అన్వేషించండి

Ravi Mohan: అభిమానులకు సారీ చెప్పిన తమిళ హీరో... ఎందుకో తెలుసా?

Ravi Mohan Upcoming Movies: భార్య ఆర్తీ రవితో విడాకుల కేసు, సింగర్ కేనీషాతో బ్రేకప్ తర్వాత సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్టు రవి మోహన్ అనౌన్స్ చేశారు. ఆ ప్రకటనపై ప్రేక్షకులకు శారీ చెప్పారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రవి మోహన్ వ్యక్తిగత కారణాలతో సినిమాలకు తాత్కాలిక విరామం ప్రకటించారు.
  • లోకేష్ కనగరాజ్ 'బెంజ్' సినిమాతో తిరిగి వస్తున్నట్లు స్వయంగా తెలిపారు.
  • క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయమని, అభిమానులకు క్షమాపణలు చెప్పారు.
  • పరిశ్రమ ప్రముఖుల సూచనలతో తన మనసు మార్చుకున్నానని వివరించారు.

తమిళ, తెలుగు ప్రేక్షకులకు జయం రవిగా సుపరిచితులైన కథానాయకుడు రవి మోహన్ (Ravi Mohan). కొంత కాలంగా సినిమా వార్తల కంటే వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలిచారు. భార్య ఆర్తీ రవితో విడాకుల వివాదం, సింగర్ కేనీషాతో బ్రేకప్ బాధ, పిల్లలను కలవనివ్వడం లేదని ఆవేదన... వెరసి సినిమాలు చేయనని రవి మోహన్ అనౌన్స్ చేశారు. విలేకరుల సమావేశంలో కన్నీరు పెట్టుకున్నారు. తన వ్యక్తిగత జీవితంలో వివాదాలు ముగిసే వరకు నటనకు స్వస్తి పలుకుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గారు.

వెనక్కి తగ్గిన రవి మోహన్... మళ్ళీ సినిమాల్లోకి!
నటనకు గుడ్ బై చెబుతున్నట్టు, సినిమాల నుంచి తాను తాత్కాలిక విరామం తీసుకుంటున్నట్లు రవి మోహన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గారు. మళ్ళీ సినిమాల్లోకి వచ్చారు. 

సినిమాలకు బ్రేక్ అని అనౌన్స్ చేసిన కొన్ని రోజులకు లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)లోని 'బెంజ్'లో రవి మోహన్ నటిస్తున్నట్టు స్వయంగా లోకేష్ కనగరాజ్ పేర్కొన్నారు. దాంతో రవి మోహన్ యూ టర్న్ తీసుకున్నట్టు అర్థం అయ్యింది. ఇప్పుడు ఓ అవార్డుల వేడుకలో ఆ అంశంపై స్వయంగా ఆయన మాట్లాడారు. 

Also ReadKing 100 - 'కింగ్ 100'లో లేడీ విలన్... నాగార్జునతో 28 ఏళ్ల తర్వాత... అటువంటి రోల్‌లో సీనియర్ హీరోయిన్?

చెన్నైలో జరిగిన ఓ అవార్డుల వేడుకలో ''నేను సినిమాలను వదిలిపెట్టడం లేదు'' అని రవి మోహన్ ప్రకటించారు. అంతే కాదు... తన అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పారు. సినిమాలకు బ్రేక్ అంటూ ఎమోషనల్ అయిన ప్రెస్ మీట్ గురించి రవి మోహన్ మాట్లాడుతూ... ''అప్పుడు ఆ నిర్ణయం క్షణికావేశంలో తీసుకున్నా. నాకు ఈ ఏడాదితో 46 ఏళ్లు నిండుతాయి. నా జీవితంలో సగం కాలం సినిమాల్లో గడిపాను. నేను చేసిన చిన్న పొరపాటు వల్ల అభిమానులు బాధపడటం నాకు నచ్చలేదు'' అన్నారు.

Also ReadHack For Heavy Earrings - బరువైన ఇయర్ రింగ్స్‌తో నొప్పి కలుగుతోందా? పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల చెప్పిన చిట్కా చూశారా?

చిత్రసీమలోని పలువురు ప్రముఖులు తనను కలిశారని, ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాలకు దూరం కావొద్దని తనకు సలహాలు, సూచనలు ఇచ్చారని, వాళ్ళందరూ మళ్ళీ సినిమాల్లోకి రావాలని కోరడంతో తాను మనసు మార్చుకున్నట్లు రవి మోహన్ వెల్లడించారు. 'పొన్నియిన్ సెల్వన్', 'కరాటే బాబు' వంటి సినిమాల్లో పోషించిన పాత్రలతో మళ్ళీ ప్రేక్షకులను అలరిస్తానని ఆయన చెప్పారు. తాను ఏడవడం వల్ల తన మానసిక ఆరోగ్యంపై చర్చ మొదలైనందుకు సంతోషం వ్యక్తం చేశారు. తన రీ ఎంట్రీ సినిమా 'బెంజ్' అని స్పష్టం చేశారు. 'బెంజ్' కాకుండా రవి మోహన్ చేతిలో మరో మూడు సినిమాలు ఉన్నాయి. వాటిలో 'కరాటే బాబు', 'జీనీ' చాలా రోజులుగా విడుదల కోసం ఎదురు చూస్తున్నాయి. ఆ రెండూ ఆలస్యం అవుతూ వస్తున్నాయి. మరో సినిమా కూడా మొదలైంది.

Also ReadKangana Ranaut Queen 2 Controversy - కంగనా రనౌత్‌కు భారీ షాక్... కొత్త సినిమాపై 250 కోట్లకు కాపీరైట్ కేసు

Frequently Asked Questions

రవి మోహన్ సినిమాల నుండి విరామం ఎందుకు ప్రకటించారు?

వ్యక్తిగత జీవితంలో వివాదాలు ముగిసే వరకు నటనకు స్వస్తి పలుకుతున్నట్లు ఆయన ప్రకటించారు. భార్యతో విడాకుల వివాదం, బ్రేకప్ బాధ, పిల్లలను కలవనివ్వకపోవడం వంటి సమస్యల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు.

రవి మోహన్ సినిమాలకు గుడ్ బై చెప్పే నిర్ణయానికి కట్టుబడి ఉన్నారా?

లేదు, ఆయన ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గారు. మళ్ళీ సినిమాల్లోకి వచ్చారు. క్షణికావేశంలో ఆ నిర్ణయం తీసుకున్నానని, అభిమానులు బాధపడటం ఇష్టం లేదని ఆయన వివరించారు.

సినిమాలను వదిలేయాలనే నిర్ణయాన్ని రవి మోహన్ ఎందుకు మార్చుకున్నారు?

చిత్రసీమలోని ప్రముఖులు ఆయనను కలిసి, సినిమాలకు దూరం కావొద్దని సలహా ఇచ్చారు. వారందరూ మళ్ళీ సినిమాల్లోకి రావాలని కోరడంతో ఆయన తన మనసు మార్చుకున్నారు.

రవి మోహన్ తిరిగి నటిస్తున్న సినిమా ఏది?

లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)లోని 'బెంజ్' సినిమాతో రవి మోహన్ తిరిగి నటిస్తున్నారు. ఇది ఆయన రీ ఎంట్రీ సినిమా అని స్వయంగా ప్రకటించారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jailer 2 OTT : జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget