైరెక్టర్ సుజీత్!... ఒక్క డైలాగ్‌తోనే సస్పెన్స్‌లో పెట్టేశారు
Pawan Kalyan: పవన్ 'OG' యూనివర్స్‌లో ఆయన కుమారుడు అకీరా ఉంటారా? అనే ప్రశ్నకు డైరెక్టర్ సుజీత్ తాజాగా రియాక్ట్ అయ్యారు. ఒక్క డైలాగ్‌తోనే భారీ హైప్ క్రియేట్ చేశారు.

Director Sujeeth About Akira In OG Universe: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'OG' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తమ అభిమాన నటుడిని సిల్వర్ స్క్రీన్‌పై ఫ్యాన్స్ ఎలా చూడాలని అనుకున్నారో అలానే ప్రెజెంట్ చేశారు డైరెక్టర్ సుజీత్. సినిమా చూసిన ఫ్యాన్స్‌లో పవన్ చిన్న నాటి రోల్ ఆయన కుమారుడు అకీరా చేసుంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇప్పటికే ఈ మూవీ ప్రీక్వెల్, సీక్వెల్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయాయి.
'OG' యూనివర్స్‌లో అకీరా కన్ఫర్మ్?
'OG' యూనివర్స్‌లో అకీరా నటిస్తున్నారా? అనే ప్రశ్నకు డైరెక్టర్ సుజీత్ తాజాగా రియాక్ట్ అయ్యారు. అమెరికా డల్లాస్‌లో 'OG' మూవీ ప్రదర్శితం అవుతున్న థియేటర్‌కు వెళ్లిన డైరెక్టర్ సుజీత్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అక్కడ ఫ్యాన్స్‌తో ముచ్చటించారు. 'OG' హైప్‌ను వారితో కలిసి ఎంజాయ్ చేశారు. ''OG' ప్రీక్వెల్‌లో అకీరా ఉన్నారా?' అంటూ ఫ్యాన్స్ అడగ్గా... 'ఇప్పుడే చెప్పేస్తే థ్రిల్ ఉండదు' అంటూ హైప్ క్రియేట్ చేశారు. ఈ వీడియో వైరల్ అవుతుండగా... ప్రీక్వెల్ లేదా సీక్వెల్‌లో అకీరా కన్ఫర్మ్ అంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
SCUలో నాని మూవీ...
'OG' మూవీలో ఓ సీన్‌ను ప్రభాస్ 'సాహో'తో కనెక్ట్ చేశారు డైరెక్టర్ సుజీత్. దీంతో సుజీత్ సినిమాటిక్ యూనివర్స్‌పై భారీ హైప్ నెలకొంది. రీసెంట్‌గా సక్సెస్ మీట్స్, ఇంటర్వ్యూల్లో మూవీ టీంతో పాటు పవన్ కల్యాణ్ సైతం 'OG యూనివర్స్' కన్ఫర్మ్ చేసేశారు. ప్రీక్వెల్ సీక్వెల్ కూడా ఉంటాయని తెలుస్తుండగా... ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
ఇక సుజీత్ తన నెక్స్ట్ మూవీని నేచరల్ స్టార్ నానితో చేయబోతున్న సంగతి తెలిసిందే. విజయదశమి సందర్భంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. నాని కెరీర్‌లో ఇది 34వ సినిమా కాగా... నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్, అనానిమస్ ప్రొడక్షన్ బ్యానర్‌పై వెంకట్ బోయిన్పల్లి నిర్మిస్తున్నారు. హై ఆక్టేన్, ఎమోషన్, కామెడీ డ్రామాగా మూవీ తెరకెక్కనుండగా... 'SCU'లో ఈ మూవీ భాగమేనా అనే ప్రశ్నకు... 'మీకు కావాలా వద్దా?' అని అడిగారు సుజీత్. దీంతో ఫ్యాన్స్ అంతా కావాలంటూ చెప్పగా... ఓకే అని అన్నారు. దీంతో నాని మూవీ 'సుజీత్ సినిమాటిక్ యూనివర్స్' (SCU)లో భాగమేనని కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది.
Also Read: 'కల్కి' సీక్వెల్‌లో ఆ హీరోయిన్? - ఎవరూ ఊహించి ఉండరు... నాగ్ అశ్విన్ ప్లాన్ మామూలుగా లేదు
'OG' సక్సెస్‌తో మూవీ టీం ఫుల్ జోష్‌లో ఉంది. అయితే, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ సినిమాలు చేసే అవకాశం లేదని మొన్నటివరకూ ప్రచారం సాగింది. రీసెంట్‌గా సక్సెస్ ఈవెంట్‌లో దానికి చెక్ పెట్టారు పవన్. 'OG యూనివర్స్'లో నటిస్తానంటూ కన్ఫర్మ్ చేశారు. ఇక డైరెక్టర్ సుజీత్ సీక్వెల్‌తో పాటు ప్రీక్వెల్ కూడా కన్ఫర్మ్ చేశారు. జపాన్‌లో ఓజెస్ గంభీర ఏం చేశాడు? యాకూజా గ్యాంగ్ స్టర్లను ఎలా అంతం చేశాడు? గంభీర తండ్రి సుభాష్ చంద్రబోస్ వంటి అంశాలను ఈ యూనివర్స్‌లో చూపించే ఛాన్స్ ఉంది.





















