అన్వేషించండి

Rajesh Sharma Hospitalised: ఫౌజీ సెట్స్‌లో పురుగు కుట్టలేదు... బాలీవుడ్ నటుడు ఆస్పత్రిలో చేరడానికి అసలు కారణం ఏమిటంటే?

Why Was Rajesh Sharma Hospitalised?: బాలీవుడ్ నటుడు రాజేష్ శర్మ ఆరోగ్య పరిస్థితిపై ఆయన అసిస్టెంట్ క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలు అవాస్తవమన్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బాలీవుడ్ నటుడు రాజేష్ శర్మ ఆరోగ్య పుకార్లను అసిస్టెంట్ ఖండించారు.
  • డయాబెటిస్, జ్వరం కారణంగా ఆయన కోల్‌కతాలో ఆసుపత్రిలో చేరారు.
  • ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉంది, ఈరోజు డిశ్చార్జ్ కానున్నారు.

బాలీవుడ్ నటుడు రాజేష్ శర్మ (Bollywood Actor Rajesh Sharma) ఆరోగ్యంపై గత 24 గంటలుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మన రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా 'ఫౌజీ' చిత్రీకరణ కోసం ఆయన హైదరాబాద్ సిటీ వచ్చారు. ఆ సినిమా సెట్స్‌లో ఏదో జరిగిందని సోషల్ మీడియా టాక్. వాటిని ఆయన అసిస్టెంట్ ఖండించారు. నెట్టింట ప్రచారంలో ఉన్న వార్తలన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని, వాటిలో ఎటువంటి వాస్తవం లేదని అసిస్టెంట్ స్పష్టం చేశారు. మరి, రాజేష్ శర్మకు ఏం జరిగింది?

నెట్టింట చక్కర్లు కొడుతున్న పుకారు ఏమిటి?
ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రభాస్ 'ఫౌజీ' చిత్రీకరణ జరుగుతోంది. సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో రాజేష్ శర్మను ఓ విషపురుగు కుట్టిందని వార్తలు వచ్చాయి. ఆ కాటు వల్ల ఆయన శరీరంలో ఇన్ఫెక్షన్ చాలా వేగంగా వ్యాపించిందని, దాంతో అస్వస్థతకు గురయ్యారని సమాచారం ఉంది. దాంతో ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించినట్లు ప్రచారం జరుగుతోంది. వాటిని రాజేష్ శర్మ అసిస్టెంట్ ఖండించారు.

Also Read: Swathi Srikanth Nagothi Wedding - దర్శకుడితో స్వాతి రెండో పెళ్ళి... కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా

డయాబెటిస్ కారణంగా ఆస్పత్రిలో రాజేష్ శర్మ...
ఆస్పత్రిలో రాజేష్ శర్మ అడ్మిట్ కావడానికి కారణం డయాబెటిస్ అని ఆయన అసిస్టెంట్ తెలిపారు. ఓ వీడియో కూడా విడుదల చేశారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వార్తల్లో నిజం లేదన్నారు. 'ఫౌజీ' సెట్స్‌లో విషపురుగు  కుట్టిందన్న వార్తలు అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు. ప్రస్తుతం రాజేష్ శర్మ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయనను ఈ రోజు డిశ్చార్జ్ చేయనున్నారని సమాచారం.

Also ReadAnasuya Saree Trend - చీరలే కడుతున్న అనసూయ... శివాజీ ఎఫెక్టా? మార్పు గమనించారా??

డయాబెటిస్ (షుగర్)తో పాటు రాజేష్ శర్మకు జ్వరం, ఇంకా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో కోల్‌కతాలోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది. గతంలో వచ్చిన రిపోర్టుల ప్రకారం... రాజేష్ శర్మ కుడి కాలికి ఇన్ఫెక్షన్ సోకడం వల్ల బ్లడ్ క్లాట్స్ ఏర్పడే ప్రమాదం ఉందట. హిందీతో పాటు బెంగాలీ సినిమాల్లో ఆయన నటిస్తున్నారు. ఇటీవల రామ్ చరణ్ 'పెద్ది'లోని పతాక సన్నివేశాల్లో కేంద్ర మంత్రిగా కనిపించారు. విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన రాజేష్ శర్మ... త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఆకాంక్షిస్తున్నారు. 'ఫౌజీ' కాకుండా ప్రభాస్ చేతిలో కల్కి సీక్వెల్ కల్కి 2, సలార్ సీక్వెల్ ఉన్నాయి. బాహుబలి 3 ఉంటుందని హింట్ ఇచ్చారు రానా దగ్గుబాటి.

Also ReadRavi Mohan - అభిమానులకు సారీ చెప్పిన తమిళ హీరో... ఎందుకో తెలుసా?

Frequently Asked Questions

రాజేష్ శర్మ ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో ఎలాంటి వార్తలు చక్కర్లు కొట్టాయి?

'ఫౌజీ' షూటింగ్‌లో విషపురుగు కుట్టడం వల్ల రాజేష్ శర్మకు తీవ్ర అస్వస్థత ఏర్పడిందని, ఆస్పత్రిలో చేరారని వార్తలు వచ్చాయి. అతని అసిస్టెంట్ ఈ వార్తలను ఖండించారు.

రాజేష్ శర్మ ఆసుపత్రిలో చేరడానికి అసలు కారణం ఏమిటి?

రాజేష్ శర్మ డయాబెటిస్, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా ఆసుపత్రిలో చేరారు. విషపురుగు కాటు వార్తలు అవాస్తవం.

ప్రస్తుతం రాజేష్ శర్మ ఆరోగ్యం ఎలా ఉంది?

రాజేష్ శర్మ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈరోజు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేయనున్నారు.

రాజేష్ శర్మ ఏ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు?

డయాబెటిస్, జ్వరం, శ్వాస ఇబ్బంది కారణంగా రాజేష్ శర్మ కోల్‌కతాలోని మణిపాల్ ఆసుపత్రిలో చేరారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Brahmanandam Brother Sri Vadan: అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
Nandamuri Mokshagna: ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ
ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ
Balakrishna: డిసెంబర్‌లో NBK 111... సర్జరీ జరిగినా షూటింగ్‌కు బాలయ్య?
డిసెంబర్‌లో NBK 111... సర్జరీ జరిగినా షూటింగ్‌కు బాలయ్య?
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Embed widget