అన్వేషించండి

Sai Durgha Tej - Pawan Kalyan: జనసేనాని నుంచి మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు స్పెషల్ గిఫ్ట్ - దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నుంచి స్పెషల్ గిప్ట్ అందుకున్నారు సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోను ఆయన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

Pawan Kalyan Special Gift: జనసేనాని, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దగ్గర నుంచి టాలీవుడ్ సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ ప్రత్యేక బహుమతి అందుకున్నారు. రీసెంట్ గా తనను కలిసిన సాయికి సావర తెగలు చేసిన పెయింటింగ్ ను అందించారు పవన్. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోను సోషల్ మీడియా ద్వారా సాయి దుర్గ తేజ్ షేర్ చేశారు. ఆయన బహుమతిగా ఇచ్చిన బొమ్మల ప్రత్యేకతను వివరించారు.

సావర తెగల కళను కాపాడుకుందాం!

పవర్ స్టార్ తనకు ఇచ్చే ప్రతి గిఫ్ట్ ఎంతో ప్రత్యేకమైనదని సాయి దుర్గ తేజ్ వెల్లడించారు. “మామయ్య పవన్ కల్యాణ్ దగ్గర నుంచి అందుకునే బ్లెస్సింగ్స్ తో పాటు ఆయన ఇచ్చే ప్రతి గిఫ్ట్ ఎంతో ప్రత్యేకమైనది. ఇప్పుడు నేను తీసుకున్న ఆర్ట్ వర్క్స్ సావర ట్రైబ్ ఆర్టిస్ట్స్ తయారుచేసింది. ఏపీ లేపాక్షి షోరూం నుంచి ఈ పెయింటింగ్స్ తీసుకొచ్చారు. ఏపీలోని ఉత్తరాంధ్ర ఏజెన్సీకి చెందిన ఈ సావర ట్రైబ్ నేచురల్ కలర్స్ తో ఈ పెయింటింగ్స్ గీస్తారు. శతాబ్దాల చరిత్ర ఉన్న సావర తెగల వారి కళ అంతరించిపోతోంది. వీరి ఉనికిని కాపాడాలంటే మనమంతా సావర తెగలు తయారుచేసిన పెయింటింగ్స్, ఇతర అలంకరణ వస్తువులు కొనుగోలు చేసి ప్రోత్సహించాలి. పవన్ కల్యాణ్ గారు ఎవరికైనా బహుమతిగా కొండపల్లి, ఏటి కొప్పాక బొమ్మలతో పాటు సావర తెగల పెయింటింగ్స్ ఇస్తారు. మనమూ ఆ కృషిని, స్ఫూర్తిని కొనసాగించాలి. లేపాక్షి షోరూం సైట్ ద్వారా ఆన్ లైన్ లోనూ ఈ కళాకృతులు కొనుగోలు చేసుకోవచ్చు” అని చెప్పుకొచ్చారు.  

పవర్ స్టార్ ను సాయిదుర్గ తేజ్ ఎందుకు కలిశారంటే?

సుప్రీం స్టార్ సాయి దుర్గ తేజ్ తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన మేనమామ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిశారు. కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. మామ ఆశీస్సులు పొంది సరదాగా మాట్లాడుకున్నారు. తనను హీరోగా తీర్చి దిద్దింది పవన్ కల్యాణ్ అని చెప్పారు. చిన్నప్పటి నుంచి ఆయన తనన వెన్ను తట్టి ప్రోత్సహించారని చెప్పారు. తనకు కావాల్సిన కంప్లీట్ గైడెన్స్ ఇచ్చినట్లు చెప్పారు.

ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్న సాయి దుర్గ తేజ్ 

సాయి దుర్గ తేజ ప్రస్తుతం ఓ ప్రతిష్టాత్మ పీరియాడికల్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నారు. రీసెంట్ గా ఆయన బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. SDT18 వర్కింగ్‌ టైటిల్‌ తో ప్రస్తుతం ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ విడుదల చేసిన ఓ మేకింగ్‌ వీడియో సినిమాపై భారీగా అంచనాలు పెంచింది. ‘హనుమాన్’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను నిర్మించిన కె నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో రోహిత్‌ కేపీ డైరెక్టర్ గా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు.  

Read Also: తోపు లెక్క ఫీల్ అవ్వొద్దన్న ఫైమా... పల్లవి ప్రశాంత్‌పై నోరు పారేసుకున్న గీతూ - సుమ షోలో 'బిగ్ బాస్' మాజీ కంటెస్టెంట్ల రచ్చ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Adani Group: లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలుఅరటిపండు రాకెట్ కూలిపోయింది, ట్రంప్ ముందు పరువు పోయిందిగా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Adani Group: లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
Warangal Bank Robbery: గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
PPP Model Chandrababu:  ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
Adilabad Tiger News Today: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్న పులులు ఎన్ని? అధికారులు ఏం చెబుతున్నారు?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్న పులులు ఎన్ని? అధికారులు ఏం చెబుతున్నారు?
AR Rahman - Mohini Dey: గంటల వ్యవధిలో రెహమాన్ - మోహిని విడాకులు... అసలు విషయం చెప్పేసిన సైరా బాను లాయర్
గంటల వ్యవధిలో రెహమాన్ - మోహిని విడాకులు... అసలు విషయం చెప్పేసిన సైరా బాను లాయర్
Embed widget