Samantha Wedding: అత్తమామలతో సమంత... రాజ్ నిడిమోరు సిస్టర్ శీతల్ హార్ట్ టచింగ్ పోస్ట్
Samantha In Laws Family:నిడిమోరు ఫ్యామిలీ మనస్ఫూర్తిగా తమ కుటుంబంలోకి సమంతను స్వాగతించింది. రాజ్ నిడిమోరు సిస్టర్, సమంత ఆడపడుచు సోషల్ మీడియాలో హార్ట్ టచింగ్ పోస్ట్ చేశారు.

Sheetal Nidimoru On Samantha: కథానాయిక సమంత - దర్శకుడు రాజ్ నిడిమోరు వివాహ బంధంతో ఒక్కటైన విషయం అందరికి తెలిసిందే. సినిమా ఇండస్ట్రీ నుంచి పలువురు సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు చెప్పారు. నిండు నూరేళ్లూ సామ్ - రాజ్ దంపతులు సంతోషంగా ఉండాలని ఆశీర్వదించారు. వీళ్ళ వివాహ బంధంపై నిడిమోరు ఫ్యామిలీ రియాక్షన్ ఏమిటి? రాజ్ కుటుంబం నుంచి ఆమోద ముద్ర ఉందా? లేదా? అనే సందేహం కొంత మందిలో ఉంది. ఆ అనుమానాలకు శీతల్ నిడిమోరు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఫుల్ స్టాప్ పెడుతుందని చెప్పవచ్చు.
నిడిమోరు ఫ్యామిలీలోకి సమంత...
మనస్ఫూర్తిగా స్వాగతించిన శీతల్!
సమంత - రాజ్ నిడిమోరు (Samantha Raj Nidimoru Marriage) వివాహాన్ని 'జెంటిల్ మన్ అలైన్‌మెంట్'గా రాజ్ నిడిమోరు సిస్టర్ పేర్కొన్నారు. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడిన 'మర్యాదపూర్వక సంబంధం'గా అభివర్ణించారు. అంతే కాదు... ఈ జంటకు నిడిమోరు కుటుంబం నుంచి పూర్తి మద్దతు ఉందని తెలిపారు.
''రాజ్ నిడిమోరు, సమంత ఓ కుటుంబంగా వేసిన ముందడుగు చూసి మేం ఎంతో గర్వపడుతున్నాం. రెండు హృదయాల మధ్య పరస్పర - ప్రశాంతమైన గౌరవం, నిజాయితీ, స్థిరత్వం ఉన్నప్పుడు... ఇద్దరూ కలిసి ఓ మార్గాన్ని ఎంపిక చేసుకున్న సమయంలో మాత్రమే గర్వకారణమైన అనుభూతి కలుగుతుంది. మేం ఎంతో సంతోషంగా, నిస్సంకోచంగా వాళ్ళకు మా కుటుంబం అండగా నిలబడుతోంది. పూర్తి మద్దతు అందిస్తోంది'' అని శీతల్ నిడిమోరు తెలిపారు.
View this post on Instagram
సమంత - రాజ్ నిడిమోరు వివాహ సమయంలో ఆనంద భాష్పాలు వచ్చాయని శీతల్ నిడిమోరు తెలిపారు. కొన్ని బంధాలు అకస్మాత్తుగా ఏర్పడవని, శాంతి - స్పృహద్భవ వాతావరణంతో వస్తాయని ఆమె వివరించారు. రాజ్ - సామ్ జంట ప్రశాంతంగా జీవించాలని తాను భగవంతుడ్ని కోరుకుంటున్నట్టు శీతల్ నిడిమోరు వివరించారు. అదీ సంగతి! సమంతతో రాజ్ నిడిమోరు వివాహం తర్వాత అతని మాజీ భార్య పరోక్ష విమర్శలు చేశారు. సమంతను విలన్ అంటూ మాజీ స్టైలిస్ట్ ఓ పోస్ట్ చేశారు. అయితే సమంతను మనస్ఫూర్తిగా స్వాగతించింది రాజ్ ఫ్యామిలీ.
Also Read: Akhanda 2 First Review: 'అఖండ 2'కు తమన్ రివ్యూ... అనిరుధ్ రేంజ్‌లో ఎమోజీలతో హైప్ పెంచాడుగా!





















