అన్వేషించండి

Aghora Character : 'అఖండ'లో బాలకృష్ణ టైపు - అఘోరాగా వస్తున్న హీరోయిన్!

అఘోర క్యారెక్టర్ అంటే తెలుగు ప్రేక్షకులకు 'అఖండ'లో బాలకృష్ణ గుర్తుకు వస్తారు. సేమ్ టు సేమ్... ఇప్పుడు అటువంటి పాత్రలో హీరోయిన్ నటించారు. 

Radhika Kumaraswamy As Aghora : తెలుగు ప్రేక్షకులకు అఘోర అంటే గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ గుర్తుకు వస్తారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన 'అఖండ'లో ఆయన డ్యూయల్ రోల్ చేయగా... అందులో ఒకటి అఘోర క్యారెక్టర్. అందులో ఆయన నటన, డైలాగ్ డెలివరీకి ప్రేక్షక లోకం అంతా నీరాజనం పలికింది. తెలుగు తెరపై బాలకృష్ణ తప్ప మరొక స్టార్ ఎవరూ అటువంటి క్యారెక్టర్ చేసే సాహసం చేయలేదు. కన్నడలో ఓ హీరోయిన్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే... 

'భైరా దేవి'లో అఘోరాగా రాధికా కుమార స్వామి
Bhairadevi Movie 2023 Release Date : ప్రముఖ కన్నడ కథానాయిక రాధికా కుమార స్వామి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'భైరా దేవీ'. అందులో ఆమె అఘోర పాత్రలో కనిపించబోతున్నారు. కన్నడలో కొన్ని రోజుల క్రితం ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఇప్పుడు ఆ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయాలని ఆమె భావిస్తున్నారు. తాజాగా తెలుగు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. హీరోయిన్ అఘోర క్యారెక్టర్ చేయడంతో కన్నడలో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.   

Also Read : టైగర్ 3 రివ్యూ : దీపావళికి సల్మాన్ యాక్షన్ ధమాకా సౌండ్ చేస్తుందా? సినిమా హిట్టా? ఫట్టా?

'భైరా దేవి'లో పోలీస్ రోల్ చేసిన రమేష్ అరవింద్
'భైరా దేవీ' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే.... త్రిశూలం చేత పట్టుకున్న రాధికా కుమార స్వామి రౌద్ర రసం చూపించారు. నేపథ్యంలో మరి కొంత మంది అఘోరాలు కూడా కనిపిస్తున్నారు. ఇక... ఈ సినిమాలో సీనియర్ హీరో, దర్శకుడు రమేష్ అరవింద్ (Ramesh Aravind) కూడా నటించారు. ఆయనది పోలీస్ రోల్! వారణాసి, కాశీ, హరిద్వార్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ప్రదేశాల్లో సినిమా చిత్రీకరణ చేస్తున్నారు. 

అఘోర పాత్రలో రాధికా కుమార స్వామి ఎలా నటించారు? ఈ సినిమా ఎలా ఉంటుంది? అని కన్నడ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కన్నడతో పాటు తెలుగులో ఈ డిసెంబర్ నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. 

Also Read మరణించిన మూడో రోజున చంద్రమోహన్ అంత్యక్రియలు - రెండు రోజులు ఆలస్యానికి కారణం ఏమిటంటే?

'భైరా దేవీ' చిత్రానికి శ్రీ జై దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనే కథ, స్క్రీన్ ప్లే, మాటలను అందించారు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించడమే కాదు... రాధిక కుమార స్వామి నిర్మాతగా కూడా వ్యవహరించారు. రంగాయన రఘు, రవి శంకర్, స్కంద అశోక్, అను ముఖర్జీ, మాళవిక అవినాష్, సుచేంద్ర ప్రసాద్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కూర్పు : సి. రవిచంద్రన్, స్టంట్ మాస్టర్‌: రవి వర్మ, కళా దర్శకత్వం : మోహన్ బి కేరు, పాటలు : రామ జోగయ్య శాస్త్రి (తెలుగు), ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు : రవిరాజ్ & యాదవ్‌, ఛాయాగ్రహణం : జేఎస్ వాలి, సంగీత దర్శకుడు : కె.కె. సెంథిల్ ప్రసాద్.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: కాంట్రాక్ట్ ఉద్యోగులకు హైకోర్టు షాకింగ్ న్యూస్, జీవో 16 కొట్టివేస్తూ ఉత్తర్వులు
Telangana News: కాంట్రాక్ట్ ఉద్యోగులకు హైకోర్టు షాకింగ్ న్యూస్, జీవో 16 కొట్టివేస్తూ ఉత్తర్వులు
YS Viveka Case: బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?-  అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?- అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
Pushpa 2 Chennai Event Date: ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
Hydra Commissioner: కూల్చడాలే కాదు, ఆ అధికారులపై సైతం చర్యలు - హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌
కూల్చడాలే కాదు, ఆ అధికారులపై సైతం చర్యలు - హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ram Charan Kadapa Durga Temple | కడప కనకదుర్గ గుడిలో రామ్ చరణ్, బుచ్చిబాబు | ABP DesamRam Charan in Kadapa Ameen Peer Dargah | అయ్యప్పమాలలో దర్గాలోపలికి రామ్ చరణ్ | ABP DesamPM Modi Meets Joe Biden in G20 Summit | పదవి దిగే ముందు మోదీ-బైడెన్‌ భేటీNizamabad Mayor Husband | మేయర్ భర్త ఉంటాడో పోతాడో తెలీదంటూ దాడి చేసిన వ్యక్తి సంచలన వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: కాంట్రాక్ట్ ఉద్యోగులకు హైకోర్టు షాకింగ్ న్యూస్, జీవో 16 కొట్టివేస్తూ ఉత్తర్వులు
Telangana News: కాంట్రాక్ట్ ఉద్యోగులకు హైకోర్టు షాకింగ్ న్యూస్, జీవో 16 కొట్టివేస్తూ ఉత్తర్వులు
YS Viveka Case: బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?-  అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?- అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
Pushpa 2 Chennai Event Date: ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
Hydra Commissioner: కూల్చడాలే కాదు, ఆ అధికారులపై సైతం చర్యలు - హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌
కూల్చడాలే కాదు, ఆ అధికారులపై సైతం చర్యలు - హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Viral News : గంజాయి మొక్కలతో బాల్కనీ గార్డెన్ - రొమాంటిక్ ఫోటోషూట్‌ చేసుకుని సోషల్ మీడియాలో పెట్టిన జంట - కట్ చేస్తే
గంజాయి మొక్కలతో బాల్కనీ గార్డెన్ - రొమాంటిక్ ఫోటోషూట్‌ చేసుకుని సోషల్ మీడియాలో పెట్టిన జంట - కట్ చేస్తే
Investment Tips: ఆర్థిక సంక్షోభంలో ఆపద్బాంధవి 'గోల్డ్ లోన్‌' - ఎన్ని రకాల ప్రయోజనాలో తెలుసా?
ఆర్థిక సంక్షోభంలో ఆపద్బాంధవి 'గోల్డ్ లోన్‌' - ఎన్ని రకాల ప్రయోజనాలో తెలుసా?
BRS News: తెలంగాణ సీఎం రేవంత్ అల్లుడిపై ఈడీకి ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌- చిక్కులు తప్పవా?
తెలంగాణ సీఎం రేవంత్ అల్లుడిపై ఈడీకి ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌- చిక్కులు తప్పవా?
Embed widget